ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.. ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పోరేషన్ లిమిటెడ్‌ను విద్యుత్ పంపిణీ సంస్థగా మార్చేసింది… ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పోరేషన్ పేరును ఏపీ రూరల్ అగ్రికల్చర్ పవర్ సప్లై కంపెనీ (ఏపీ రాస్కామ్ )గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది వైఎస్ జగన్ సర్కార్.. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పంపిణీ కోసం విద్యుత్ పంపిణీ సంస్థగా ఏపీ రాస్కామ్ పనిచేయనుంది… ప్రస్తుతానికి రాష్ట్రంలోని మూడు డిస్కంలకు చెందిన విద్యుత్ పంపిణీ వ్యవస్థను వినియోగించుకుని…
ప్రభుత్వ భూముల వేలానికి లైన్ క్లియర్ అయ్యింది.. నిధుల సమీకరణకు ప్రభుత్వ భూముల వేలానికి ఉన్న సాంకేతిక అడ్డంకిని తొలగించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఈ మేరకు గతంలో జారీ చేసిన జీవోలో మార్పులు చేసింది.. 2012లో ప్రభుత్వ భూముల వేలంపై నిషేధం విధిస్తూ జారీ చేసిన జీవోకు మార్పులు చేసింది వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్… నిషేధం అంటూ నాటి జీవోలో పేర్కొన్న నిబంధనను తొలగిస్తూ ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.. ఇక,…
ఏపీ రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులను సీఎం జగన్ దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ భార్యకు సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి మొక్కను అందజేశారు. అనంతరం గవర్నర్‌తో సీఎం జగన్ ఏకాంతంగా 40 నిమిషాల పాటు సమావేశమయ్యారు. నవంబర్ 1న వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ అవార్డుల ప్రధానోత్సవానికి ముఖ్య అతిథిగా రావాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను సీఎం జగన్ ఆహ్వానించారు. అనంతరం శాసనసభా సమావేశాల నిర్వహణ, టీడీపీ కార్యాలయాలపై…
ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్లీనరీలో ఏపీలో పార్టీ పెట్టాలనుకుంటున్నట్లు సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను లోకేష్ ప్రస్తావించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఎద్దేవా చేయడం సీఎంగా మీకు అవమానం అనిపిస్తుందో లేదో కానీ, ఐదుకోట్ల ఆంధ్రులకు మాత్రం ఆ వ్యాఖ్యలు తీరని అవమాకరంగా భావిస్తున్నారని లోకేష్ అభిప్రాయపడ్డారు. మరోవైపు ఏపీ సర్కారు ఎయిడెడ్ విద్యాసంస్థల ఆస్తులపై కన్నేసిందని, ప్రభుత్వం…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగానే వస్తున్న విషయం తెలిసిందే. అయితే, గత బులెటిన్ కంటే.. ఇవాళ కాస్త తక్కువ కేసులే వెలుగుచూశాయి.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 38,896 శాంపిల్స్ పరీక్షించగా.. 381 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో ఒక్క కోవిడ్ బాధితుడు మృతిచెందారు.. ఇదే సమయంలో 414 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. దీంతో.. ఇప్పటి…
ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు అనుకున్న ముచ్చట తీరకుండానే తిరుగు టపా కట్టేశారు. ప్రధాని మోడీ.. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాల అపాయింట్మెంట్ దక్కలేదు. ఇంతకాదు.. అంతకాదు అని బెజవాడలో చెప్పిన టీడీపీ బృందం.. హస్తినలో ఏం చేసింది? ఎందుకు అపాయింట్మెంట్ దక్కలేదు? ఇప్పుడు అమిత్ షా ఫోన్ చేయడం కలిసొస్తుందా? అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించినా కరుణించని ఢిల్లీ పెద్దలు? బోస్డీకే పదం సృష్టించిన సంచలనాలతో ఏపీలో రాజకీయాలు చాలా హీటెక్కాయి. ఇప్పటి వరకు టీడీపీ చేయని డిమాండ్.. రాష్ట్రపతి…
ఏపీలో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. టీడీపీ కార్యాలయాలపై దాడి అంశాన్ని ఆ పార్టీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దృష్టికి తీసుకువెళ్లగా… తాజాగా టీడీపీపై వైసీపీ ఎంపీలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. గురువారం నాడు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన వైసీపీ ఎంపీలు టీడీపీపై ఫిర్యాదు చేశారు. ఏపీలో తెలుగుదేశం పార్టీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని, తక్షణమే ఆ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. Read Also: ఏపీలో కేసీఆర్ పార్టీ పెట్టాలని కోరుకుంటాం:…
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నాడు మరోసారి కుదేలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలకు తోడు దేశీయంగా అమ్మకాల ఒత్తిడిని తట్టుకోలేక సెన్సెక్స్ భారీ నష్టాలను చవి చూసింది. ఉదయం పూట నష్టాలతోనే మొదలైన మార్కెట్లు చివరి వరకు అదే ధోరణిని కొనసాగించాయి. దీంతో గురువారం నాటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 1158 పాయింట్లు దిగజారి 59,984 వద్ద స్థిరపడింది. అటు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ కూడా 353 పాయింట్లు నష్టపోయి 17,857 పాయింట్ల వద్ద ముగిసింది. ఈరోజు…
TTD జంబో జెట్ పాలకమండలి కోసం ప్రభుత్వం చేస్తున్న మరో ప్రయత్నం సక్సెస్ అవుతుందా? ఆర్డినెన్స్ వర్కవుట్ అయ్యేనా? కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకుంటారా? TTDపై తాజాగా జరుగుతున్న చర్చ ఏంటి? సిఫారసులు పెరిగి 81 మందితో జంబో కమిటీ ఏర్పాటు..! తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో సభ్యత్వానికి ఇటీవలకాలంలో బాగా డిమాండ్ పెరిగింది. తినగ తినగ వేము తియ్యనుండు అన్నట్టుగా TTD బోర్డులోకి ఒక్కసారి అడుగుపెట్టిన వారు.. రెండుసార్లు కాదు.. మూడుసార్లు కాదు.. నాలుగోసారి…
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో విషాదం నెలకొంది. తండ్రి మందలించాడన్న మనస్తాపంతో ఓ విద్యార్థి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.పట్టణంలోని విజయ నగర్ కాలనీకి చెందిన నాగయ్య అనే హమాలీ మొదటి కుమారుడు నవీన్ యాదవ్(21) పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో పాలిటెక్నిక్ సెకండియర్ చదువుతున్నాడు. గత కొద్దిరోజులుగా నవీన్ రాత్రి సమయాల్లో ఆలస్యంగా ఇంటికి వెళ్తుండేవాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి నవీన్ ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో తండ్రి నవీన్‌కి ఫోన్ చేసి మందలించాడు.…