కడప జిల్లాలోని బద్వేల్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.. ఇవాళ ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది.. రాత్రి 7 గంటల వరకు కొనసాగనుంది.. అయితే, ఈ ఎన్నికల్లో టీడీపీ పోటీకి దూరంగా ఉన్నా.. ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు బీజేపీ తరపున ఏజెంట్లుగా కూర్చోవడం చర్చగా మారింది. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కన్నుమూయడంతో వచ్చిన ఈ ఎన్నికల్లో టీడీపీ తన అభ్యర్థిని పెట్టలేదు.. కానీ, బీజేపీ పోటీకి నిలిచింది.. అయితే, ఆ పార్టీకి సరైన…
తెలుగు రాష్ట్రాల్లో శనివారం నాడు ఉప ఎన్నికల హడావిడి నెలకొంది. ఏపీలోని బద్వేలు, తెలంగాణలోని హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో శనివారం నాడు ఉప ఎన్నికలు జరగనున్నాయి.ముఖ్యంగా హుజురాబాద్‌లో పోటీ టీఆర్ఎస్, బీజేపీల మధ్య ఉండనుంది. టీఆర్ఎస్ తరఫున గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీజేపీ తరఫున ఈటెల రాజేందర్ బరిలో ఉన్నారు. ఇప్పటికే తెలంగాణలో హుజురాబాద్ ఉప ఎన్నిక చాలా కాస్ట్లీ అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ ఎన్నికలో గెలుపు ఇరుపార్టీలకు చాలా అవసరం. ప్రజల్లో తమపై వ్యతిరేకత…
రైతు ఆత్మహత్యల్లో ఏపీ మూడో స్థానం అనడంలో వాస్తవం లేదు అని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. రైతు భరోసా మొదలుకొని వైఎస్సార్ జలకళ వరకూ అనేక పథకాలు అమలు చేస్తున్నాం. తొలి క్యాబినెట్ లోనే ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు 7 లక్షల పరిహారం అందించాలని ఆదేశించిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్. గత ప్రభుత్వంలో సాంకేతిక కారణాల వల్ల ఈ పథకం కింద రాని వారికి 450 మందికి అదనంగా ఇచ్చాం. 2020లో…
2019తో పోలిస్తే 2020లో దేశవ్యాప్తంగా 18 శాతం రైతుల ఆత్మహత్యలు పెరిగాయి. దేశంలో రైతుల ఆత్మహత్యల అంశంపై నేషనల్ క్రైం రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) విడుదల చేసిన నివేదిక ప్రకారం 2020లో 10,677 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ జాబితాలో మహారాష్ట్ర టాప్‌లో నిలిచింది. ఆ రాష్ట్రంలో 4,006 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ లిస్టులో తెలుగు రాష్ట్రాలు టాప్-5లో ఉండటం గమనించాల్సిన విషయం. Read Also: వాహనదారుల్లో రాని మార్పు 2020లో రైతుల…
తెలంగాణ సీఎం కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఏపీ మంత్రి పేర్ని నాని తనదైన శైలిలో సెటైర్లు వేశారు. నదీ జలాల వినియోగం విషయంలో కేసీఆర్ మాట తప్పారని, దిండి, పాలమూరు వంటి ప్రాజెక్టుల్లో తాగునీరు పేరుతో సాగుకు నీళ్లు మళ్ళించారని మంత్రి పేర్ని నాని ఆరోపించారు. తమకు కేటాయించిన నీళ్లకు అదనంగా చెంచాడు నీళ్లు కూడా వాడుకోబోమని ఎప్పుడో చెప్పామన్నారు. రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత విషయంలో హైదరాబాద్ నుంచి విజయవాడకు ఎంత దూరమో…
ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి, డ్రగ్స్ పాలిటిక్స్ తీవ్రస్థాయిలో విమర్శలు, బూతుల వరకు వెళ్లాయి.. ఇప్పటికే పలు సందర్భాల్లో ఈ విషయాన్ని లేవనెత్తిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. మరోసారి సోషల్ మీడియా వేదికగా ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు.. 2018 నుంచి తాను గంజాయి స్మగ్లింగ్ విషయాన్ని హైలైట్ చేస్తూనే ఉన్నానని గుర్తుచేసిన ఆయన.. వైసీపీ హయాంలో గంజాయి స్మగ్లింగ్ మరింత పెరిగిందని ఆరోపించారు. ఇక, ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో గంజాయి సమస్య ఇప్పుడు కొత్తగా…
ఏపీ టీడీపీ అధ్యక్షుడు.. మాజీ అధ్యక్షుడి మధ్య వార్ నడుస్తోందా? పార్టీ నుంచి బహిష్కరించిన నేతకు ప్రాధాన్యం ఇవ్వడంతో నిప్పు రాజుకుందా? శ్రీకాకుళం టీడీపీలో హాట్ టాపిక్‌గా మారిన సంఘటనలు ఏంటి? లెట్స్ వాచ్..! కళా వెంకట్రావు వ్యతిరేక వర్గానికి అచ్చెన్న దన్ను..? అచ్చెన్నాయుడు.. ఏపీ టీడీపీ అధ్యక్షుడు. కళా వెంకట్రావు.. ఏపీ టీడీపీ మాజీ అధ్యక్షుడు. ఇద్దరూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారే. పైకి నవ్వుతూ కనిపించినా.. ఇద్దరి మధ్య కోల్డ్ వార్ ఉందన్నది పార్టీలో…
మత్తు రాజకీయంలోకి జనసేన కూడా ఎంటరైందా? ఇరికించామని టీడీపీ.. కౌంటర్ ఇచ్చామని అధికార పార్టీ అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా తెర మీదకు వచ్చారు జనసేనాని. పొలిటికల్‌గా అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేశారా? లేక చంద్రబాబు మనిషిగానే పవన్ కల్యాణ్ కామెంట్స్ పాస్ చేశారా? గంజాయిపై వరసగా ట్వీట్స్ రిలీజ్ చేస్తోన్న పవన్..! ఏపీలో రాజకీయం మత్తులో జోగుతోంది. ఉదయం లేచింది మొదలు అధికార పార్టీ.. ప్రతిపక్ష టీడీపీ.. డ్రగ్స్.. హెరాయిన్.. గంజాయి అంటూ మాటల తూటాలు పేల్చుకుంటున్నాయి.…
రౌడీ షీటర్లకు చుక్కలు చూపించేందుకు సిద్ధం అవుతున్నారు ఏపీ పోలీసులు… కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్.. రౌడీ షీటర్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. రౌడీ షీటర్లకు ప్రభుత్వ పథకాలు అందకుండా చర్యలు తీసుకుంటామంటూ.. కృష్ణా జిల్లాలో రౌడీ షీటర్ల కౌన్సిలింగ్ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు.. జిల్లా వ్యాప్తంగా రెండు కంటే ఎక్కువ కేసుల్లో ఉన్నవారిని కౌన్సిలింగుకు పిలిపించాం.. రాబోయే రోజుల్లో చేసే స్పెషల్ యాక్షన్ ప్లాన్ వివరించాం.. పాత నేరస్ధులపై నిఘా పెంచుతామని వెల్లడించారు.. ఇక, రౌడీషీట్లు,…
ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు వాతావరణశాఖ అధికారులు.. నైరుతి బంగాళాఖాతంలోని అల్పపీడనం ప్రస్తుతం శ్రీలంక తీరానికి దగ్గరగా కేంద్రీకృతమైందని.. దీనికి అనుబంధంగా సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. దీనికి అనుబంధంగా వాయువ్య బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి విస్తరించిందని వెల్లడించిన ఐఎండీ.. వీటి ప్రభావంతో రానున్న మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా ఓ…