ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి కారణమేంటి?: కేంద్రానికి ఏపీ హైకోర్టు ప్రశ్న
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై శనివారం హైకోర్టులో విచారణ జరిగింది. పార్లమెంట్ సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన హామీని అమలు చేయడం లేదని పేర్కొంటూ అమలాపురానికి చెందిన న్యాయవాది రమేష్ చంద్రవర్మ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా విచారణ చేపట్టిన కోర్టు… ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి గల కారణాలేంటో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చినప్పుడు.. ఏపీకి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించింది.
Read Also: రైతులకు శుభవార్త… చివరి గింజ వరకు కొంటాం: కేసీఆర్
Also Read
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
- Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
ఈ కేసులో పిటిషనర్ తరఫున న్యాయవాది ఎం.రామారావు కోర్టులో వాదనలు వినిపించారు. ఏపీని ఆదుకునేందుకు అప్పటి ప్రధాని పార్లమెంట్‌లో ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. ఈశాన్య, హిమాలయ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చిన కేంద్రం.. ఏపీ విషయంలో మాత్రం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదన్నారు. న్యాయవాది వాదనలతో ఏకీభవించిన కోర్టు… విభజనతో ఏపీ నష్టపోయిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. అటు కేంద్ర ప్రభుత్వం తరఫున హరినాథ్ వాదనలు వినిపించారు. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టులో వ్యాజ్యాలు పెండింగ్‌లో ఉన్నాయని ఆయన తెలిపారు. ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాలకు ఏపీకి భౌగోళిక పరిస్థితుల విషయంలో తేడాలున్నాయని పేర్కొన్నారు. కాగా ఈ కేసులో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం సైతం వివరాలు సమర్పించాలని చెప్పింది. తదుపరి విచారణను డిసెంబర్ 20వ తేదీకి వాయిదా వేసింది.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!