వైసీపీకి చెందిన సర్పంచ్ భర్తపై వార్డ్ మెంబర్ తిరుగుబాటు చేసిన ఘటన రేపల్లె నియోజకవర్గంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితేగుంటూరు జిల్లా, రేపల్లె మండలం, ఉప్పూడి పంచాయతీకి చెందిన 8వ వార్డ్ మెంబర్ రాసిన లేఖ కలకలం సృష్టించింది. సర్పంచ్ భర్త ఇమ్మానియేల్ .. తనను ఐదు నెలలుగా అవమానిస్తున్నాడని ఆరోపిస్తూ ఉప్పూడి ఎనిమిదో వార్డ్ మెంబర్ పీ.హరీష్ బాబు లేఖలో పేర్కొన్నాడు. తన భార్యకు డ్వాక్రా యానిమేటర్ ఉద్యోగం ఇప్పిస్తానని ఐదు నెలలుగా ఇమ్మానియేల్ తిప్పించకున్నాడని హరీష్ బాబు…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధం అయ్యింది.. ఎల్లుండి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కీలక ఆర్డినెన్స్‌లపై ఫోకస్ పెట్టింది సర్కార్.. అసెంబ్లీ ఆమోదానికి కీలక ఆర్డినెన్సులు తీసుకురానున్నారు. ఈ ఏడాది జులై నుంచి ఇప్పటి వరకు వివిధ శాఖలకు సంబంధించి 14 ఆర్డినెన్సులను జారీ చేసింది ప్రభుత్వం.. ఒకే రోజున 14 ఆర్డినెన్సులను శాసనసభ, శాసన మండలి ఆమోదించేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.. ఆమోదానికి రానున్న ఆర్డినెన్స్‌లు: ఏపీ శాసనసభ శీతాకాల సమావేశాల్లో ఆమోదానికి రానున్న ఆర్డినెన్స్‌ల…
ఏపీలో ఇవాళ కరోనా కేసులు కాస్త తగ్గాయి. ఇక తాజా బులిటెన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 26, 514 శాంపిల్స్ పరీక్షించగా.. 191 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో ఇద్దరు కరోనా బాధితులు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 416 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,00,31,083 కు చేరుకోగా… మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,70,286 కు…
ఏపీలో 10 జెడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ ప్రారంభం అయింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనున్నది. మొత్తం 8 లక్షల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోబోతున్నారు. కాగా, గతంలో వివిధ కారణాలతో ఎన్నికలు నిలిచిపోయిన స్థానాల్లో ఇప్పుడు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల పోలింగ్ కోసం 954 కేంద్రాలను ఏర్పాటు చేశారు. Read: యూపీ పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ల్యాండింగ్ కానున్న ప్రధాని విమానం… 10…
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో జరిగిన వర్చువల్ సమావేశంలో వివిధ ప్రతిపాదనలు కేంద్రం ముందు పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. కర్నూల్ జిల్లా ఓర్వకల్లు ఎయిర్ పోర్టు కోసం ఏపీ ఖర్చు పెట్టిన రూ. 176 కోట్ల నిధులను రీ-ఇంబర్స్ చేయాలని కోరిన ఏపీ.. ఉడాన్ పథకంలో భాగంగా ఓర్వకల్లు ఎయిర్ పోర్టు నిర్మాణం కోసం పెట్టిన ఖర్చుని తిరిగివ్వాలని ప్రతిపాదనలు చేసింది.. ఇక, భోగాపురం ఎయిర్ పోర్టు వినియోగంలోకి వచ్చాక.. విశాఖ విమానాశ్రయాన్ని 30 ఏళ్ల పాటు…
తుఫాన్ వల్ల పంట నష్టపోయిన రైతులకు గుడ్‌న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఆర్థిక సహకారం అందించాలని నిర్ణయించింది.. ఈ ఏడాది సెప్టెంబర్‌లో వచ్చిన గులాబ్ సైక్లోన్ వల్ల పంట నష్టపోయిన 34,586 మంది రైతులకు పరిహారం అందించనున్నారు… సంబంధిత రైతుల ఖాతాల్లో 22 కోట్ల రూపాయల పంట నష్ట పరిహారం అందించనుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్.. రేపు రైతుల ఖాతాల్లో నేరుగా ఆ సొమ్మును జమ చేయనున్నారు సీఎం…
దాచేపల్లి, గురజాల నగర పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆరోపించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీపై నిప్పులు చెరిగారు. వైసీపీ ప్రజాస్వామ్యాన్ని పాతరేసింద న్నారు. నామినేషన్లు అడ్డుకొని పరిశీలనలో తొలగించడం, అభ్యర్థు లను కిడ్నాప్ చేయాలని చూడటం, పోలింగ్ బూత్‌లను ఆక్రమించు కోవాలని చూడటం ఇవన్నీ ఏంటని ఆయన ప్రశ్నించారు. జంగ మహేశ్వరపురంలో నామినేషన్స్ వేయకుండా అడ్డుకున్నారు. పోలీస్ యంత్రాంగాన్ని ఎలా ఉపయోగించుకోవాలో అలానే ఉపయోగిం చారంటూ…
గంజాయి వ్యవహారంపై గత కొంతకాలంగా ఏపీలో పెద్ద ఎత్తున చర్చ సాగుతూనే ఉంది.. ఈ విషయంలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి ప్రతిపక్షాలు… పలు ప్రాంతాల్లో గంజాయి పట్టుబట్టడం.. అవి ఏపీకి లింక్‌లు ఉన్నాయనే వార్తలతో ప్రత్యేకంగా గంజాయి నివారణ చర్యలను చేపట్టింది ఏపీ ప్రభుత్వం.. ఈ విషయంపై మీడియాతో మాట్లాడిన ఏపీ డిప్యూటీ సీఎం కె. నారాయణ స్వామి.. ఆపరేషన్ పరివర్తన్‌లో భాగంగా ఎస్ఈబీ, పోలీసు శాఖ కలిసి ఇప్పటి వరకు 2,228 ఎకరాల్లో గంజాయి పంటను…
ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో సమావేశం అయ్యారు రాష్ట్ర బీజేపీ నేతలు.. అయితే, ఈ సమావేశంలో ఏపీ నేతలకు అమిత్‌షా పెద్ద క్లాసే తీసుకున్నారట.. ఏపీ కో-ఇంచార్జ్ సునీల్ దేవధర్, ఎంపీ జీవీఎల్‌కి ప్రత్యేకంగా ఆయన క్లాస్ పీకినట్టు సమాచారం.. వైసీపీయే మన ప్రధాన శత్రువు… ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని సూచించిన ఆయన.. అమరావతే ఏపీ రాజధాని అన్నది బీజేపీ స్టాండ్.. రైతుల పాదయాత్రకు సంఘీభావం తెలపాలని సూచించారు.. జనసేనా…
పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం కొత్తనవరసపురంలో రోడ్లు అధ్వాన్నంగా మారాయి. ముఖ్యంగా కొత్తనవరసపురం నుంచి విశాఖ జిల్లా యలమంచిలి మండలం మేడపాడు వరకు సుమారు 15 కిలోమీటర్ల రహదారి గోతులమయంగా తయారైంది. దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నర్సాపురం మండలంలోని పలు గ్రామాల ప్రజలు ఈ రోడ్డు గుండా నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో రహదారి దుస్థితిపై గ్రామ పెద్దలు ప్రజాప్రతినిధులను సంప్రదించినా ఫలితం దక్కలేదు. Read Also: ప్రకాశ్ రాజ్ మౌనవ్రతం! ఎందుకంటే……