జగన్ వెళ్లింది పరామర్శలకా? సెల్ఫీలు తీసుకోవడానికా?: లోకేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లింది ఎందుకంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఓ ఫోటోను షేర్ చేశారు. ‘ముఖ్యమంత్రి గారూ… మీరు వెళ్లింది మీ ఇసుక మాఫియాల కోసం జలసమాధి అయిపోయిన 60 మంది కుటుంబసభ్యులను పరామర్శించడానికి. మీ వంధిమాగదులతో సెల్ఫీలు తీసుకోవడానికి కాదు’ అని లోకేష్ ఆరోపించారు.
ముఖ్యమంత్రి గారూ! మీరు వెళ్లింది మీ ఇసుకమాఫియాల కోసం జలసమాధి అయిపోయిన 60 మంది కుటుంబసభ్యుల్ని పరామర్శించడానికి! మీ వంధిమాగధులతో సెల్ఫీలు తీసుకోవడానికి కాదు.(1/2) pic.twitter.com/xbZXqDFfJd
Also Read
— Lokesh Nara (@naralokesh) December 2, 2021
‘మీరు వెళ్లింది.. మీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో వచ్చిన విపత్తు వల్ల జరిగిన వేలకోట్ల నష్టం పరిశీలించడానికి. ప్రజల్ని దూరం పెట్టి పళ్లు ఇకిలిస్తూ ఫోటోలు దిగడానికి కాదు. జనం బాధలు మీకు అంత పైశాచిక ఆనందం కలిగిస్తున్నాయా?’ అంటూ లోకేష్ సూటిగా ప్రశ్నించారు. లోకేష్ షేర్ చేసిన ఫోటోలో సీఎం జగన్‌తో పాటు మంత్రి ఆదిమూలపు సురేష్, వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి ఉన్నారు. అంతేకాకుండా వరద బాధితులతో సీఎం జగన్ నవ్వుతున్న ఫోటోలను కూడా లోకేష్ షేర్ చేశారు. కాగా ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ వరద ప్రభావిత జిల్లాలలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!