ఏపీలో మున్సిపల్ ఎన్నికలు ముగియడంతో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వైసీపీ ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు రావాలన్న టీడీపీ నేత అచ్చెన్నాయుడికి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. ‘మమ్మల్ని రాజీనామా చేసి రమ్మంటున్నారు. ఈ ఎన్నికల్లో ఏం పీకారు. దమ్ముంటే టీడీపీలో మిగిలిన 19 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి గెలవండి చూద్దాం. 19 మందిలో మీకు సింగిల్ డిజిట్ వస్తే మేం రాజీనామా చేస్తాం’…
బాబాయ్ ఒక పార్టీలో ముఖ్య నేత. అబ్బాయి మరొక పార్టీలో యువనేత. నిన్న మొన్నటి వరకు కలిసిమెలిసి ఉన్న ఆ కుటుంబంలో రాజకీయ క్రీడ మొదలైందా? ఇంతకు ఎవరా అబ్బాయ్.. ఎవరా బాబాయ్? లెట్స్ వాచ్..! భూపేష్రెడ్డే రాజకీయ వారసుడిగా అప్పట్లో ఆదినారాయణరెడ్డి ప్రకటన..! దేవగుడి కుటుంబంలో రాజకీయ చిచ్చు రగులుకునేలా కనిపిస్తోంది. ఎన్నిరకాల ఒడిదుడుకులు ఎదురైనా ఒక్కటిగా ఉన్న ఆ కుటుంబం ఇప్పుడు రెండుగా చీలిపోనుందా? ఏ రాజకీయం అయితే వారిని కలిపిందో.. అదే రాజకీయం…
ఏపీలో గడిచిన 24 గంటల్లో కరోనా పాజిటివ్ కేసులు కాస్త పెరిగాయి. తాజా హెల్త్ బులెటిన్ ప్రకారం… నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 35,332 శాంపిళ్లను పరీక్షించగా 230 మందికి కరోనా పాజిటివ్ ఉందని నిర్ధారింపబడింది. కరోనాతో మరో ముగ్గురు మరణించారు. చిత్తూరు, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,70,516కి చేరగా.. మొత్తం కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 14,421కి చేరింది. గడిచిన 24 గంటల్లో 346…
గురువారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అయితే ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయన్న విషయంపై స్పష్టత లేదు. ఆరునెలల విరామం తర్వాత అసెంబ్లీ జరగనుండటంతో పలు కీలక ఆర్డినెన్సులను ఆమోదించాలని సభ ముందుకు ప్రభుత్వం తీసుకురానుంది. ఈ ఏడాది జులై నుంచి ఇప్పటివరకు వివిధ శాఖలకు సంబంధించి ప్రభుత్వం 14 ఆర్డినెన్సులను జారీ చేసింది. ఒకేరోజున 14 ఆర్డినెన్స్‌లను శాసనసభ, శాసన మండలి ఆమోదించేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. Read Also: అసెంబ్లీ సమావేశాల్లో…
విద్యారంగంలో తమ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల అమలుపై సీఎం జగన్ బుధవారం నాడు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా 2021–22 నుంచి 2022–23, 2023–24 వరకూ మూడు విద్యా సంవత్సరాల్లో నూతన విద్యా విధానం మూడు దశలుగా పూర్తిగా అమలు కానున్నట్లు అధికారులు సీఎంకు చెప్పారు. దీనిలో భాగంగా 25,396 ప్రైమరీ పాఠశాలలను యూపీ(అప్పర్ ప్రైమరీ) స్కూళ్లు, హైస్కూళ్లలో విలీనం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో రానున్న విద్యా సంవత్సరంలో టీచర్ల సంఖ్యను…
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్లు గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ఈ నెల 15న పరీక్షలు జరపగా ఇవాళ కరోనా పాటిటివ్ తేలిందన్నారు. ప్రస్తుతం గవర్నర్ బిశ్వభూషన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. గవర్నర్ బిశ్వభూషణ్‌ను అస్వస్థతకు గురికావడంతో విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించారు. దిల్లీ పర్యటన ముగించుకొని విజయవాడ చేరుకున్న ఆయన రెండు రోజులుగా దగ్గు, జలుబుతో ఇబ్బంది పడుతున్నారు. ముందు…
ఏపీలో ఏ ఎన్నిక జరిగినా టీడీపీకి పరాభవం మాములు విషయంగా మారిపోయింది. రాజకీయాలు అన్న తర్వాత గెలుపోటములు మాములే. అయితే ఓ ఎన్నికలో పరాభవం ఎదురైతే.. తరువాత జరిగే ఎన్నికల్లో పుంజుకోవాలని ఏ రాజకీయ పార్టీ అయినా భావిస్తుంది. ఈ మేరకు వ్యూహాలకు పదును పెట్టి ప్రత్యర్థిపై పోటీకి సై అంటుంది. కానీ ఏపీలో ప్రతిపక్ష టీడీపీ మాత్రం ఓటములను సీరియస్‌గా తీసుకున్న దాఖలాలు కనిపించడంలేదు. 2019 అసెంబ్లీ ఎన్నికలు మొదలు.. ఇప్పటి లోకల్ బాడీ ఎన్నికల…
ఏపీలో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ ఘనవిజయం సాధించింది. ప్రకాశం జిల్లాలోని దర్శి మున్సిపాలిటీని మినహాయిస్తే మిగతా అన్ని చోట్ల వైసీపీ విజయఢంకా మోగించింది. నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలు జరిగిన 54 స్థానాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈ సందర్భంగా ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ సోషల్ మీడియా ద్వారా ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. Read Also: వైఎస్ వివేకా కేసులో మరో నిందితుడు అరెస్ట్ ప్రజలు ప్రభుత్వానికి 100కు 97…
కృష్ణా జిల్లాలోని ఓ ఆలయంలో ధ్వజస్తంభం ప్రతిష్టాపన కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ సమీపంలోని మల్లపల్లి గ్రామంలోని ఓ ఆలయంలో బుధవారం నాడు ధ్వజస్తంభం ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వాహకులు తలపెట్టారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఈ మేరకు పండితులు నిర్ణయించిన ముహూర్తం మేరకు శివాలయంలో క్రేన్ సహాయంతో ధ్వజస్తంభన ప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్న సమయంలో… క్రేన్ నుంచి ధ్వజస్తంభం జారి కింద పడింది. Also Read: వైరల్… హద్దులు…
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ పూర్తిగా మున్సిపల్ ఎన్నికల ఫలితాల కోలహలం ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్ల ఫలితాల్లో వైసీపీ పార్టీ దుమ్ము దులుపుతోంది. దర్శి మినహా దాదాపు అన్ని మున్సిపాలటీలు వైసీపీ కైవసం అయినట్లు సమాచారం అందుతోంది. అయితే..ఈ ఫలితాల్లో వైసీపీ దూసుకుపోతుంటే… ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గనకు మాత్రం ఊహించని షాక్ తగిలింది. బుగ్గన రాజేంద్ర నాథ్ నివాసం ఉండే 15 వ వార్డులో వైసీపీ పార్టీ పరాజయం పాలైంది. వైసీపీ తరఫున…