గంజాయి, డ్రగ్స్ విక్రయాలు ఆందోళన కలిగిస్తున్నాయి.. వాటి సరఫరాకు ఉన్న ఏ అవకాశాన్ని వదలడం లేదు కేటు గాళ్లు.. లారీలు, కార్లు, ఆటోలు, టూ విలర్, చివరకు విమానాల్లో కూడా మత్తు పదార్థాలు పెద్ద ఎత్తున పట్టుబడుతూనే ఉన్నాయి.. కేజీలు, క్విటాళ్ల కొద్ది గంజాయి దొరికిన సందర్భాలు లేకపోలేదు. అయితే, స్మగ్లర్లు రూట్ మార్చారు.. ఆధునిక యుగంలో అంతా ఆన్లైన్ అయిపోయింది.. ఏ వస్తువు కావాలన్నా ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫారమ్స్ను ఆశ్రయిస్తున్నారు వినియోగదారులు. ఇప్పుడు గంజాయి విక్రయాలు…
కుప్పం మొత్తం ఓటర్లు సుమారుగా 37 వేలు. మొదటి సారి మున్సిపాలిటీ అయిన కుప్పం ఎన్నికల గురించి చంద్రబాబు మాట్లాడిన వ్యాఖ్యలు చూస్తే బాధేసింది అని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. ఇటువంటి వ్యక్తిని రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఎలా భరించింది అనిపించింది. జనసేన, టీడీపీ, బీజేపీ ఒకే తాను ముక్కలు. ఈ మూడు పార్టీలు లోపాయకారి ఒప్పందం చేసుకుని వ్యవహరిస్తున్నాయి. చంద్రబాబు కుప్పాన్ని చెరబట్టారు. ఆయన చెరలో కుప్పం దశాబ్దాలుగా నలిగిపోయింది.…
ఏపీలో ఎయిడెడ్ స్కూళ్లను ప్రభుత్వ స్కూళ్లలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ సోషల్ మీడియాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ‘అప్పుడు అమ్మ ఒడి… ఇప్పుడు అమ్మకానికో బడి’ అంటూ ఆదివారం విమర్శలు చేసిన పవన్.. సోమవారం కూడా ట్విట్టర్ వేదికగా వైసీసీని ఉద్దేశిస్తూ ఓ పోస్టు చేశారు. కర్ణాటక మంగుళూరు ప్రాంతంలో హరికేళ హజబ్బ అనే పండ్ల వ్యాపారి అందరికీ స్ఫూర్తిదాయకమని పవన్ ప్రశంసించారు. Read Also: డేవిడ్ వార్నర్‌పై…
ఆ ఇద్దరు అనూహ్యంగా ట్రాక్ మీదకు వచ్చారు. వస్తూ వస్తూనే పదవి ఎగరేసుకుని పోయారు. ఈసారి తమకు ప్లేస్మెంట్ ఖాయం అనుకున్న నేతలు నోరెళ్లబెట్టారు. లెక్కలు మనం వేసుకుంటే ఫలితం రాదు.. నాయకుడు వేస్తేనే వస్తాయని సైలెంట్ అయ్యారట. రెండు పేర్లు చివరి నిమిషంలో రేస్‌లోకి వచ్చాయా? ఆంధ్రప్రదేశ్‌లో 14 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అభ్యర్ధుల ఎంపికపై వైసీపీ హైకమాండ్ కొద్దిరోజులుగా కసరత్తు చేసింది. సామాజికవర్గాల ఈక్వేషన్స్‌లో 50-50 శాతం రేషియో పాటిస్తున్న సీఎం జగన్…
ఏపీలో ఇవాళ మళ్లీ కరోనా కేసులు భారీ పెరిగాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 32,630 శాంపిల్స్ పరీక్షించగా.. 208 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో ముగ్గురు కోవిడ్ బాధితులు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 247 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 2,99,83,209 కు చేరుకోగా… మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,69,978 కు పెరిగింది.. ఇక, 20,52,477 మంది…
టీడీపీ పై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది వైసీపీ. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ మద్యం, డబ్బు విచ్చలవిడిగా పంచుతోందని ఎస్ఈసీ కి ఫిర్యాదు చేసారు. వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి. దొంగ ఓటర్లను తరలిస్తున్నారని ఫిర్యాదు చేసారు. స్థానిక ఎన్నికల్లో టిడిపి అక్రమాలకు పాల్పడుతోంది. చంద్రబాబు పాట్లు చూస్తే జాలి కలుగుతోంది. ఉనికి కోసం నానా రకాలుగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఓటుకు ఐదు వేలు నుంచి పదివేలు ఇస్తున్నారు. అధికారులను బెదిరిస్తున్నారు. ఏ…
ఓ కీలకమైన విషయానికి సంబంధించి ప్రభుత్వం ఆ పెద్దాయన్ని సలహాదారుగా నియమించుకుంది. సలహాలతో ప్రభుత్వానికి సరైన గైడెన్స్ ఇవ్వడమో.. లేక సమన్వయమో చేయాలి. ఆ సలహాదారు మాత్రం టచ్ మీ నాట్‌గా ఉండిపోయారు. తాను చెప్పినా ఎవరూ వినరని నిస్తేజమా? నాకెందుకులే అనే భావనా? ఏదీ అర్థం కాకుండా ఉందట. మరి ఆయనకు పదవి ఇచ్చి ఏ లాభం అనే చర్చ అప్పుడే మొదలైపోయిందట. ఇంతకీ ఎవరాయన? ఉద్యమంలో ఉద్యోగులు.. సలహాదారు సన్మానాల్లో..! చంద్రశేఖర్ రెడ్డి. APNGO…
అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్రను టీడీపీ నేతలు పూర్తిగా తమ పాదయాత్రగా మార్చేసుకున్నారని వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు ఆరోపించారు. రైతుల పాదయాత్రను తమకు అనుకూలంగా మార్చుకుని పసుపుమయంగా చేశారని మండిపడ్డారు. అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రలో నియోజకవర్గాల వారీగా టీడీపీ నేతలు పాల్గొనడమే దీనికి నిదర్శనమన్నారు. పోలీసులు రైతుల పాదయాత్రను ఎక్కడా అడ్డుకోలేదని.. కేవలం టీడీపీ శ్రేణులను మాత్రమే అడ్డుకున్నారని ఎమ్మెల్యే సుధాకర్‌బాబు స్పష్టం చేశారు. Read Also: శ్రీశైలం వెళ్లే పర్యాటకులకు గమనిక.. బోట్ సర్వీస్…
విశాఖ నగరంలో ఆదివారం తెల్లవారుజామున పలుచోట్ల స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మధురానగర్, బీచ్ రోడ్డు, మురళీనగర్, కంచరపాలెం, అక్కయ్యపాలెం, అల్లిపురం, తాటిచెట్లపాలెం, బంగారమ్మపేట, జ్ఞానాపురం, తదితర ప్రాంతాల్లో భూప్రకంపనలు వచ్చాయి. అందరూ నిద్రలో ఉన్న సమయంలో భూమి కంపించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. కాగా సమాచారం తెలుసుకున్న అధికారులు భూప్రకంపనలకు గల కారణాలను విశ్లేషిస్తున్నారు. Read Also: నాలుగు రాష్ట్రాలలో…
ఏపీలో ఇవాళ 69 పంచాయతీల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసినా.. కేసుల కారణంగా కొన్ని చోట్ల.. అభ్యర్థుల మరణంతో మరికొన్ని చోట్ల.. గొడవలు జరిగి ఇంకొన్ని చోట్ల… ఎన్నికలు నిలిచిపోయాయి. వీటిన్నింటికీ ఒకేసారి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇవాళ 69 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించి… పోలింగ్ ముగిశాక ఓట్లు లెక్కపెట్టి విజేతను ప్రకటిస్తారు. ఇక రేపు నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు 12 మున్సిపాల్టీలకు ఎన్నికలు జరుగుతాయి. ఇందులో ఆకీవీడు, జగ్గయ్యపేట, కొండపల్లి, దాచేపల్లి, గురజాల,…