తిరుపతి పర్యటనకు సీఎం జగన్ బయలుదేరారు. గన్నవరం విమానాశ్రయం నుంచి తిరుపతికి బయలుదేరారు సీఎం జగన్. అయితే ఈరోజు 8.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేరుకోనున్నారు. హోమ్ మంత్రి అమిత్ షా కు రేణిగుంట విమానాశ్రయంలో స్వాగతం పలుకనున్నారు ముఖ్యమంత్రి జగన్. అమిత్ షాతో కలిసి శ్రీ వారిని దర్శించుకుని రాత్రికి తిరిగి తాడేపల్లికి చేరుకోనున్నారు సీఎం జగన్. అయితే హోమ్ మంత్రి అమిత్ షా పర్యటన పైన సర్వత్రా ఆసక్తి…
ఏపీలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కుప్పంలో వాతావరణం పొలిటికల్‌గా హాట్‌హాట్‌గా కనిపిస్తోంది. చంద్రబాబు సొంత నియోజకవర్గం అయిన కుప్పంలో పాగా వేయాలని అధికార పార్టీ వైసీపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. దీంతో అధికార, విపక్షాల మధ్య పొలిటికల్ వార్ జరుగుతోంది. కుప్పంలో ఓటు అడిగే నైతిక హక్కు వైసీపీకి లేదని ఇప్పటికే నారా లోకేష్ విమర్శలు చేశారు. దీంతో వైసీపీ నేతలు లోకేష్‌కు వరుసగా కౌంటర్ ఇస్తున్నారు. లోకేష్‌పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే రోజా…
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థలకు జరుగుతోన్న ఉప ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులను గెలిపించాలంటూ విజ్ఞప్తి చేశారు జనసేనాని పవన్ కల్యాణ్.. స్థానిక ఎన్నికల్లో జనసేన అభ్యర్థులను ఆశీర్వదించండి.. ఒక మార్పు కోసం ఈ పోరాటం జరుగుతోంది.. జన సైనికులు పదవుల కోసం కాకుండా సేవచేయడానికే ముందుంటారు.. ప్రజల కోసం పని చేసే వారికే అభ్యర్థులుగా నిలబెట్టాం అని… ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాటుపడేవారినే ఈ ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేస్తున్నారు.. పార్టీ భావజాలాన్ని అర్థం…
మరోసారి టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ని టార్గెట్ చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి… జీవీఎంసీ ఉపఎన్నికల్లో అల్లిపురం దగ్గర ఇంటింటా ప్రచారం నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కుప్పంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఉప ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుంది… ఎటువంటి సందేహం లేదని ధీమా వ్యక్తం చేశారు.. ఫలితాల తర్వాత టీడీపీ తుడిచిపెట్టుకొని పోతుందని జోస్యం చెప్పిన సాయిరెడ్డి.. నారా లోకేష్ భాష అసభ్యంగా, తలవంపులు తెచ్చే విధంగా ఉందన్నారు.. టీడీపీకి భవిష్యత్…
ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్సీ విషయంలో ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల మధ్య కాస్త గ్యాప్ పెరుగుతోంది.. జాప్యంపై మండిపడుతున్న ఉద్యోగ సంఘాలు పీఆర్సీపై ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టాయి.. ఈ నెలాఖరులోగా పీఆర్సీ ప్రకటించాలని ఉద్యోగ సంఘాల డిమాండ్ చేస్తున్నారు.. ప్రభుత్వానికి ఈ నెలాఖరు వరకు సమయం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు ఏపీజేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు.. ఈ నెల 27 లోపు అన్ని సంఘాల సమావేశాలు నిర్వహిస్తాం.. ఆ తరువాత సీఎస్ ను కలిసి మా భవిష్యత్…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్… రెండు రోజుల తిరుపతి పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఇవాళ సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు గన్నవరం నుంచి రేణిగుంటకు బయల్దేరి వెళ్తారు జగన్. అలాగే, రాత్రి 7 గంటల ప్రాంతంలో రేణిగుంటకు చేరుకునే కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు జగన్ స్వాగతం పలుకుతారు. అనంతరం రేణిగుంట నుంచి తిరుమల చేరుకుంటారాయన. రాత్రి తొమ్మిదిన్నరకు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. తర్వాత తిరిగి రేణిగుంటకు చేరుకుని… అక్కడి నుంచి తాడేపల్లికి బయలుదేరుతారు ముఖ్యమంత్రి.…
అక్కడ పదవులు ఊరకనే రావ్.. ! ఎన్నో ఫైటింగ్‌లు చేయాలి.. లాబీయింగ్ నడపాలి…! ఆ జిల్లాలో ఇలాంటి తతంగాలు చాలానే ఉంటాయి. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎమ్మెల్సీల్లోనూ అదే సీన్. ఒక పదవి కోసం ముగ్గురు రేస్‌లోకి వచ్చారు. ఆ ముగ్గురిలో ఇద్దరు స్వయాన అన్నదమ్ములు. ఒకరి వ్యూహం ఇంకొకరికి లీక్ కాకుండా పావులు కదపడమే ఆసక్తి కలిగిస్తోంది. ఉరవకొండ నుంచే ముగ్గురు ఉడుంపట్టు..! అనంతపురం జిల్లా రాజకీయాలు రాష్ట్రంలోనే భిన్నం. ఒక్కోసారి పదవుల కోసం ఎలాంటి…
అల్ప పీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దీంతో ప్రకాశం జిల్లా అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ప్రకాశం జిల్లా కొత్త పట్నంలో సముద్ర తీరం 15 మీటర్లు ముందు కొచ్చింది. దీంతో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుం టున్నారు. ప్రకాశం జిల్లాలో సముద్ర తీర ప్రాంతంలో ఉన్న 11 మండలాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. దీంతో చినగంజాం, సింగరా యకొండ, వేటపాలెం, కందూకూరు…
మంత్రి ప్రశాంత్ రెడ్డికి పేర్నినాని కౌంటరిచ్చారు. మాకు రావాల్సిన నిధుల కోసం బిచ్చమెత్తుకుంటున్నామని… మాటి మాటికి ఢిల్లీ వెళుతున్న కేసీఆర్ ఏం బిచ్చమెత్తుకోవడానికి వెళుతున్నారంటూ మండిపడ్డారు పేర్నినాని. తెలంగాణలో వరి కొనుగోళ్ళ రచ్చ జరుగుతుంటే… ఈ కొత్త గొడవేంటని రాజకీయ విశ్లేషకులు అవాక్కవుతున్నారు. విపక్షాలు మాత్రం కీలక విషయాలను పక్కదారి పట్టించేందుకే ఇలాంటి సిల్లీ విషయాలను తెరమీదకు తెస్తున్నారని కామెంట్లు చేస్తున్నారని ఫైర్ అయ్యారు పేర్ని నాని. ఇక అంతకు ముందు తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి…
ఏపీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ మేరకు అమిత్ షా మూడు రోజుల తిరుపతి పర్యటన షెడ్యూల్ కూడా ఖరారు అయింది. ఈ నెల 13 వ తేదీన రాత్రి తిరుపతి లో బస చేయనున్నారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. ఈ నెల 14 వ తేదీన ఉదయం నెల్లూరులో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కార్యక్రమంలో పాల్గొననున్నారు. 14 వ తేదీన మధ్యాహ్నం…