జవాద్ తుఫాన్ టెన్షన్.. విద్యుత్ పంపిణీ సంస్థకు ముప్పు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దూసుకొస్తున్న జవాద్ తుఫాన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ను భయపెడుతోంది… తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థకు జవాద్ తుఫాన్ టెన్షన్ పట్టుకుంది.. గంటలకు 100 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వస్తే నష్టం తప్పదని అంచనా వేస్తున్నారు అధికారులు… ముందస్తు చర్యల్లో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. గాలుల వేగం గంటలకు 50 కిలోమీటర్లు దాటితే ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తుగా విద్యుత్ సరఫరా నిలిపివేయాలని నిర్ణయించారు.. ఇక, సమస్య తలెత్తిన సబ్ స్టేషన్లు, ఫీడర్లు మరమ్మత్తు కోసం ప్రత్యేక బృందాలు నియమించారు.. ఎప్పటికప్పుడు సమస్యలు తెలుసుకోవడానికి.. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించడానికి టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేశారు.
Read Also: 30 దేశాలను తాకిన ఒమిక్రాన్.. యూతే టార్గెట్..!
Also Read
- Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
- Polavaram District: పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం.. పురాతన బావిలో మృతదేహం..
- Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం..
- CM Chandrababu: రాజముద్ర వేసి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం.. మిగిలిన వారికి కూడా ఇస్తాం..
కాగా, ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఈ వాయుగుండం మరింత బలపడి ఇవాళ మధ్యాహ్యానికి బంగాఖాళాతంలో జవాద్ తుఫాన్‌గా మారుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.. ఇది తరువాత వాయవ్య దిశలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరం వరకు ప్రయాణించి శనివారం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు చేరే అవకాశం ఉందంటున్నారు. జవాద్ ప్రభావంతో రెండు రోజుల పాటు ఉత్తరాంధ్రలో పలుచోట్ల మోస్తారు వర్షాలు, అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని.. ఇవాళ అర్థరాత్రి నుంచి తీరం వెంబడి గంటకు 45–65 కిలోమీటర్లు, శనివారం 70–90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది.
తాజావార్తలు
-
BJP-GenZ: బీజేపీ వైపు జెన్-జీ? ఢిల్లీ వర్సిటీ ఎన్నికల సందేశం ఇదేనా!
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!