అమరావతినే రాజధానిగా కొనసాగించాలని… రైతులు ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ తీసుకున్న.. మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని… ఏపీ రాజధానిగా అమరావతిని మాత్రమే చేయాలన్నది వారి డిమాండ్. అయితే.. రైతుల ఉద్యమానికి… ప్రతి పక్షాలు అన్ని ఇప్పటికే మద్దతు తెలిపాయి. ఇక తాజాగా జనసేన పార్టీ కీలక ప్రకటన చేసింది. ఈ నెల 26వ తేదీన రాజధాని రైతుల పాదయాత్రలో జనసేన ముఖ్య నేతలు పాల్గొననున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటన చేసింది.…
గుంటూరు జిల్లాలో వైసీపీ కార్యకర్తలు రౌడీల తరహాలో రెచ్చిపోయారంటూ టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ తీవ్రంగా మండిపడ్డారు. టీడీపీ కార్యకర్త సైదాను అత్యంత దారుణంగా కొట్టారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు నారా లోకేష్ సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఓ వ్యక్తిని రోడ్డు డివైడర్‌పై పడేసి కొందరు తీవ్రంగా కొట్టడం ఆ వీడియోలో కనిపిస్తోంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అరాచకాలలో ఆఫ్ఘనిస్థాన్‌ను మించిపోయిందని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.…
ఏపీలో ఇవాళ కరోనా కేసులు కాస్త పెరిగాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 31,987 శాంపిల్స్ పరీక్షించగా.. 264 కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.. ఒకరు కరోనా తో మృతి చెందారు. ఇక, ఇదే సమయంలో 247 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. తాజా టెస్ట్‌లు కలుపుకుని ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,02,55,667కు చేరుకున్నాయి..…
వాహనదారులకు ఏపీ ప్రభుత్వం బ్యాడ్ న్యూస్ అందించింది. బుధవారం సినిమాటోగ్రఫీ బిల్లుతో పాటు వాహన పన్నుల చట్ట సవరణ బిల్లును మంత్రి పేర్ని నాని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ మేరకు కొత్త వాహనాల లైఫ్ ట్యాక్స్, పాత వాహనాల గ్రీన్ ట్యాక్స్ పెంచుతూ చట్ట సవరణ చేశారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు, అధిక కర్బనాలను విడుదల చేసే వాహనాలను నివారించేందుకు ఈ సవరణ బిల్లును ప్రవేశపెట్టినట్లు మంత్రి పేర్ని నాని వెల్లడించారు. అందుకే గ్రీన్ ట్యాక్స్ పేరిట పన్నులు…
ఏపీలో భారీ వర్షాల కారణంగా టమోటాల ధరలకు రెక్కలు వచ్చాయి. ఇప్పటికే పెట్రోల్ ధరలు వంద దాటిపోగా ఇప్పుడు టమోటాల ధరలు కూడా వంద దాటిపోయాయి. ఆసియాలోనే అతిపెద్ద టమోటా మార్కెట్ అయిన మదనపల్లిలో కిలో టమోటా ధర ఏకంగా రూ. 130 పలుకుతున్నది. వి.కోట మార్కెట్లో 10 కేజీల టమోటాలు రూ.1500 పలుకుతున్నాయి. భారీ వర్షాలు కురవడంతో పంట పాడైపోవడంతో ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. వర్షాలు తగ్గి, వరద ఉధృతి పూర్తిగా తగ్గి మళ్లీ కొత్త…
అన్నమయ్య ప్రాజెక్టును రీ డిజైన్ చేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. అన్నమయ్య ప్రాజెక్టు 2.85 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసేలా డిజైన్ చేయాలి, కానీ 2.17 లక్షల క్యూసెక్కులు మాత్రమే విడుదల చేసేలా అప్పుడు డిజైన్ చేశారని సీఎం పేర్కొన్నారు. కాని దురదృష్టవశాత్తూ ఇప్పుడు 3.2 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చిందని… 2017లో అన్నమయ్య ప్రాజెక్టుపై నివేదిక కూడా ఇచ్చారు, ప్రాజెక్టును మెరుగుపరచమన్నారని గుర్తు చేశారు. గత ప్రభుత్వం విధానాల కారణంగా…
లెక్కలు తారుమారు అవుతున్నాయా? ఎన్నిక ఎన్నికకూ ఈక్వేషన్స్ మారుతున్నాయా? రేస్‌లో ముందున్నవారు.. తాజా లెక్కలతో తారుమారు అవుతారా? ఓటు బ్యాంక్ కోసం.. అధిష్ఠానం అదే ఊపులో వెళ్తే అమాత్య పదవిపై ఆశలుపెట్టుకున్న వారికి నిరాశ తప్పదా? ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కీలకంగా మారిన సమీకరణాలు..! విశాఖజిల్లా అధికారపార్టీలో పొలిటికల్ హీట్ క్రమంగా పెరుగుతోంది. స్ధానిక సంస్ధల నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల వరకు వైసీపీ నిర్ణయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. సామాజిక న్యాయం ప్రధానాంశంగా ఇక్కడ పదవుల పంపకం చేస్తోంది…
ఏపీ రాజధానిగా అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా చూడాలన్నది నాటి సీఎం చంద్రబాబు స్వప్నం. ప్రపంచ ప్రఖ్యాత నగరాలను పరిశీలించి రాజధాని నిర్మాణానికి ప్లాన్ చేశారు. అయితే నిర్మాణం పనులు మాత్రం అనుకున్న స్థాయిలో ముందుకు సాగలేదు. కానీ రాజధాని ప్రాంతంలో అభివృద్ధి ప్రక్రియ మాత్రం మొదలైంది. పెద్ద పెద్ద కంపెనీలను పెట్టుబడులకు ఆహ్వానించారు. వాటిలో కొన్ని ముందుకు వచ్చాయి. మరికొన్ని వచ్చే క్రమంలో ఉన్నాయి. ఈ లోగా రాజధాని భూ సేకరణలో అవకతవకల అంశం తెరమీదకు…
అనూహ్య నిర్ణయాలు.. సంచలన ప్రకటనలతో ప్రతిపక్షాలకే కాకుండా సొంత పార్టీకి.. కేబినెట్ సహచరులకు కూడా సీఎం జగన్ షాక్ ఇస్తున్నారా? మూడు రాజధానుల చట్టాన్ని రద్దు చేయాలనే నిర్ణయం.. వేయి మెగావాట్ల షాక్ తగిలినట్టుగా మంత్రులు ఫీలయ్యారా? చివరి వరకు రహస్యం.. విషయం బయటకు పొక్కనీయకుండా తీసుకున్న జాగ్రత్తలతో మంత్రులందరికీ దిమ్మతిరిగి బొమ్మ కనిపించిందా? సీఎం ఇచ్చిన షాక్ నుంచి ఇప్పటికీ తేరుకోని కొందరు మంత్రులు..? ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుపై సీఎం జగన్ చేసిన ప్రకటన…
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోమ్ శాఖ మంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి జగన్ లేఖ రాసారు. రాష్ట్రంలో వచ్చిన వరదల కారణంగా ఏర్పడిన నష్టానికి ఆదుకోవాలని లేఖలో కోరారు సీఎం జగన్. ప్రాధమిక నష్ట అంచనాల నివేదికను అందులో పొందుపర్చారు ముఖ్యమంత్రి. మధ్యంతర సహాయం కింద వెయ్యి కోట్ల రూపాయలు అత్యవసరంగా సహాయం చేయాలి అని విజ్ఞప్తి చేసారు ముఖ్యమంత్రి. అలాగే నష్ట పరిహార అంచనాల కోసం కేంద్రం నుంచి ప్రత్యేక బృందాన్ని రాష్ట్రానికి పంపించండి అని లేఖలో…