నేడు కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. హైకోర్టు ఆదేశాలతో మూడోసారి.. ఈరోజు ఉదయం 10:30కు కౌన్సిల్ సమావేశం ప్రారంభం కానుంది. మొదటిగా సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం చైర్మన్ ఎన్నిక జరుగుగుతుంది. ఎక్స్ అఫీషియో సభ్యుడిగా సమావేశానికి హాజరు కావాలంటూ ఎన్నికల అధికారి నుంచి కేశినేని నానికి సమాచారం అదింది. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా గొల్లపూడి, ఇబ్రహీంపట్నం, కొండపల్లి ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్థితులు వచ్చాయి. గత రెండు రోజుల నుంచి జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో…
ఏపీలో భారీ వర్షాల కారణంగా రాయలసీమ జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. వరద బాధితుల సహాయార్థం జోలె పట్టి విరాళాలను సేకరించాలని పార్టీ శ్రేణులకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు పిలుపునిచ్చారు. వరద ప్రభావిత జిల్లాలలో బాధితులను ఆదుకునేందుకు ఈనెల 25, 26 తేదీల్లో విరాళాల సేకరణకు కార్యాచరణ రూపొందించినట్లు సోము వీర్రాజు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా విరాళాలను సేకరిస్తామని, ప్రజలు నగదు, వస్తు రూపంలో విరాళాలను అందజేయవచ్చని…
సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ కుడి కాలికి గాయమైంది. మంగళవారం మధ్యాహ్నం చిత్తూరు జిల్లా రాయల చెరువు లీకేజీ, ముంపు ప్రాంతాలను పరిశీలించేందుకు రామచంద్రపురం మండలం కుప్పం బాదూరు కు చేరుకున్నారు. అక్కడి నుండి కొండపై కిలోమీటరు మేర నడుచుకుంటూ రాయల చెరువు కట్ట వద్ద కు చేరుకున్నారు. అయితే… కొండ నుండి దిగే సమయంలో నారాయణ కుడి కాలు బెణికింది. కాలుకు వాపు రావడంతో పైకి లేవలేక అక్కడే కూర్చున్నారు. అదే సమయంలో చెరువు…
కడప జిల్లాల్లోని వరద బాధిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా వరద బాధితుల నుంచి పంట నష్టం వివరాలను తెలుసుకున్నారు. వరదల్లో మృతిచెందిన కుటుంబాలకు టీడీపీ తరఫున రూ.లక్ష పరిహారాన్ని ప్రకటించారు. వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలకు రూ.1000 ఇస్తామని చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు… భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడమే ప్రాణ, ఆస్తి నష్టానికి కారణమని ఆరోపించారు. Read Also: విధ్వంసానికి.. సీఎం జగన్ బ్రాండ్…
ఏపీలో ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తమిళనాడు వద్ద వాయుగుండం తీరం దాటడంతో ఏపీ సరిహద్దు జిల్లాలలో కుంభవృష్టి వానలు కురిశాయి. దీంతో వరదలు పోటెత్తడంతో చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో ప్రజా జీవనం స్తంభించింది. మూలిగే నక్కపై తాటిపండు పడిన చందాన… ఇప్పుడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈసారి కూడా నెల్లూరు, కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాలపైనే ప్రభావం ఉంటుందని వాతావరణ…
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ సర్కార్ పై టీడీపీ యువ నేత నారా లోకేష్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. విధ్వంసానికి బ్రాండ్ అంబాసిడర్ సీఎం జగన్ అంటూ నిప్పులు చెరిగారు నారా లోకేష్. పల్లె పోరు లో ఫ్యాన్ కి ఓటేస్తే గ్రామాల రూపురేఖలు మారుస్తానన్న జగన్ రెడ్డి గారు ఇప్పుడు ఏకంగా పంచాయతీ ఖాతాల్లో ఉన్న సొమ్ముని కాజేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగ విరుద్ధంగా పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసేలా ప్రభుత్వం…
కడప జిల్లాలో అధికార పార్టీ వైసీపీకి షాక్ తగిలింది. కాజీపేట మండలంలో ఏకంగా 13 మంది సర్పంచులు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు వారు పత్రికా ప్రకటన విడుదల చేశారు. సంక్షేమ పథకాల అమలులో సర్పంచుల పాత్ర లేకుండా చేయడమే కాక… 14వ, 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులను కూడా అధికారులు దారి మళ్లిస్తున్నారని వారు ఆరోపించారు. దీంతో ప్రభుత్వ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్లు వారు వెల్లడించారు. ఈ…
ఏపీలో కరోనా కేసులు రోజు రోజు తగ్గు ముఖం పడుతున్నాయి. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విడుదల చేసిన హెల్త్ బులి టెన్ ప్రకారం… గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 26, 119 శాంపిల్స్ పరీక్షించగా.. 196 కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.. ఒకరు కరోనా తో మృతి చెందారు. ఇక, ఇదే సమయంలో 242 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. తాజా టెస్ట్లు కలుపుకుని ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షల…
కర్నూలు : అమరావతినే క్యాపిటల్ గా ఉంచాలి.. పేరు ఏదైనా పెట్టుకొండి. కానీ అభివృద్ధి మాత్రం చేయండని టీజీ వెంకటేష్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి గందరగోళంలో పరిపాలన చేస్తే రాష్ట్రం సవ్యంగా ఉండదు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి ఆలూ లేదు సోలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు ఉందని… అమరావతిని అలాగే ఉంచి కర్నూలులో సమ్మర్ లేదా వింటర్ క్యాపిటల్ చేయాలని రాయలసీమ హక్కుల ఐక్యవేదిక మొదటి నుంచి డిమాండ్ చేస్తోందని టీజీ…
బీసీల విషయంలో జగన్ సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శలు చేశారు. సీఎం జగన్ పాలనలో బీసీలకు అడుగడుగునా వంచన జరిగిందని ఆరోపించారు. స్థానిక సంస్థల్లో 10% రిజర్వేషన్ల కోతతో 16,800 మందికి పదవులు దూరమయ్యాయని గుర్తుచేశారు. బీసీ జనగణన కోరుతూ 2014లోనే తెలుగుదేశం తీర్మానం చేసిందని అచ్చెన్నాయుడు తెలిపారు. ఢిల్లీ చుట్టూ కేసుల కోసం తిరగడం తప్ప.. బీసీ గణనపై కేంద్రంపై ఎప్పుడైనా జగన్ ప్రభుత్వం ఒత్తిడి చేసిందా అని నిలదీశారు.…