ఏపీ అసెంబ్లీలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి చెందిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాగ్ రిపోర్ట్ ఇచ్చారు. ఆర్థిక వ్యవహారాల్లో ప్రభుత్వం రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరించిందని కాగ్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అనుబంధ పద్దులను ఖర్చు చేసి.. తర్వాత జూన్ 2020లో శాసన సభలో ప్రవేశ పెట్టారు.. ఇది రాజ్యాంగ విరుద్దం అన్నారు. రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా ఆర్థిక వ్యవహారాలు జరిగాయి. చట్టసభల ఆమోద ప్రక్రియను, బడ్జెట్ మీద అదుపును బలహీన పరిచారు.…
కోనసీమలో రాజకీయం రోడ్డెక్కిందా? రెండుపార్టీల క్రెడిట్ ఫైట్‌తో రహదారి మలుపులు తిరుగుతోందా? రోజూ ఈ మార్గంలో ప్రయాణిస్తూ.. నరకం చూస్తున్న ప్రజల వాదనేంటి? లెట్స్ వాచ్..! వైసీపీ, బీజేపీ మధ్య నిప్పు రాజేస్తున్న కోనసీమ రోడ్డు..! ఇది తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోకి ప్రవేశించే రావులపాలెం నుంచి అమలాపురం వెళ్లే ప్రధాన రహదారి. గోతులు పడి.. పూర్తిగా పాడవడంతో ఈ రోడ్డుపై ప్రయాణమంటే కోనసీమ వాసులు నరకం చూస్తున్నారు. అయితే రావులపాలెం పదహారో జాతీయ రహదారి నుంచి అమలాపురం…
తిరుపతి ముంపునకు కారణం ఎవరు? వర్షం తగ్గి వారం అవుతున్నా నగరంలో నీరు ఎందుకు లాగడం లేదు? ఇప్పటికీ పలు కాలనీలు నీటిలోనే ఎందుకు నానుతున్నాయి? ఇది ప్రకృతి వైపరిత్యామా లేక ఆ నేత వాస్తు భయమా? తిరుపతి ప్రజలు గతంలో ఎన్నాడూ చూడని వరద ఇక్కట్లు..! ప్రపంచ పటంలో తిరుపతికి ఒక ప్రత్యేకత స్థానం ఉంది. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారు స్వయంభూవై వెలసిన పుణ్యక్షేత్రం. నిత్యం దేశ విదేశాల నుంచి భక్తులు తిరుపతి వస్తుంటారు.…
విజయవాడలో హైలైఫ్ బ్రైడ్స్ అతిపెద్ద వివాహ, ఫ్యాషన్ మరియు లైఫ్‌స్టైల్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. విజయవాడలో మొట్టమొదటిసారిగా హైలైఫ్ బ్రైడ్స్ ప్రదర్శన నిన్న నోవొటెల్ విజయవాడ వరుణ్ వద్ద ప్రారంభమైంది. అయితే ఈ ప్రదర్శన 26,27 నవంబర్ 2021న.. అంటే ఈరోజు రేపు కూడా ఉంటుంది. • అయితే నోవొటెల్ , వరుణ్ వద్ద ఏర్పాటుచేసిన హై లైఫ్ బ్రైడ్స్ ప్రదర్శనలో… నటులు ఐశ్వర్య ఉల్లింగాల, యష్న చౌదరి, రితికా చక్రవర్తి తో పాటుగా అగ్రశ్రేణి మోడల్స్, ఫ్యాషన్…
ఏపీ అసెంబ్లీలో తనపై చేసిన వ్యాఖ్యలకు నారా భువనేశ్వరి స్పందించారు. ఈ వ్యాఖ్యల పై ప్రెస్ నోట్ విడుదల చేసారు. అందులో… ఆంధ్రప్రదేశ్ శాసనసభలో నాపై చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేసిన వారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. నాకు జరిగిన అవమానాన్ని మీ తల్లికి, తోబుట్టువుకు, కూతురికి జరిగినట్టుగా భావించి నాకు అండగా నిలబడటం నా జీవితంలో మర్చిపోలేను అన్నారు. చిన్నతనం నుంచి అమ్మ, నాన్న మమ్మల్ని విలువలతో ఉంటారు. నేటికీ మేము…
శుక్రవారం నాడు ఏపీ శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ పదవికి వైసీపీ ఎమ్మెల్సీ జకీయా ఖానమ్ నామినేషన్ దాఖలు చేశారు. దీంతో తొలిసారిగా మైనారిటీ మహిళకు మండలి డిప్యూటీ ఛైర్పర్సన్ పదవి దక్కనుంది. Read Also: అమెజాన్‌లో అమ్మకానికి ‘విషం’… ఎఫ్ఐఆర్ నమోదు ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడారు. జకీయా ఖానమ్‌కు మండలి డిప్యూటీ ఛైర్పర్సన్ పదవి ఇవ్వడం హర్షదాయకమన్నారు. ఒక మైనారిటీ మహిళను ఎంపిక…
ఆంధ్రప్రదేశ్‌ను భారీ వర్షాలు, వరదలు దెబ్బకొట్టాయి.. నెల్లూరుతో పాటు రాయలసీమ జిల్లాలు అతలాకుతలం అయ్యాయి.. ఇప్పటికే వరద నష్టంపై ప్రాథమికంగా అంచనా వేశారు అధికారులు.. అయితే, వరద నష్టాన్ని అంచనా వేసేందుకు ఆంధ్రప్రదేశ్‌కు రానున్నాయి కేంద్ర బృందాలు.. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను ప్రత్యక్షంగా గమనించి ఓ అంచనాకు రానున్నారు.. రేపు రాష్ట్రానికి రానున్న ఏడుగురు సభ్యులతో కూడిన కేంద్ర ప్రభుత్వం.. సంబంధిత జిల్లాల్లో పర్యటించనుంది.. ఈ నెల 26న చిత్తూరు, 27న చిత్తూరు, కడప జిల్లాలు,…
జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌కు స్వచ్ఛ అవార్డుల పంట పండింది… స్వచ్ఛ అమృత్ మహోత్సవ్‌లో భాగంగా కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వివిధ కేటగిరీల్లో ఏకంగా 11 అవార్డులు దక్కాయి… ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు స్వచ్ఛ అవార్డులు పొందిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు చెందిన మేయర్లు, కమిషనర్లు… పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నేతృత్వంలో సీఎం జగన్ ను కలిశారు.. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలను ఏపీ సీఎం అభినందించారు.. ఇంకా…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు క్యూ కడతారు.. ప్రస్తుతం వర్షాలతో కొన్ని ఇబ్బందులు ఎదురైనా.. స్వామి వారి దర్శనానికి భక్తులు తరలివస్తూనే ఉన్నారు.. ఇక, కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో శ్రీవారి దర్శనానికి నోచుకోని భక్తులు ఇప్పుడు క్రమంగా తిరుమలకు వెళ్తున్నారు.. నవంబర్ నెల ముగుస్తుండడంతో.. డిసెంబర్ నెల టికెట్లను విడుదల చేసేందుకు సిద్ధం అవుతోంది టీటీడీ.. Read Also: ఏపీ వరి ధాన్యానికి బ్రేక్‌లు..! సరిహద్దులో అడ్డుకున్న తెలంగాణ అధికారులు..…
వరి కొనుగోళ్ల వ్యవహారం ఇప్పటికే తెలంగాణ సర్కార్, కేంద్రం మధ్య నిప్పు రాజేసింది.. మార్కెట్ యార్డులతో పాటు.. రోడ్లపై ఎక్కడపడితే అక్కడ వరి ధాన్యం దర్శనమిస్తోంది.. దయచేసి మా ధాన్యాన్ని కొనుగోలు చేయండి మొర్రో అంటూ రైతులు వేడుకున్నా ఫలితం దక్కని పరిస్థితి ఉంది.. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోకి వరి ధాన్యాన్ని తరలిస్తున్నారు.. Read Also: చంద్రబాబు అసెంబ్లీ నుంచి పారిపోయింది అందుకే..! అయితే, రాష్ట్ర సరిహద్దుల్లో ఆ లారీలను అడ్డుకున్నారు తెలంగాణ అధికారులు..…