దేశవ్యాప్తంగా అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. అన్నదాతల అప్పులకు రాజకీయంగా, ఆర్థికపరంగా చాలా కారణాలు ఉన్నాయి. అయితే అప్పుల్లో కూరుకుపోయిన వ్యవసాయ కుటుంబాల విషయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు దేశంలోనే టాప్లో ఉన్నాయి. ఏపీలో 93.2 శాతం మంది రైతులు, తెలంగాణలో 91.7 మంది రైతుల కుటుంబాలపై రుణ భారం ఉన్నట్టు రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ జాబితాలో కేరళ(69.9%), కర్ణాటక(67.7%), తమిళనాడు (65.1%), ఒడిశా (61.2%), మహారాష్ట్ర (54శాతం) రాష్ట్రాలు వరుస స్థానాల్లో…
కొణిజేటి రోశయ్య కాంగ్రెస్ పార్టీలో అత్యంత నమ్మదగిన నాయకుడు. రోశయ్య దివంగత నేత వైఎస్ఆర్కు ఆప్తుడిగా మెలిగేవారు. గుంటూరు జిల్లా నిడుబ్రోలులో రాజకీయ పాఠాలు నేర్చుకున్న ఆయన.. గుంటూరు నగరంలోని హిందూ కాలేజీలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. 1968, 1974, 1980, 2009లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 1989, 2004లో చీరాల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1998లో నర్సరావుపేట నుంచి లోక్సభ ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ఆర్యవైశ్య కులం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన నేతగా రోశయ్యకు మంచి పేరు…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 15వ ముఖ్యమంత్రిగా పనిచేసిన కొణిజేటి రోశయ్య (88) అనారోగ్యంతో శనివారం ఉదయం కన్నుమూశారు. ఒక్కసారిగా ఆయనకు బీపీ డౌన్ కావడంతో కుటుంబీకులు బంజారాహిల్స్లోని స్టార్ ఆస్పత్రికి తరలించే లోపే మార్గం మధ్యలో రోశయ్య చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రోశయ్య గతంలో తమిళనాడు గవర్నర్గా పని చేశారు. అయితే కొన్నాళ్లుగా రాజకీయాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. వైఎస్ఆర్ మరణం తర్వాత సెప్టెంబర్ 3, 2009 నుంచి జూన్ 25, 2011…
జవాద్ తుఫాన్ దూసుకొస్తుండడంతో రైల్వే అధికారులు అప్రమత్తం అయ్యారు.. ఈస్ట్ కోస్ట్ రైల్వేతో పాటు దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే ఏకంగా 120 రైళ్లను రద్దుచేసినట్టు అధికారులు వెల్లడించారు.. ఈ నెల 2వ తేదీ నుంచి కొన్ని రైలు సర్వీసులు రద్దు అయిన విషయం తెలిసిందే కాగా.. నిన్న కూడా కొన్ని రైళ్లు పట్టాలు ఎక్కలేదు.. ఇవాళ కూడా మరికొన్ని రైళ్లు స్టేషన్లకే పరిమితం కానున్నాయి. ఈ నెల…
✍ జవాద్ తుఫాన్ నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు తూ.గో. జిల్లాలో నేడు స్కూళ్లకు సెలవు✍ హైదరాబాద్లో నేడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ పర్యటన… ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ సదస్సులో పాల్గొననున్న సీజేఐ ఎన్వీ రమణ, సీఎం కేసీఆర్✍ నేడు విజయవాడలో బీజేపీ కార్యవర్గ సమావేశం.. భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్న బీజేపీ నేతలు✍ 34వ రోజుకు చేరిన అమరావతి రాజధాని రైతుల మహాపాదయాత్ర… నేడు నెల్లూరు జిల్లా సైదాపురం నుంచి ప్రారంభం..…
టార్గెట్-2024 అంటూ బీజేపీ అధినాయకత్వం ఏపీ రాష్ట్రానికి కోర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పుడా కమిటీ కూర్పుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. కమిటీలో అంతా బయట నుంచి వచ్చిన వారే ఎక్కువ. ఇదేం చిత్రం అంటూ కొందరు బుగ్గలు నొక్కుకుంటున్నారట. ఇదే సందర్భంలో మరో చర్చా జరుగుతోంది. పాతవారు పని చేయకపోతే కొత్తవారికి పెద్దపీట వేయక తప్పదుగా అని చెవులు కొరుక్కుంటున్నారట. అమిత్ షాతో భేటీ తర్వాత అమరావతి రైతుల పాదయాత్రలో ఏపీ బీజేపీ నేతలు..! తిరుపతిలో…
రాజకీయంగా అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారు ఆ మాజీ మంత్రి..! ఇప్పుడు కుమారుడి పొలిటికల్ ప్యూచర్ కోసం వ్యూహ రచన చేస్తున్నా వర్కవుట్ కావడం లేదట. రూటు మార్చి ప్లాన్ బీ అమలు చేస్తున్నారట. ఇంతకీ ఎవరా సీనియర్ నేత? మంత్రిగా ఉన్నప్పుడు తన విమర్శలతో టీడీపీని ఇరుకున పెట్టారు..! విశాఖజిల్లా, నర్సీపట్నం. ఈ పేరు చెబితే పొలిటికల్ సర్కిల్స్లో ఠక్కున గుర్తుకొచ్చే పేరు చింతకాయల అయ్యన్నపాత్రుడు. గెలుపోటములతో సంబంధం లేకుండా టీడీపీ ఆవిర్భావం నుంచి ఒకే పార్టీలో…
సీఎం ప్రకటించినా.. ఉద్యోగ సంఘాలు మాత్రం ఏమాత్రం తగ్గేది లేదంటున్నాయి. మరో పది రోజుల్లో పీఆర్సీ ప్రకటన చేస్తామంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెబుతున్నారు. ఉద్యోగ సంఘాల నేతలు తమ కార్యాచరణకు దిగుతున్నారు. తిరుపతిలో పీఆర్సీపై సీఎం వైఎస్ జగన్ చేసిన కామెంట్లపై స్పందించిన ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు, ఫ్యాప్టో అధ్యక్షుడు శ్రీధర్… మా ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందని ప్రకటించారు… మరోవైపు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ప్రారంభం అయింది. ఈ సమావేశం…
ఏపీ రాజకీయాల్లో కొన్ని రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రముఖంగా వినపడుతోంది. ఇటీవల చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ నేతలు తీవ్రంగా ఆరోపించగా… నందమూరి కుటుంబసభ్యులు కూడా ఈ అంశంపై స్పందించారు. అయితే హీరో జూనియర్ ఎన్టీఆర్ స్పందన తమకు నచ్చలేదని కొందరు టీడీపీ సీనియర్ నేతలు బాహాటంగా తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీంతో చిత్తూరు జిల్లా కుప్పంలో ఎన్టీఆర్ అభిమానులు నిరసన వ్యక్తం చేసిన విషయం సోషల్…
మధ్య బంగాళాఖాతంలో బలపడుతున్న తీవ్ర వాయుగుండం… ఈరోజు సాయంత్రానికి తుఫానుగా మారుతుంది అని విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద తెలిపారు. ఇది పశ్చిమ వాయువ్య దిశగా రేపు ఉదయం వరకు ఆ తర్వాత ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణిస్తోంది. రేపటికి ఉత్తరాంధ్ర తీరానికి దగ్గరగా వచ్చే అవకాశముంది. ఉత్తరాంధ్ర అంతటా ఈరోజు రేపు ఓ మోస్తరు వర్షాలు చాలాచోట్ల పడతాయి. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో భారీ నుంచి అతిభారీ వర్షాలు ఒకటిరెండు చోట్ల…