సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో విత్తన ధృవీకరణ సంస్థ నూతన భవన,గోదాము శంకుస్థాపన చేసారు మంత్రి హరీష్ రావు. ఈ కార్యక్రమానికి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ పారుక్ హుసేన్, జెడ్పి చైర్మన్ రోజా శర్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరాం, వ్యవసాయ అధికారులు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో హరీష్ రావు మాట్లాడుతూ… దేశంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మార్కెట్ లను రద్దు చేశారు. ప్రభత్వలు రైతుల కోసం పనిచేయాలి. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వ పెద్దలు దేశ రైతులను రోడు మీద వదిలేచారు. రాష్ట్ర లో ఉన్న 70లక్షల మంది రైతులకోసం మంత్రులు ఢిల్లీకి వెళ్తే, బిజెపి మంత్రులు తెలంగాణ మంత్రులు అవమానించారు అని అన్నారు. రైతులను నటెంట ముంచారు బీజేపీ ప్రభుత్వ పెద్దలు.
ఇక గతంలో వరి ధాన్యాన్ని ప్రభుత్వానికి అమ్మలని అన్నారు. పంట ఎక్కువ దిగుబడి వస్తే వద్దు అంటున్నారు ఇప్పుడు రైతులు ఎక్కడికి వెళ్ళాలి. ఆయిల్ పామును రైతులు పెద్ద ఎత్తున్న అందిపుచుకోవాలి. ఆయిల్ పామ్ తో మంచి లాభాలు ఉన్నాయి. రాష్ట్రంలో సెరికల్చర్ పండించే సిద్ధిపేట జిల్లా మొదటి స్థానంలో ఉంది. రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మల్లాలి. రాష్ట్రలోనే మొట్ట మొదటగా సిద్దిపేట మార్కెట్ యార్డ్ ISO సర్టిఫికేట్ వచ్చింది అని పేర్కొన్నారు.