ఏపీలో చెడ్డీ గ్యాంగ్ రెచ్చిపోతోంది. తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసం సమీపంలోనే చెడ్డీ గ్యాంగ్ దోపిడీలకు పాల్పడుతోంది. తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు సంబంధించిన విల్లాల్లోకి చొరబడిన చెడ్డీ గ్యాంగ్… విలువైన వస్తువులు అపహరించేందుకు ప్రయత్నించింది. ఈ గ్యాంగులో ఉన్న ఐదుగురు సభ్యులు చెడ్డీలు, తలపాగాలు ధరించి ఉన్నారు. చేతిలో మారణాయుధాలు కూడా ఉన్నాయి. ఈనెల 3న అర్ధరాత్రి ఈ ఘటన జరగ్గా… మూడు రోజుల పాటు పోలీసులు ఈ విషయాన్ని…
✍ నేటి నుంచి ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ, ఏపీ అమరావతి జేఏసీ సంఘాల సమ్మె.. పీఆర్సీ అమలు సహా 71 డిమాండ్లు నెరవేర్చాలని ఆందోళన.. నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకానున్న ఉద్యోగులు✍ ఏపీలో నేటి నుంచి ఏడాది పాటు గుట్కా, పాన్ మసాలా, నమిలే పొగాకు ఉత్పత్తులపై నిషేధం విధించిన జగన్ సర్కారు✍ 37వ రోజుకు చేరిన రాజధాని అమరావతి రైతుల మహాపాదయాత్ర… ఈరోజు నెల్లూరు జిల్లా వెంకటగిరి నుంచి ప్రారంభం… వల్లివేడు మీదుగా చిత్తూరు…
క్షేత్ర స్థాయిలో గందరగోళ పరిస్థితులు నెలకొనడం.. ఓటీఎస్ పథకంపై ప్రజల్లో అవగాహన పెంచేదుకు అధికార వైసీపీ మల్లగుల్లాలు పడుతోంది. ప్రజా ప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్సులు నిర్వహించి దీనిపై స్పష్టంగా వివరిస్తున్నారు. గతంలో హౌసింగ్ బోర్డుల కింద అప్పులు తీసుకుని … ఆ అప్పులు కట్టకపోవడం వల్ల ఆగిపోయిన రిజిస్ట్రేషన్ల సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం తీసుకుని వచ్చిందే వన్ టైమ్ సెటిల్ మెంట్ పథకం. ఈ పథకం కింద డీ ఫార్మ్ పట్టాల్లో కట్టిన ఇళ్లకు కూడా…
ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 18,788 కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 122 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 20,73,852కి చేరింది. నిన్న కరోనా వల్ల కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారు. దీంతో ఏపీ వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా మరణాల సంఖ్య 14,453కి చేరింది. మరోవైపు గడిచిన 24 గంటల్లో 213 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 20,57,369 మంది కరోనా నుంచి కోలుకుని…
ఏపీకి పోలవరం ప్రాజెక్టు అతి ముఖ్యమైనది అని అందరికీ తెలిసిన విషయమే. గత కొన్నేళ్లుగా ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తికావడం లేదు. దీంతో నిర్మాణ వ్యయం భారీగా పెరుగుతోంది. అయితే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై సోమవారం నాడు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. నిర్ణీత గడువులోగా పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడం అసాధ్యమని తేల్చి చెప్పింది. పోలవరం ప్రాజెక్టు పూర్తిపై రాజ్యసభలో టీడీపీ ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయమంత్రి బిశ్వేశ్వర తుడు లిఖితపూర్వకంగా సమాధానం…
పీఆర్సీ విషయంలో తమ డిమాండ్లు నెరవేర్చాని కోరుతూ మంగళవారం నుంచి ఏపీలో ఉద్యోగ సంఘాలు సమ్మెకు దిగనున్నాయి. అయితే ఉద్యోగ సంఘాలు చేపట్టే ఆందోళన కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్ నిర్ణయించుకుంది. ఈ మేరకు తాము సమ్మెలో పాల్గొనడం లేదని ఏపీ ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.రవికుమార్ ప్రకటించారు.. రేపటి నుంచి ఉమ్మడి జేఏసీ తలపెట్టిన నిరసన కార్యక్రమాల్లో ఏపీ ట్రెజరీ ఉద్యోగుల సంఘం పాల్గొనటం లేదని స్పష్టం చేశారు. పది…
విశాఖలోని మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రకాష్ నగర్లో రౌడీ షీటర్ దోమాన చిన్నారావును స్థానిక మహిళలు చితకబాదారు. స్కూల్‌కు వెళ్లే అమ్మాయిలకు పెన్నులు, పెన్సిళ్లు ఇస్తూ చిన్నారావు వారికి ఆశ చూపించాడు. దీంతో కొందరు విద్యార్థినులు చిన్నారావు మాటలు నమ్మి అతడి దగ్గరకు వెళ్లారు. కానీ ఇదే అదనుగా భావించిన చిన్నారావు అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో స్థానిక మహిళలందరూ కలిసి…
అంబేద్కర్ చూపిన మార్గంలోనే జనసేన పార్టీ ప్రస్థానం కొనసాగుతోందని పేర్కొన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్… రాజ్యాంగ నిర్మాత, భారతరత్నం బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా.. ఓ ప్రకటన విడుదల చేసిన జనసేనాని.. అంబేద్కర్ ఆలోచనలు, సిద్ధాంతాలు సర్వదా అనుసరణీయం అన్నారు.. రాజ్యాంగంలో అంబేద్కర్ కల్పించిన పౌరహక్కులు, ఆదేశిక సూత్రాలు నేటికీ, ఏనాటికీ ప్రజలకు రక్షణగానే నిలుస్తుంటాయని పేర్కొన్న ఆయన.. నేటి తరం రాజకీయ నాయకుల వికృత వైపరీత్యాలను అంబేద్కర్ ముందే పసిగట్టి…
అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తున్న వ్యక్తి సీఎం జగన్ అని మంత్రి వెల్లంపల్లి అన్నారు. విజయవాడలో… మంత్రి వెల్లంపల్లి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ భాగ్య లక్ష్మి, దేవినేని అవినాష్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా వెల్లంపల్లి మాట్లాడుతూ… అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించామన్నారు. ఆయన రాజ్యాంగం నేటికి అమలవుతుందంటే అంబేద్కర్ గొప్ప తనం అర్ధమవుతుందని కొనియాడారు. అన్ని వర్గాల వారికి సమ ప్రాధాన్యత ఇస్తూ… అందరి అభిమానాన్ని పొందుతున్నారన్నారు.…