విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ నటుడి అవతారం ఎత్తారు. ఏపీ ప్రభుత్వం అమ్మ ఒడి పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్నో ప్రశంసలు అందుకున్న ఈ పథకంపై ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో వైసీపీ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ ఉపాధ్యాయుడిగా నటిస్తున్నారు. ఈ సినిమాను శ్రీ దత్తాత్రేయ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తోంది. ‘అమ్మ ఒడి’ పేరుతో తెరకెక్కుతోన్న ఈ మూవీకి త్రినాథ్ దర్శకత్వం వహిస్తున్నాడు.
Read Also: ఒమిక్రాన్‌కు మందు పంపిణీ చేస్తున్న ఆనందయ్య
ఈ సినిమాలో వైసీపీ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ ప్రధానోపాధ్యాయుడి పాత్ర పోషిస్తున్నారు. ఈ మేరకు ఈ సినిమాకు సంబంధించి పాడేరు మండలంలోని దిగుమోదాపుట్టు గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్యేపై కొన్ని సీన్లు షూట్ చేశారు. ఈ షూటింగ్‌కు తహసీల్దార్ ప్రకాష్‌రావు క్లాప్ కొట్టారు. కాగా ఎమ్మెల్యే ఫాల్గుణ గతంలో ఉపాధ్యాయుడిగా, బ్యాంకర్‌గా పనిచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఫాల్గుణ మాట్లాడుతూ… సీఎం జగన్ ప్రవేశపెట్టిన అమ్మ ఒడి పథకంపై సినిమా తీయడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. అమ్మఒడి పథకంపై చిత్రం నిర్మించడం గొప్ప విషయమని చిత్ర నిర్మాత, దర్శకులను అభినందించారు.