✍ నేడు తిరుపతితో పాటు నెల్లూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన… వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, పంటలను పరిశీలించనున్న సీఎం జగన్✍ అమరావతి: నేడు టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం, దర్శి మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై చర్చ✍ అమరావతి: నేడు మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్, హాజరుకావాలని ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం, పీఆర్సీ సహా ఉద్యోగుల సమస్యలపై చర్చ✍ నేడు 33వ రోజుకు చేరిన అమరావతి రాజధాని రైతుల మహాపాదయాత్ర… నెల్లూరు…
పీఆర్సీ నివేదిక ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు ఆందోళన చేపట్టడం వెనక ఉన్నది ఆయనేనా? తన డిమాండ్స్ను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నిప్పు రాజేశారా? ఏపీ సచివాలయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? లెట్స్ వాచ్..! అనూహ్యంగా సలహాదారు పోస్ట్ చేపట్టిన ఉద్యోగ సంఘాల మాజీ నేత..! చంద్రశేఖర్రెడ్డి. ఏపీఎన్జీవో మాజీ అధ్యక్షుడు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ సలహాదారు. సర్కార్ పిలిచి మరీ ఆయనకు పీట వేసింది ప్రభుత్వం. రెండేళ్ల పదవీకాలంతో ఉద్యోగుల సంక్షేమం చూసుకునేలా ప్రభుత్వ సలహాదారుగా…
అసెంబ్లీలో నన్ను ఎగతాళి చేశారు.. అవమానాలకు గురి చేశారు.. అయినా భరించాను. చివరకు కుటుంబ సభ్యులను కూడా దూషించారు.. గౌరవాన్ని దెబ్బతీశారు అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఇది గౌరవ సభ కాదు.. కౌరవ సభ అని మళ్లీ సీఎంగా వస్తానని సవాల్ విసిరి వచ్చేశాను. నేను సీఎంగా ఉన్నాను.. ప్రతిపక్ష నేతగా పని చేశాను. నేనూ మనిషినే.. భార్యకు భర్తనే. నేనెప్పుడూ ఇంట్లో ఆడవాళ్లను రాజకీయాల్లోకి లాగలేదు. ప్రజల ఎప్పుడో కట్టుకున్న ఇళ్లకు డాక్యుమెంట్లు…
ఓడ దాటేదాక ఓడ మల్లన్న.. ఒడ్డు దిగాక బోడి మల్లన్న. ప్రస్తుతం ఆ నగరంలో మున్సిపల్ కార్పొరేటర్ల తీరు అలాగే ఉందట. ఎన్నికల్లో గెలిచేదాకా.. స్థానికులకు అనేక హామీలు గుప్పించారు. ఇప్పుడు అదే ప్రజలు వరదలతో ఇబ్బంది పడుతుంటే.. అంతా గాయబ్. ఎందుకిలా? వరదల టైమ్లో వైసీపీ కార్పొరేటర్లు ఏమయ్యారు? వరదలకు తిరుపతి మునిగిపోయింది. రోజులు గడుస్తున్నా నగరంలోని చాలా ప్రాంతాలు నీటిలోనే నానుతున్న పరిస్థితి. ప్రజలు హాహాకారాలు పెడుతుంటే.. తిరుపతి మున్సిపల్ కార్పొరేటర్ల తీరు విమర్శలకు…
గురజాల, దాచేపల్లి మున్సిపల్ ఎన్నికలపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఎన్నికలు జరిగిన విధానంపై కార్యకర్తల నుంచి అభిప్రాయాలు తీసుకుంటోన్నారు చంద్రబాబు. ఈ సమీక్షలో మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ రావు కీలక వ్యాఖ్యలు చేసారు. రాత్రి పూట వైసీపీ నేతలతో సంప్రదింపులు జరిపే అలవాటును కొందరు టీడీపీ నేతలు మానుకోవాలి. నేను చచ్చినా.. నువ్వు చచ్చినా పార్టీ జండా కప్పుతారు ప్రాణాల కోసం వైసీపీ వాళ్ళతో రాత్రిళ్లు మాట్లాడుతారా..!? ఆ అవసరం లేదు అని తెలిపారు. 2014-…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ మరో వర్ష సూచన ఉంది అని తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతం మరియు ఆనుకుని ఉన్న అండమాన్ సముద్రంలో బలపడిన అల్పపీడనం… రాగల 12 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా పయనించి వాయుగుండంగా మారనుంది అని ప్రకటించింది. ఆ తదుపరి 24 గంటల్లో మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉంది. అది శనివారం ఉదయం నాటికి ఉత్తరాంధ్ర – ఒడిశా తీరాలకు చేరుకునే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దీని ప్రభావంతో…
ఏపీలో ప్రస్తుతం రాజకీయం సినిమా చుట్టూ తిరుగుతుంది అనేది అందరికి అర్ధం అవుతుంది. అక్కడ ప్రభుత్వం తాజాగా సినిమా టికెట్లు, ప్రదర్శన షో లపై తీసుకున్న నిర్ణయాలు చర్చముషానియంగా మారాయి. అయితే ఏపీ ప్రభుత్వం ఇక మీదట బెన్ విత్ షో లు వేయకూడదు అని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆదేశం మధ్య అక్కడ ఈరోజు అఖండ సినిమా విడుదలైంది. ఈ సినిమా సూపర్ హిట్ అని చుసిన వాళ్ళు చాలా…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు ప్రళయం సృషించాయి. ఆర్థిక నష్టాన్నే కాద్దు హార్ధిక నష్టాన్ని కూడా కలగజేశాయి. అయితే ఇంత జరిగినా చిత్ర ప్రముఖులు ఎవరూ సాయం చేయలేదంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి కూడా. అయితే ముందుగా అల్లు అరవింద్ తమ గీతా ఆర్ట్స్ తరపున రూ. 10 లక్షలను విరాళంగా ప్రకటించారు. నిజానికి టాలీవుడ్ ప్రముఖులు ఇలాంటి విపత్తులు వచ్చినపుడు ఒకరికొకరు పోటాపోటీగా స్పందించేవారు. అయితే ఈసారి మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోంది. అరవింద్ తర్వాత…
ఒక్కసారి మాట జారితే అవి ఎంత దూరం తీసుకెళ్తాయో.. వాటి పర్యవసానాలను ఊహించడం కష్టం. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసి.. కలకలం రేపిన ఆ మహిళా నేతల పరిస్థితి అలాగే ఉంది. వాళ్లంతా ఇప్పుడు ఎక్కడున్నారో తెలియదు. వారి వెనక ఎవరున్నారన్నది ప్రశ్నే. టీడీపీ మహిళా నేతల కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్..! టీడీపీ అధినేత చంద్రబాబు మీడియా ఎదుట కన్నీటిపర్యంతమైన తర్వాత.. అనంతపురం తమ్ముళ్లు, మహిళా నేతలు ఓ రేంజ్లో అధికారపార్టీపై ఫైర్ అయ్యారు. ఈ…
అమరావతి : సీఎం జగన్ రెండున్నరేళ్ల పాలనపై సీఎస్ సమీర్ శర్మకు లేఖ రాశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య. రెండున్నరేళ్ల పాలనలో సీఎం జగన్ దళితులను అన్ని విధాల వంచించారని లేఖలో పేర్కొన్నారు వర్ల రామయ్య. 30 నెలల పాలనలో 29 ఎస్సీ, ఎస్టీ పథకాలను రద్దుచేసి రూ.26,663 కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారి మళ్ళించారని నిప్పులు చెరిగారు వర్ల రామయ్య. దారి మళ్లిన సబ్ ప్లాన్ నిధులను తిరిగి ఎస్సీ,…