తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ శుభవార్త అందించింది. ఎల్లుండి ఆన్‌లైన్‌లో శ్రీవారి సర్వదర్శనం టోకెన్‌లు విడుదల చేస్తామని టీటీడీ ప్రకటించింది. జనవరి మాసానికి సంబంధించి రోజుకు 10వేల చొప్పున టోకెన్‌లను ఈనెల 27న ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపింది. అయితే వైకుంఠ ఏకాదశి వేడుకలు ఉన్న సందర్భంగా జనవరి 13 నుంచి 22 వరకు రోజుకు 5 వేల టోకెన్‌లను మాత్రమే అందుబాటులో ఉంచుతామని టీటీడీ పేర్కొంది.
Read Also: నాసా ప్రయోగం సక్సెస్… అంతరిక్షంలోకి అతిపెద్ద టెలీస్కోప్
మరోవైపు తిరుమలకు వచ్చే భక్తులు తప్పనిసరిగా కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తీసుకురావాలని టీటీడీ స్పష్టం చేసింది. ఒకవేళ వ్యాక్సిన్ ఇంకా వేయించుకోని నేపథ్యంలో 48 గంటల ముందు ఆర్టీపీసీఆర్ పరీక్ష నెగిటివ్ సర్టిఫికెట్ తీసుకురావాలని భక్తులకు తెలిపింది.