కడపలోని వైఎస్ఆర్ ఆర్కిటెక్టర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ విద్యార్థులు మంత్రి నారా లోకేష్ ను కలిశారు.. యూనివర్సిటీ గుర్తింపు విషయంలో నెలకొన్న సమస్యను పరిష్కరించాలని విన్నవించారు. విద్యార్థుల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన మంత్రి లోకేష్.. కలిసికట్టుగా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో.. విహారయాత్రకు వెళ్లి తిరిగి వస్తున్న ముగ్గురు మృతిచెందారు.. ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గ వద్దనున్న కాశిరెడ్డినాయన ఆశ్రమం వద్ద ఈ రోజు రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో ముందు వెళ్తున్న ట్రాక్టర్ ను స్కార్పియో వాహనం వెనుక వైపు నుంచి ఢీకొట్టింది.. ఈ ప్రమాదంలో కమల్ భాష (50), మున్నా (35), షేక్ నదీయా (3) మృతిచెందగా.. మరో ఆరుగురుకు తీవ్రగాయాలు అయ్యాయి.
ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టిస్తోన్న లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఈ కేసులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవకి నోటీసులు జారీ చేసింది సిట్.. గత ప్రభుత్వ హయంలో ఎక్సైజ్ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేసిన రజత్ భార్గవ.. కొద్ది నెలల క్రితం రిటైర్ అయ్యారు.. అయితే, ఆయనకు నోటీసులు జారీ చేసిన సిట్.. రేపు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది..
బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై నేటితో శాకంబరీ ఉత్సవాలు ముగియనున్నాయి.. రెండు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన ఉత్సవాలతో హరిత వర్ణ ఆభరణాలతో దర్శనమిచ్చారు శ్రీ కనకదుర్గమ్మ.. కూరగాయలు, ఆకు కూరలతో ఆలయం అలంకరించారు.. పండ్లు, కూరగాయలు ఆభరణాలుగా దర్శనమిస్తున్నారు దేవతామూర్తులు..
ఇవాళ ఏపీ వ్యాప్తంగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరగనుంది. అన్ని ప్రభుత్వ. ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలలో నిర్వహించనున్నారు... సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ సత్యసాయి జిల్లాలో కొత్తచెరువు ప్రభుత్వ పాఠశాలలో పాల్గొంటారు.. 2 కోట్ల మంది భాగస్వామ్యం తో ఈ మీటింగ్ జరగనుంది.. సుమారు 75 లక్షల మంది విద్యార్థులు..
బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు పీవీఎన్ మాధవ్... విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నా కంటే ముందు అధ్యక్షులైన వారి శక్తి యుక్తులతో ముందుకు వెళ్తాను అన్నారు.. ప్రతీ కార్యకర్త తానే అధ్యక్షుడయ్యానని అన్నంతగా పని చేస్తున్నారు.. రాష్ట్రంలో అరాచక పాలనకు చరమగీతం పలుకుతూ ఒక నిర్ణయాన్నిచ్చారని పేర్కొన్నారు.. బీజేపీ ఇచ్చిన ఈ పదవిని గౌరవంగా భావించి పని చేస్తాను అన్నారు..