బాలయ్య ఎంత బిజీగా ఉన్నా ఆయన మనసు హిందూపురంపైనే..
బాలయ్య ఎంత బిజీగా ఉన్నా ఆయన మనసు హిందూపురంపైనే.. నియోజకవర్గం అభివృద్ధి గురించే ఆలోచిస్తారని తెలిపారు సినీ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర దేవి.. హిందూపురం నియోజకవర్గంలో పర్యటించిన ఆమె.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.. శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలోని వీవర్స్ కాలనీలో జరిగిన సుప రిపాలనకు తొలిఅడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లిన సంక్షేమ పథకాలపై, సమస్యలపై ఆరా తీశారు.. ఇక, తమకు అన్ని పథకాలు అందుతున్నాయని సంతోషాన్ని వ్యక్తం చేశారు లబ్ధిదారులు.. ఈ సందర్భంగా బాలకృష్ణ సతీమణి వసుంధర దేవి మాట్లాడుతూ.. హిందూపురం అభివృద్ధిపై ఈ నెల 31వ తేదీన ఎమ్మెల్యే బాలకృష్ణ.. ఢిల్లీలో వివిధ శాఖల కేంద్ర మంత్రులతో కలిసి చర్చిస్తారని అన్నారు. గోళ్లపురం పారిశ్రామికవాడలో విద్యుత్తు సమస్య గతంలో ఉండేదని.. బాలకృష్ణ ఈ రోజు ఆ సమస్య లేకుండా చేశారని.. ఈ ప్రాంతంలో శుక్రవారం రోజు మహాలక్ష్మి వచ్చినట్టే విద్యుత్ వెలుగులు వస్తున్నాయి.. ఆ మహాలక్ష్మిని బాలకృష్ణ తీసుకొచ్చారు అని అభివర్ణించారు.. అయితే, బాలకృష్ణ గారు ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. ఎక్కడున్నా కూడా.. ఆయన హిందూపురం అభివృద్ధిపై, సమస్యలపై దృష్టి సారిస్తున్నారని వెల్లడించారు..
ఆ మాట చెబితే.. నేను జేసీ ఇంటికి వెళ్లి ఆయన భార్యకు క్షమాపణలు చెబుతా..!
తాడిపత్రిలో టీడీపీ నేత, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది.. అయితే, ఈ రోజు మీడియాతో మాట్లాడిన పెద్దారెడ్డి.. నేను జేసీ ప్రభాకర్ రెడ్డి భార్య ఉమ అక్కను ఎక్కడైనా తిట్టినట్లు, దూషించినట్లు ఆమె చెబితే.. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన భార్యకు క్షమాపణలు చెబుతానని వ్యాఖ్యానించారు.. నేను జేసీ ప్రభాకర్ రెడ్డి భార్య ఉమ అక్కను, ఆయన కుటుంబ సభ్యులను ఏనాడూ దూషించలేదన్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి.. అయితే, నేను ఉమ అక్కను ఎక్కడైనా తిట్టినట్లు, దూషించినట్లు ఆమె చెబితే.. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన భార్యకు క్షమాపణలు చెప్పేందుకు సిద్ధం అన్నారు.. మరోవైపు, నా కోడలు తాడిపత్రి వైసీపీ సమావేశంలో పాల్గొంటే జేసీ ప్రభాకర్ రెడ్డి అభ్యంతరం చెప్పడం ఏం సంస్కారం? అంటూ మండిపడ్డారు.. జేసీ ప్రభాకర్ రెడ్డి పై ఏం కేసులు ఉన్నాయో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లిస్ట్ తెప్పించుకోవాలని సూచించిన ఆయన.. జేసీ ప్రభాకర్ రెడ్డికి న్యాయం చేయాలంటే… సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ వల్లే అవుతుందన్నారు.. ఇక, సుప్రీంకోర్టు నిషేదించిన బీఎస్-3 వాహనాలను స్క్రాప్ కింద కొనుగోలు చేసి జేసీ ట్రావెల్స్ లో తిప్పారని విమర్శించారు..
చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై 420 కేసు పెట్టాలి.. మాజీ మంత్రి డిమాండ్..
సంతకం పెట్టి హామీలు అమలు చేయాని చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై 420 కేసు పెట్టాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆర్కే రోజా.. తిరుపతి జిల్లా నిండ్ర మండలంలో రికాలింగ్ చంద్రబాబు కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. ఇచ్చిన హామీలు అన్ని అమలు చేశానంటూ చంద్రబాబు సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారంటూ మండిపడ్డారు.. అబద్దాలు చెప్పి అధికారంలోకి రావడం చంద్రబాబుకు అలవాటని వ్యాఖ్యానించిన ఆమె.. సంతకం పెట్టి హామీలు అమలు చేయాని చంద్రబాబు, పవన్ పై 420 కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.. నిరుద్యోగులను, పిల్లలు సహా అందరినీ ఈ ప్రభుత్వం మోసం చేసిందన్నారు ఆర్కే రోజా.. సిగ్గు లేకుండా అడ్డదిడ్డంగా పెరిగిన అచ్చెన్నాయుడు.. ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే ఏపీ అమ్మేయాలని అంటున్నాడు అని మండిపడ్డారు.. ప్రతి నెల 1500 రూపాయలు మహిళలకు ఇస్తామని చెప్పి మోసం చేశారు… రెండు కోట్ల మందికి ఇవ్వాల్సి ఉండగా ఇవ్వకుండా మోసం చేస్తున్నాడు.. హామీ ఇచ్చేటప్పుడు మీకు తెలియదా..? అని నిలదీశారు.. కేవలం అధికారం కోసమే హామీలు ఇచ్చారని దుయ్యబట్టారు.. ఇలాంటి వారికి ఓటు వేసినందుకు ప్రజలు సిగ్గుపడాలి… కానీ, మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదన్నారు రోజా.. ఇక, రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ప్రీ బస్సు అంటూ మోసం చేశారని మండిపడ్డారు.
కొండెక్కిన పుట్టగొడుగుల ధర..! చికెన్, మటన్‌తో పోటీ..
వర్షాలు కురుస్తుండడంతో పుట్టగొడుగుల (Mushrooms) సీజన్ కూడా ప్రారంభం అయ్యింది.. కేవలం వర్షాకాలంలో మాత్రమే దొరికే నాటు పుట్టగొడుగులకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది.. అయితే, పుట్టగొడుగుల ధర వింటేనే సామాన్యులకు షాక్ తగులుతోంది అంటున్నారు.. భోజన ప్రియులకు ఇష్టమైన పుట్టగొడుగులు ధర ప్రస్తుతం చికెన్, మటన్ తో పోటీపడుతోంది. కేవలం వర్షాకాలంలో మాత్రమే దొరికే నాటు పుట్టగొడుగులు ధర వింటేనే షాక్ కొట్టినంత పని అవుతుంది.. పది చిన్న చిన్న పీసులు కలిగిన నాటు పుట్టగొడుగులు కట్ట ధర 150 నుంచి 200 రూపాయల వరకు పలుకుతోంది.. గతంలో వీటి ధర పది నుంచి 50 రూపాయలు మాత్రమే పలికేది.. కానీ, ప్రస్తుతం నగరాలు విస్తరిస్తున్న వేళ పుట్టగొడుగులు కూడా అక్కడక్కడ మాత్రమే దొరుకుతున్న పరిస్థితి.. దీనితో మాంసాహారం ధరలతో పోటీగా పుట్టగొడుగుల ధర కూడా పలుకుతుంది..
సీఎంలో అపరిచితుడు ఉన్నాడు.. కేటీఆర్ ఘాటు విమర్శలు
కామారెడ్డి జిల్లా లింగంపేటలో బీఆర్‌ఎస్ పార్టీ ఘనంగా నిర్వహించిన ఆత్మగర్జన సభలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎంలో అపరిచితుడు ఉన్నాడు.. ఒక్కోసారి రెమో, రామ్‌లా కనిపిస్తాడు అని చెప్పుకొచ్చాడు. ప్రజలకు నిజమైన ముఖాన్ని చూపకుండా నటిస్తున్నాడు అని మండిపడ్డారు. ఇక, రైతులకు ఇవ్వాల్సిన రైతు బంధు నిధులు ఇంకా అందలేదు.. కానీ, మూటలు డిల్లీకి వెళ్తున్నాయి.. రాహుల్ గాంధీ ఖాతాలో డబ్బులు పడుతున్నాయ్ అంటూ కేటీఆర్ ఆరోపించారు.
రేవంత్ రెడ్డికి ఆస్కార్ అవార్డు కాదు భాస్కర్ అవార్డు ఇవ్వాలి..!
మీడియాతో చిట్ చాట్ సందర్భంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రంగా మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి ఆస్కార్ అవార్డు కాదు, భాస్కర్ అవార్డు ఇవ్వాలి.. నోబెల్ ప్రైజ్ కాదు, గోబెల్స్ ప్రైజ్ ఇవ్వాలి అంటూ సెటైర్లు వేశారు. నరేంద్ర మోడీ సీఎం అయ్యే ముందు నుంచే బీసీ.. అప్పటి నుంచి ఎన్నో కులాలు బీసీల్లో కలిసిపోయినట్లు గుర్తు చేశారు. ఇక, రాహుల్ గాంధీ తల్లి తండ్రులు వేర్వేరు మతాలకు చెందినవారు, ఆయన కులం ఏంటి?” అని ప్రశ్నించారు. అయితే, పార్టీలో పోస్టుల కోసం ఒత్తిడి చేయొద్దు అన్నారు. మనం అందరం పార్టీ కార్యకర్తలమే, పదవులు వచ్చినవారు ఎక్కువ కాదు, రాని వారు తక్కువ కాదని వెల్లడించారు. వారం రోజుల్లో పార్టీ కొత్త కమిటీని ప్రకటిస్తుంది.. అందులో మొత్తం 20 మందిని నియమిస్తాం.. 33 శాతం మహిళలకు ప్రాధాన్యం ఇస్తామని రామచందర్ రావు చెప్పుకొచ్చారు.
జమ్మూ కాశ్మీర్‌లో పేలిన ల్యాండ్‌మైన్.. ఆర్మీ జవాను మృతి
జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్‌లోని నియంత్రణ రేఖ సమీపంలో ల్యాండ్‌మైన్ పేలింది. ఈ ప్రమాదంలో భారత సైన్యంలోని జాట్ రెజిమెంట్‌కు చెందిన ఒక సైనికుడు (అగ్నివీర్) మరణించగా, ఒక జెసిఓ, ఒక సైనికుడు గాయపడ్డారు. గాయపడిన సైనికులను హెలికాప్టర్ ద్వారా ఉధంపూర్‌లోని ఆర్మీ బేస్ ఆసుపత్రికి తరలించారు. హవేలి తహసీల్‌లోని సలోత్రి గ్రామంలోని విక్టర్ పోస్ట్ సమీపంలో మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, ఈ ల్యాండ్‌మైన్‌లను ఈ ప్రాంతంలో చొరబాట్లను నిరోధించడానికి అమర్చారు. భారత సైన్యంలోని 07 జాట్ రెజిమెంట్ సైనికులు సాధారణ గస్తీ నిర్వహిస్తున్న సమయంలో పేలినట్లు తెలుస్తోంది.
“హైడ్రోజన్ రైలు”తో చరిత్ర సృష్టించిన ఇండియన్ రైల్వే..
భారత రైల్వే చరిత్ర సృష్టించింది. గ్రీన్ రైల్ ఆవిష్కరణలో భాగంగా, భారత్ తన మొదటి హైడ్రోజన్-శక్తితో నడిచే రైలు కోచ్‌ను విజయవంతంగా పరీక్షించింది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)లో ఈ పరీక్ష జరిగింది. దీనికి సంబంధించిన విషయాలను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ధ్రువీకరించారు. ఆయన టెస్ట్ రన్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. భారత్ ప్రస్తుతం 1,200 HP హైడ్రోజన్-శక్తితో నడిచే రైలును అభివృద్ధి చేస్తోందని, ఇది హైడ్రోజన్ రైల్వే సాంకేతికతలో ప్రపంచ అగ్రదేశాల సరసన మన దేశాన్ని నిలబెట్టే కీలక సంఘటన అని ఆయన పేర్కొన్నారు. “మొదటి హైడ్రోజన్-పవర్‌తో నడిచే కోచ్ (డ్రైవింగ్ పవర్ కార్) చెన్నైలోని ICFలో విజయవంతంగా పరీక్షించబడింది. భారతదేశం 1,200 HP హైడ్రోజన్ రైలును అభివృద్ధి చేస్తోంది. ఇది భారతదేశాన్ని హైడ్రోజన్-శక్తితో నడిచే రైల్ టెక్నాలజీలో అగ్రగామిగా ఉంచుతుంది” అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘‘హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్’’ చొరవ కింద 35 హైడ్రోజన్-పవర్డ్ రైళ్లను నడపాలని యోచిస్తున్నట్లు 2023లో అశ్విని వైష్ణవ్ రాజ్యసభకు తెలియజేశారు. ప్రతీ రైలుకు రూ. 80 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు.
ఎంజీ సైబర్‌స్టర్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు విడుదల.. 580KM రేంజ్!.. ధర తెలిస్తే షాకే!
ఎంజి మోటార్ ఇండియా ఎంజి సైబర్‌స్టర్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారును భారత మార్కెట్లో విడుదల చేసింది. కంపెనీ తన ప్రీమియం MG సెలెక్ట్ అవుట్‌లెట్‌ల ద్వారా దీనిని విక్రయిస్తుంది. దీనితో పాటు, MG M9 కూడా ఈ షోరూమ్ ద్వారా విక్రయింస్తోంది. సైబర్‌స్టర్ భారత్ లో ఒకే ఒక వేరియంట్‌లో ప్రవేశపెట్టారు. లాంచ్‌కు ముందు బుక్ చేసుకున్న వారికి కంపెనీ తక్కువ ధరకు దీనిని అందిస్తోంది. లాంచ్ తర్వాత బుక్ చేసుకునే వ్యక్తులు అధిక ధర చెల్లించాల్సి ఉంటుంది. సైబర్‌స్టర్ EV భారత్ లో రూ. 74.99 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు విడుదలైంది. అదే సమయంలో, లాంచ్‌కు ముందు బుక్ చేసుకున్న వారికి, దాని ఎక్స్-షోరూమ్ ధర రూ. 72.49 లక్షలుగా నిర్ణయించింది.
గుక్కపెట్టి ఏడ్చేసిన కరుణ్ నాయర్.. కేఎల్ రాహుల్ ఎమోషనల్!
టీమిండియా బ్యాటర్ కరుణ్ నాయర్ కు చేదు అనుభవం మిగిలంది. దాదాపు 8 ఏళ్ల తర్వాత భారత జట్టులోకి వచ్చిన అతడు ఇంగ్లాండ్ తో జరిగే సిరీస్ లో సత్తా చాటలేకపోయాడు. ఇంగ్లండ్ తో లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టులోని మొదటి ఇన్సింగ్స్ లో డకౌట్ అయి తీవ్ర నిరాశపరిచాడు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 20 పరుగులు మాత్రమే చేశాడు.. అలాగే, ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన రెండో టెస్టులో వరుసగా 31, 26 రన్స్ మాత్రమే చేశాడు. లార్డ్స్ టెస్టులోని తొలి ఇన్సింగ్స్ లో కాస్త ఫర్వాలేదనిపించిన కరుణ్.. రెండో ఇన్నింగ్స్‌లో మళ్లీ పాత కథే పునరావృతం చేశాడు. కేవలం 14 పరుగులే చేసి పెవిలియన్ బాట పట్టాడు. ఈ నేపథ్యంలో అతడి ఆట తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పటికే మూడుసార్లు ఛాన్సులు ఇచ్చినా కరుణ్ తనను తాను నిరూపించుకోలేకపోయాడు.. ఇకపై అతడి స్థానంలో సాయి సుదర్శన్‌కు అవకాశం ఇవ్వాలనే డిమాండ్లు వచ్చాయి.
నాగిని’తో మెగా సయ్యాట!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ సోషియో-ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ షూటింగ్‌ను విజయవంతంగా పూర్తి చేశారు మేకర్స్. ఈ సినిమా నుంచి ఇప్పటికే టీజర్, ఫస్ట్ సింగిల్, రిలీజ్ అయి మంచి క్రేజ్ సంపాదించిన సంగతి తెలిసిందే. అంతేకాదు ప్రతిష్ఠాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘విశ్వంభర’కు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ బుక్‌ను ఆవిష్కరించారు. దర్శకుడు వశిష్ట రూపొందిస్తున్న ఈ సినిమాను, యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్‌లు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇక ‘విశ్వంభర’ షూటింగ్‌ను మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ నటి, నాగిని ఫేమ్ మౌనీ రాయ్‌లతో కూడిన ఒక థండరింగ్ మాస్ డాన్స్ నంబర్‌తో ముగించారు. ఈ హై-ఎనర్జీ డాన్స్ నంబర్‌ను సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో స్వరపరిచారు. చిత్రంలోని మొత్తం సంగీతాన్ని ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సమకూర్చినప్పటికీ, ఈ ప్రత్యేక డాన్స్ నంబర్‌ను భీమ్స్ అద్భుతంగా రూపొందించారు. ఈ ఫుట్-ట్యాపింగ్ సాంగ్‌కు డైనమిక్ రచయిత శ్యాం కాసర్ల సాహిత్యం అందించారు ‘పుష్ప’, ‘పుష్ప 2’, దేవర సినిమాల్లో బ్లాక్‌బస్టర్ సాంగ్స్‌కు కొరియోగ్రఫీ చేసిన గణేష్ ఆచార్య ఈ డాన్స్ నంబర్‌కు కొరియోగ్రఫీ అందించారు. 100 మందికి పైగా డాన్సర్లతో ఈ గీతం డాన్స్ ఫ్లోర్‌ను షేక్ చేయనుంది. ఈ సినిమాలో త్రిష కృష్ణన్ ప్రధాన హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆశికా రంగనాథ్ ఒక కీలక పాత్రలో కనిపించనుంది. కునాల్ కపూర్ కూడా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. సినిమాటోగ్రఫీని చోటా కె నాయుడు హ్యాండిల్ చేస్తుండగా, విశ్వంభర ప్రపంచాన్ని ప్రొడక్షన్ డిజైనర్ ఎఎస్ ప్రకాష్ రూపొందిస్తున్నారు.
ఎన్టీఆర్ సినిమా కోసం ప్రశాంత్ డిమాండ్లు వింటే మైండ్ బ్లాక్..?
సినీ పరిశ్రమలో బ్లాక్‌బస్టర్ డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన ప్రశాంత్ నీల్, ‘కేజీఎఫ్’ సిరీస్‌తో పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించారు. ఈ సినిమాల తర్వాత ఆయనకు డిమాండ్ రెట్టింపు అయింది. ప్రభాస్‌తో ‘సలార్’ సినిమాతో మరోసారి తన సత్తా చాటిన ప్రశాంత్ నీల్, ఇప్పుడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌తో కొత్త ప్రాజెక్ట్‌లో నిమగ్నమయ్యారు. ఈ సినిమా మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌ల సంయుక్త నిర్మాణంలో రూపొందనుంది. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఎన్టీఆర్ 31’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రారంభమైన ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.