Metro Rail Project: విశాఖ, బెజవాడ వాసులకు గుడ్‌న్యూస్.. మెట్రో రైలు ప్రాజెక్టులో కీలక ముందడుగు
- విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులపై కీలక ముందడుగు..
- ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్, సిస్టా, టిప్సా కన్సల్టెన్సీల మధ్య ఒప్పందం..
- నిర్మాణం, పర్యవేక్షణ, సాంకేతిక సహకారంపై కుదిరిన ఎంవోయూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Metro Rail Project: విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులపై కీలకంగా ముందడుగు పడింది. ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్, సిస్టా, టిప్సా కన్సల్టెన్సీల మధ్య నిర్మాణం, పర్యవేక్షణ, సాంకేతిక సహకారంపై ఒప్పందం జరిగింది.. ఈ ఒప్పందంపై మంత్రి నారాయణ సమక్షంలో సంతకాలు జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం మెట్రో నిర్మాణం ప్రతిపాదించామన్నారు. అయితే, గత ప్రభుత్వం ప్రాజెక్టులను నిర్లక్ష్యంగా పక్కన పెట్టిందని విమర్శించారు. పెరుగుతున్న ట్రాఫిక్‌కు మెట్రో రైలు నిర్మాణమే పరిష్కారమని స్పష్టం చేశారు. కేంద్రం 20 శాతం, రాష్ట్రం 20 శాతం, మిగిలిన 60 శాతం అతి తక్కువ వడ్డీ లోన్ ద్వారా కేంద్రం నుంచి అందనున్నదన్నారు. ఈ లోన్‌కు ఈఎంఐలను మెట్రో కార్పొరేషన్ చెల్లించనుంది వెల్లడించారు మంత్రి నారాయణ..
Read Also: Rahul Gandhi: ప్రధాని మోడీకి అంత సీను లేదు, మీడియా అతిగా చూపించింది..
Also Read
- GVMC వార్డుల పునర్విభజనకు ఆమోదం.. 120 వార్డులతో తుది గెజిట్ విడుదల
- Tirumala Srivari Brahmotsavam 2026: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజు ఏ వాహన సేవ అంటే?
- AP Government Jobs: గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఉద్యోగాల వయోపరిమితి పెంపు.. ఎప్పటి వరకు అంటే?
- AP Weather Alert: ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలపై అలర్ట్.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
ఇక, విశాఖ మెట్రో ఫేజ్-1 కింద 46.23 కిలోమీటర్ల మార్గానికి రూ.11,498 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం చేపడతామన్నారు మంత్రి నారాయణ.. వీఎంఆర్డీఏ 20 శాతం, కేంద్రం 20 శాతం, 60 శాతం లోన్ ద్వారా నిధుల సమీకరణ జరుగుతుందన్నారు. ఇందుకు సంబంధించి టెండర్ల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందన్నారు. మరోవైపు, విజయవాడ మెట్రో ఫేజ్-1 కింద 35.04 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపడతామని, రూ.10,118 కోట్లతో అమలు చేయనున్నట్టు వెల్లడించారు. CRDA 20 శాతం, కేంద్రం 20 శాతం, 60 శాతం లోన్ ద్వారా నిధులు సమీకరిస్తామన్నారు. విజయవాడ మెట్రోకు రేపు లేదా ఎల్లుండి టెండర్లు పిలవనున్నట్టు తెలిపారు. ఈ రెండు మెట్రో ప్రాజెక్టులను మూడేళ్లలో పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోందన్నారు. అయితే, విశాఖ మెట్రో ప్రాజెక్టుకు 99.75 ఎకరాలు, విజయవాడ మెట్రో ప్రాజెక్టు కోసం 91 ఎకరాలు అవసరమవుతాయని, భూ సేకరణకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశామన్నారు మంత్రి నారాయణ.. ప్రజలకు అత్యాధునిక రవాణా సదుపాయాలు అందించడమే లక్ష్యమని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
GVMC వార్డుల పునర్విభజనకు ఆమోదం.. 120 వార్డులతో తుది గెజిట్ విడుదల
-
Bethlehem Kudumba Unit : ఓవర్సీస్లో వాయించి కొట్టిన ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
Disha Salian Death Case: ‘నేను ఇకపై మౌనంగా ఉండను’… దిశా సాలియన్ కేసుపై మౌనం వీడిన సూరజ్ పంచోలి
-
Asia Cup Trophy Row: నఖ్వీతో ప్రొఫెషనల్ ఇంటరాక్షన్ మాత్రమే.. సైకియాపై విమర్శలు వద్దు: బీసీసీఐ
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!