గుంటూరు జిల్లా తాడేపల్లిలో సీఎం జగన్ దంపతులు సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ సంప్రదాయ బట్టల్లో కనిపించారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం సమీపంలోని గోశాలలో జరిగిన సంక్రాంతి సంబరాలకు సీఎం జగన్, ఆయన సతీమణి భారతి హాజరయ్యారు. ఈ సందర్భంగా అర్చకులు సీఎం దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ వేడుకలను ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. పల్లెటూళ్లలో సంక్రాంతి సందర్భంగా ఎలాంటి వేడుకలు నిర్వహిస్తారో వాటిని అన్నింటినీ తాడేపల్లి…
గుంటూరు జిల్లా జొన్నలగడ్డలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గురువారం రాత్రి నుంచి స్థానికంగా ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహం మాయమైంది. గతంలో జొన్నలగడ్డ సొసైటీ బిల్డింగ్ ప్రాంగణంలో ఎన్టీఆర్, వైఎస్ఆర్ విగ్రహాలను పక్కపక్కనే అభిమానులు ఏర్పాటు చేసుకున్నారు. అయితే వైఎస్ఆర్ విగ్రహాన్ని మాత్రం గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకుపోయారని అభిమానులు ఆరోపిస్తున్నారు. Read Also: సీఎం జగన్తో చిరంజీవి భేటీ కావడం మంచి పరిణామం: ఎమ్మెల్యే రోజా ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ విగ్రహం మాయమైన ఘటనపై వైసీపీ శ్రేణులు ఆందోళనకు…
కడప జిల్లాలోని శెట్టిపాలెంలో బంధువులతో సంక్రాంతి జరుపుకునేందుకు చిత్తూరు జిల్లా నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎం జగన్తో నటుడు చిరంజీవి భేటీ కావడం మంచి పరిణామమని ఎమ్మెల్యే రోజా అన్నారు. జగన్ ఏది చేసినా ప్రతిపక్షాలు బురదజల్లడం సరికాదని రోజా అభిప్రాయపడ్డారు. సామాన్య ప్రజల కోసం స్కూళ్లు, కాలేజీల ఫీజులను ప్రభుత్వం తగ్గిస్తే యాజమాన్యాలపై కక్ష సాధింపు చర్య అని ఆరోపించారని… కరోనా సమయంలో ప్రజలను…
గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో టీడీపీ నేత తోట చంద్రయ్య హత్య కేసు కలకలం సృష్టించింది.. అయితే, హత్య జరిగిన 24 గంటల్లోనే ఈ కేసును ఛేదించారు పోలీసులు.. మొత్తం 8 మంది నిందితులను అరెస్టు చేసినట్లు గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ ప్రకటించారు.. ఈ హత్యకు ప్రధాన కారణం పాత తగాదాలు అని మా ప్రాథమిక దర్యాప్తులో తేలినట్టు తెలిపారు.. మృతుడు తోట చంద్రయ్య మరియు ప్రధాన నిందితుడు చింతా శివ రామయ్య…
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి.. ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తెల్లవారుజామునే భోగి మంటలు వేసి సంబరాలు చేసుకున్నారు ప్రజలు.. వేకువజామున చీకట్లను చీల్చుకుంటూ భోగి మంటల కాంతులు విరజిమ్మాయి. వాడవాడలా భోగిమంటలు వేసి.. పెద్దలు, చిన్నారులు అంతా కలసి సందడిగా గడిపారు.. ఇక, సినీ, రాజకీయ ప్రముఖులు కూడా భోగి సంబరాల్లో పాల్గొని సందడి చేశారు.. ప్రకాశం జిల్లా కారంచేడుకు విచ్చేసిన సినీ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. తన సోదరి దగ్గుబాటి పురంధేశ్వరి…
విలువలను వీడకుండా ఓ సంకల్పంతో సినిమాలు తెరకెక్కించినవారు అరుదుగా కనిపిస్తారు. అలాంటి వారిలో కొల్లిపర బాలగంగాధర తిలక్ ఒకరు. ఇలా అంటే ఎవరికీ తెలియదు కానీ, కె.బి.తిలక్ అనగానే సినీ అభిమానులు ఇట్టే గుర్తు పట్టేస్తారు. తన ప్రతి సినిమాలోనూ ఏదో ఓ వైవిధ్యం చూపించాలని తపించేవారు తిలక్. ఆ తపనే ఆయనను ప్రత్యేకంగా నిలిపింది. కె.బి.తిలక్ 1926 జనవరి 14న పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో జన్మించారు. ప్రఖ్యాత దర్శకనిర్మాత ఎల్.వి.ప్రసాద్ స్వయాన అక్క కుమారుడే…
ఏపీలో కరోనా విజృంభిస్తోంది. కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. 24 గంటల్లో 47,884 శాంపిల్స్ను పరీక్షించగా 4,348 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 20,92,227 కి చేరింది. ఇందులో 20,63,516 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 14,204 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో 14,507 మంది మృతి చెందినట్టు హెల్త్…