ఏపీ హైకోర్టు ఉద్యోగుల సంఘం సీఎం జగన్‌కు లేఖ రాశారు. ఉద్యోగుల ఆవేదనను మీ దృష్టికి తీసుకురావడంలో పీఆర్సీ సాధన సమితి నేతలు విఫలం అయ్యారు. కాబట్టి ఇటీవల ప్రకటించిన పీఆర్సీలో లోటుపాట్లను గుర్తించాలని.. ఈ విషయంలో పునరాలోచించి ఉద్యోగులకు జరిగిన అన్యాయంపై దృష్టిపెట్టాలని లేఖలో కోరారు. మెరుగైన పీఆర్సీ ప్రకటించాలని హైకోర్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వేణుగోపాల్ పేర్కొన్నారు. గతంలో మాదిరిగానే హెచ్‌ఆర్‌ఏను కొనసాగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Read Also: ఎర్రజెండా వెనుక పచ్చజెండా అజెండా: సీఎం జగన్
అశుతోష్ మిశ్రా కమిటీ పీఆర్సీ రిపోర్టును పూర్తిగా పక్కనపెట్టి కేవలం మంత్రుల ఉపసంఘం నిర్దేశించిన మేరకు ఫిట్‌మెంట్ ప్రకటించారని సీఎం జగన్‌కు రాసిన లేఖలో వేణుగోపాల్ ప్రస్తావించారు. ఈ నిర్ణయంతో వేల ఉద్యోగుల గుండెల్లో రగిలిన వ్యధ నుంచి పీఆర్సీ సాధన సమితి ఏర్పాటైందని, కానీ అశుతోష్ మిశ్రా కమిటీ నివేదికను ఇటీవల జరిగిన సమావేశంలో పీఆర్సీ సాధన సమితి పూర్తిగా పక్కన పెట్టేసిందని హైకోర్టు ఉద్యోగుల సంఘం మండిపడింది. కాగా ఇప్పటికే పీఆర్సీ సాధన సమితి కుదుర్చుకున్న ఒప్పందం విషయంలో ఉపాధ్యాయ సంఘాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.