విజయవాడ జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలంటూ డిమాండ్ పెరుగుతోంది… టీడీపీకి కూడా దీనిపై ఉద్యమానికి సిద్ధం అవుతుంది.. రేపు వేలాది మందితో ఆందోళన నిర్వహించనున్నట్టు ప్రకటించారు టీడీపీ నేత బోండా ఉమా మహేశ్వరరావు.. ఈ సందర్భంగా వంగవీటి రాధా, మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఉమ… రంగా కుటుంబ సభ్యులు కూడా వారి సన్నిహితులైన కొడాలి నాని, వంశీమోహన్ ద్వారా ఈ జిల్లాకు రంగా పేరు పెట్టాలని ప్రయత్నిస్తున్నారేమోనన్న ఆయన.. రాధాకు వంశీ, కొడాలి నానితో మంచి సంబంధాలున్నాయని.. ఓ ఫోన్ కాల్ ద్వారా, లేదా మెసేజ్ ద్వారాగాని ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారేమో..? అంటూ కామెంట్ చేశారు.
Read Also: కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ ప్రధాని మోడీ.. ఆ పార్టీ లేకపోయుంటే..!
ఇక, డిసెంబర్ 26న వంగవీటి రంగా వర్థంతి సందర్భంగా రంగా విగ్రహావిష్కరణలోనూ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ పాల్గొన్నారన్న విషయాన్ని గుర్తుచేశారు బోండా ఉమ… విజయవాడకు వంగవీటి రంగా పేరు పెట్టాలంటూ తాము తలపెట్టిన దీక్షకు ఆహ్వానించేందుకు వంగవీటి రాధాకృష్ణ తమకు ప్రస్తుతం అందుబాటులో లేరని.. మీడియా ద్వారానే ఆయన్ను దీక్షకు ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు.. మరోవైపు.. వంగవీటి రంగా ఒక కుటుంబానికో.. ఒక కులానికో.. ఓ మతానికి సంబంధించిన చెందిన వ్యక్తి కాదని స్పష్టం చేసిన బోండా ఉమ.. ఆయన అన్నివర్గాల, ప్రజల మనిషి అని తెలిపారు.