విజయవాడ జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలనే డిమాండ్ క్రమంగా పెరుగుతోంది… విజయవాడ జిల్లాకు రంగా పేరు పెట్టాల్సిందేనని డిమాండ్ చేశారు టీడీపీ పొలిట్‌బ్యూర్ సభ్యులు బోండా ఉమ.. దీని కోసం ఆందోళనకు కూడా సిద్ధం అవుతున్నారు.. రేపు ధర్నా చౌక్ వద్ద రంగా పేరు పెట్టాలన్న డిమాండ్‌తో వేల మందితో ఆందోళన చేయనున్నట్టు ప్రకటించారు.. అవసరతే సీఎం ఇల్లు ముట్టడికి కూడా సిద్ధమన్నారు.. వంగవీటి మోహనరంగా విగ్రహం లేని ప్రాంతం లేదన్న ఆయన.. రంగా వంటి మహానేత పేరు పెట్టకపోతే సీఎం వైఎస్ జగన్ ఆయన్ని అవమానించినట్లే అన్నారు.. తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఒక్కరు కూడా ఈ డిమాండ్ లపై ఎందుకు మాట్లాడడం లేదు? అని నిలదీశారు.
Read Also: వైరల్‌గా మారిన అసిస్టెంట్ కలెక్టర్ వెడ్డింగ్ ఇన్విటేషన్.. లవ్ స్టోరీ మొత్తం..!
రంగా అనే వ్యక్తి అన్ని వర్గాల వారికి ఆరాధ్య నాయకులు అన్నారు బోండా ఉమ… విజయవాడలో పేదల కోసం నిరాహారదీక్ష చేస్తూ రంగా ప్రాణాలు అర్పించారన్న ఆయన.. ఈ డిమాండ్‌తో శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు సభలు జరుగుతున్నాయన్నారు.. రంగా పేరు పెట్టకపోతే చరిత్ర హీనులవుతారనేది వాస్తవమన్న ఆయన.. ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఎటువంటి ఖర్చు కూడా అవ్వదన్నారు.. తూర్పు కృష్ణాకు ఎన్టీఆర్ పేరు, విజయవాడకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాల్సిందేనని డిమాండ్ చేశారు.. పది రోజుల నుంచి అడుగుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదని.. జిల్లాల పునర్విభజన విషయంలో ఎవరి అభిప్రాయాలు తీసుకోలేదని మండిపడ్డారు.. జిల్లాల వ్యవహారం సొంత పార్టీ వ్యవహారంలాగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేసిన ఉమ… అనేక జిల్లాల్లో స్థానిక సంఘాలు, ప్రజలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని గుర్తుచేశారు.. 13 జిల్లాల్లో ఆయా జిల్లాల అభివృద్ధికి పని చేసిన మహానుభావులు ఉన్నారు.. వారి పేర్లను, అక్కడి ప్రజల మనోభావాలను జగన్ పట్టించుకోవడం లేదన్నారు.. క్యాసినో వ్యవహారం చూసి రాష్ట్ర ప్రజలు ఉలిక్కిపడ్డారు.. దీని దృష్టి మళ్లించడానికే ఆఘమేఘాల మీద 26 జిల్లాల అంశాన్ని తెరపైకి తెచ్చారన్నారు.. ఇక, ఈ జిల్లాల పునర్విభజన వల్ల చిన్న ఉద్యోగమైనా కొత్తగా ఇవ్వగలరా..? అని ప్రశ్నించిన ఉమ.. అమ్మకు అన్నం పెట్టలేనోడు చిన్నమ్మకు పట్టుచీర కొంటానన్న విధంగా జగన్ తీరు ఉందని ఎద్దేవా చేశారు.. ఉన్న ఉద్యోగాలను పీకేసి.. ఉన్నవారికి జీతాలు కూడా ఇవ్వని పరిస్థితి ఉందని.. కడపకు వైయస్సార్ జిల్లా పెట్టిన విధంగా.. ఇతర జిల్లాల్లో ఉన్న గొప్పవారి పేర్లను పెట్టాలని కోరారు.. రాజకీయ పార్టీ, ప్రజల అభిప్రాయాలు తీసుకున్నాకే పేర్లు పెట్టాలని చూసించారు.. వైసీపీ నేతలకు అనుకూలంగా జిల్లాల పేర్లు పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నామన్న ఆయన.. గౌతులచ్చన్న, బాలయోగి, యస్వీ రంగారావు పేర్లు పెట్టాలని అడుగుతున్నారు.. ఎన్టీఆర్ బాల్యం గడిచిన తూర్పు కృష్ణాకు ఆయన పేరు పెట్టాలని.. ఇప్పటికే ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశాం.. వైసీపీ స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.