వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణ రాజుకు ఇవాళ నోటీసులు అందజేశారు ఏపీ సీఐడీ అధికారులు… గతంలో ఆయనపై నమోదైన కేసులకు సంబంధించిన విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో సీఐడీ అధికారులు రఘురామ కృష్ణరాజుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పలు సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది.. రఘురామకృష్ణరాజుపై 124(A), 153(B), 505 IPC, 120(B) సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సీఐడీ.. ఇవాళ హైదరాబాద్ గచ్చిబౌలిలోని రఘురామ ఇంటికి వచ్చి…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది.. ఒక్కోసారి రోజువారి పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త తగ్గినా.. కొత్త కేసుల సంఖ్య మాత్రం 2 వేల వైపు పరుగులు పెడుతూనే ఉంది.. తాజాగా, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది.. అనంతపురం జిల్లా ఉరవకొండ అసెంబ్లీ స్థానం నుంచి ప్రతినిథ్యం వహిస్తున్న పయ్యావుల కేశవ్‌కు తాజాగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉండి.. వైద్యుల సూచలన మేరకు ఆయన…
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ నేత, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఇంటికి మరోసారి వెళ్లారు ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు.. హైదరాబాద్ గచ్చిబౌలిలోని రఘురామ ఇంటికి వెళ్లారు ఏపీ సీఐడీ అధికారులు.. గతంలో రఘురామను విచారించిన సీఐడీ, ఆ తర్వాత ఆయనను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే కాగా.. మరోసారి సీఐడీ పోలీసుల విచారణకు రావాలని రఘురామకృష్ణరాజుకు నోటీసులు ఇచ్చేందుకే వచ్చినట్టుగా చెబుతున్నారు.. రేపు సీఐడీ విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు ఇవ్వనున్నట్టుగా సమాచారం.. మరి సీఐడీ నోటీసుల్లో ఏముందో..?…
తెలుగు రాష్ట్రాల్లో వరుసగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతూ పోతోంది.. కొన్ని సార్లు కాస్త తగ్గినా కోవిడ్ ఉధృతి మాత్రం కొనసాగుతూనే ఉంది.. ఇప్పటికే చాలా మంది ప్రముఖులను కోవిడ్ టచ్ చేసింది.. సినీ పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు, హీరోయిన్లతో పాటు పలువురు కోవిడ్ బారినపడగా.. మరోవైపు రాజకీయ నేతలను కూడా కోవిడ్ వదలడం లేదు.. తాజాగా, తెలుగుదేశం పార్టీ నేత వంగవీటి రాధాకృష్ణకు కరోనా పాజిటివ్‌గా తేలింది… దీంతో హైదరాబాద్‌లోని ఏఐజీలో…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారంపై దృష్టి సారించింది కేంద్రం హోంశాఖ.. ఇప్పటికే ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంమత్రిత్వశాఖ లేఖ రాసింది. విభజన సమస్యలు, ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలపై జనవరి 12న జరగనున్న సమావేశానికి హాజరు కావాలని కోరిన విషయం తెలిసింది.. అందులో భాగంగా ఇవాళ ఇరు రాష్ట్రాల సీఎస్‌లతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా సమావేశం కానున్నారు. మొదట ఢిల్లీలో ప్రత్యక్షంగా ఈ సమావేశం…
జనసేన కార్యనిర్వాహక సభ్యులతో పవన్ కళ్యాణ్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీలో పొత్తులపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అందరితో కలిసి చర్చించాకే వచ్చే ఎన్నికల్లో పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని పవన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్నామన్నారు. రకరకాల పార్టీలు మనతోనే పొత్తు కోరుకోవచ్చని పవన్ అభిప్రాయపడ్డారు. అయితే ప్రస్తుతం పొత్తుల కంటే ముందుగా పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణంపైనే కార్యకర్తలు ఫోకస్ పెట్టాలని సూచించారు. పొత్తులపై అందరిదీ ఒకే…
టీడీపీ అధినేత చంద్రబాబు టీడీపీ ఈ-పేపర్‌ను మంగళవారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన సినిమా టిక్కెట్ల వివాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు అనవసరంగా సినిమా టిక్కెట్ల వివాదంలోకి టీడీపీని లాగుతున్నారని… టీడీపీకి సినిమా పరిశ్రమ సహకరించిన దాఖలాలు లేవన్నారు. సీఎంగా ఉన్నప్పుడు, ఇటీవల తనకు వ్యతిరేకంగా సినిమాలు తీశారని చంద్రబాబు గుర్తుచేశారు. రాజకీయ పార్టీ పెట్టకముందు… ఆ తర్వాత చిరంజీవి తనతో బాగానే ఉన్నారని… కానీ 2009లో చిరంజీవి తనకు సహకరించి ఉంటే అప్పుడు…
విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి మంగళవారం మధ్యాహ్నం నాడు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు విశాఖలోని శారదా పీఠంలో వార్షిక మహోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖ శారదా పీఠం వార్షిక మహోత్సవాలకు రావాలంటూ సీఎం జగన్‌ను స్వాత్మానందేంద్ర సరస్వతి ఆహ్వానించారు. ఈ మేరకు ఆహ్వాన పత్రికను సీఎం జగన్‌కు అందజేసి శాలువా కప్పి వేదాశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో…
ఏపీలో సినిమా టిక్కెట్ రేట్లపై ప్రభుత్వం ఓ కమిటీని నియమించగా… మంగళవారం మధ్యాహ్నం కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా టిక్కెట్ల కమిటీ సమావేశంలో ఆసక్తికర చర్చ జరిగింది. ఫిల్మ్ గోయర్ సభ్యుడు రాకేష్ రెడ్డి ఇచ్చిన రిపోర్టును కమిటీ అభినందించింది. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల గురించి రాకేష్‌రెడ్డి సమగ్రంగా నివేదిక తయారుచేసినట్లు తెలుస్తోంది. అయితే ఏపీలో తగ్గించిన టిక్కెట్ రేట్లతో థియేటర్ల నిర్వహణ చాలా కష్టమని ఓ ఎగ్జిబిటర్ సభ్యుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. ముఖ్యంగా బి,…
ఏపీలో నైట్ కర్ఫ్యూ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి పండగ నేపథ్యంలో నైట్ కర్ఫ్యూ వల్ల ప్రజలు ఇబ్బంది పడే అవకాశముందని సీఎం దృష్టికి వచ్చిందని ఎన్టీవీతో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని వెల్లడించారు. దీంతో రాత్రి కర్ఫ్యూ అమలులో సడలింపు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారని… ఈ నెల 18 నుంచి రాత్రి కర్ఫ్యూ అమలులోకి వస్తుందని తెలిపారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సీఎం జగన్ సమగ్రంగా సమీక్షించారని… కరోనా ఎన్ని వేవ్‌లు వచ్చినా…