ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం తప్పులో కాలేశారు. టంగ్ స్లిప్ కావడంతో సీఎం జగన్‌కు బదులు మాజీ సీఎం చంద్రబాబు డైనమిక్ లీడర్ అంటూ ప్రశంసలు కురిపించారు. వివరాల్లోకి వెళ్తే.. రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా బుధవారం అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ… కరోనా కట్టడికి సీఎం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించకుండా ఉండలేమని స్పీకర్ అభిప్రాయపడ్డారు. వాలంటీర్లు, సచివాలయాల కాన్సెప్ట్‌ల ద్వారా ప్రతి ఇంటికి ప్రభుత్వం చేపట్టే కోవిడ్ నివారణ చర్యలను తీసుకెళ్లే అద్భుతమైన యంత్రాంగాన్ని మనం…
ఏపీలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను విభజిస్తూ 26 జిల్లాలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే జిల్లాల పేర్లలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. మంగళవారం కేబినెట్ సమావేశంలో ప్రవేశపెట్టిన మెమోరాండానికి, తర్వాత ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్లలో తేడాలు కనిపించాయి. కేబినెట్ సమావేశంలో ప్రవేశపెట్టిన మెమోరాండంలో కాకినాడ కేంద్రంగా ఉన్న జిల్లాకు తూర్పుగోదావరి అని… రాజమండ్రి కేంద్రంగా ఏర్పాటు కానున్న జిల్లాకు రాజమండ్రి జిల్లా అని పేరు పెట్టినట్లు ఉంది. అయితే ప్రభుత్వం విడుదల…
✪ ఏపీలో పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా నేటి నుంచి జిల్లా కేంద్రాల్లో ఉద్యోగ సంఘాల రిలే నిరాహార దీక్షలు… ఈనెల 30 వరకు కొనసాగనున్న ఉద్యోగ సంఘాల రిలే నిరాహార దీక్షలు✪ ఏపీలో స్కూళ్ల నిర్వహణపై నేడు అధికారుల కీలక సమావేశం… పాఠశాలల మ్యాపింగ్‌పై ఎమ్మెల్యేలకు మూడు రోజుల పాటు అవగాహన కార్యక్రమం… బడుల నిర్వహణ, టీచర్ల సర్దుబాటుపై నిర్ణయం✪ ఉద్యోగ సంఘాలతో నేడు ఏపీ ప్రభుత్వం మరోసారి చర్చలు✪ నేటి నుంచి కార్వీ ఎండీ పార్థసారథిని…
ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాలో సంఖ్య రెట్టింపు కాబోతోంది.. జిల్లాల సంఖ్య 13 నుంచి 26కు పెరగబోతోంది.. ఇప్పటికే దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది ప్రభుత్వం.. జిల్లాల పేర్లను కూడా ఖరారు చేసింది.. అయితే, జిల్లాలపై ఉన్న అభ్యంతరాలను స్వీకరించే అవకాశం ఇచ్చింది.. అయితే, కొత్త జిల్లాల ఏర్పాటును ఏపీ బీజేపీ స్వాగతించింది.. కొత్త జిల్లా ఏర్పాటుపై స్పందించిన ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు.. కొత్త జిల్లాలతో పరిపాలనా సౌలభ్యం ఉంటుందన్నారు.. ఇక, 2014లోనే బీజేపీ ఎన్నికల…
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఫిబ్రవరి మాసానాకి సంబంధించిన దర్శనం టికెట్లను విడుదల చేసేందుకు సిద్ధమైంది టీటీడీ.. ఎల్లుండి ఆన్లైన్లో ఫిబ్రవరి నెలకు సంబంధిచిన కోటా టికెట్లను ఉంచనున్నారు.. ఎల్లుండి ఆన్లైన్లో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను బుక్‌చేసుకునే అవకాశం కల్పిస్తోంది టీటీడీ.. ఇక, ఫిబ్రవరి మాసంలో రోజుకి 12 వేల చొప్పున టికెట్లను విడుదల చేయనున్నారు.. మరోవైపు.. ఈ నెల 29వ తేదీన సర్వదర్శనం టోకెన్లు విడుదల చేయనుంది టీటీడీ.. రోజుకు ప్రత్యేక ప్రవేశ దర్శనం…
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు మొదలైంది.. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేశారు.. 13 జిల్లాలుగా ఉన్న ఏపీ 26 జిల్లాలుగా పునర్విభజించనున్నారు.. ఆయా జిల్లాల పేర్లను కూడా ఖరారు చేశారు.. మరోవైపు.. ఇప్పటికే అనేక సమస్యలపై వరుసగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి లేఖలు రాస్తూ వస్తున్న మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మానాభం.. ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలోనూ ఓ లేఖ రాశారు.. కొత్త జిల్లాలకు తాను సూచిస్తున్న మూడు పేర్లు పెట్టాలని…
గుంటూరు జిల్లాలో సంచలనంగా మారిన మైనర్ బాలికపై అత్యాచారం కేసులో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతను అరెస్ట్ చేశారు పోలీసులు.. బాలికపై అత్యాచారం కేసులో వైసీపీ నేత కన్నా భూశంకర్ ని అరెస్ట్ చేసిన అరండల్‌పేట పోలీసులు.. భూ శంకర్ తో పాటు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్టుగా చెబుతున్నారు.. ఇక, ఇదే కేసులో గతంలో 18 మందిని పోలీసులు అరెస్ట్ చేయగా.. తాజా అరెస్ట్‌లతో కలిసి మొత్తం అరెస్ట్ అయినవారి సంఖ్య 24 మందికి…
ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులతో పాటు పొరుగు రాష్ట్రాల ఆర్టీసీ బస్సులతో పోటీ పడేందుకు వీలుగా ఇకపై ఏసీ బస్సుల్లో అవసరాన్ని బట్టి ఛార్జీలు తగ్గించేలా ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ ప్రభావం, చలి కాలం కారణంగా ప్రస్తుతం ఏసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో గణనీయంగా పడిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో రద్దీని బట్టి ఛార్జీలు వసూలు చేస్తామని అధికారులు తెలిపారు. Read Also: ఏపీలో కొత్త లెక్కలు……