టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. కడపలో మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ… చంద్రబాబు సీనియారిటీతో దేశానికి, రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం లేదని ఆయన ఎద్దేవా చేశారు. సంక్రాంతి ముగిసి పదిరోజులు దాటినా జూదం, క్యాసినో పేరుతో చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వంపై ఏదో ఒక రకంగా బురద జల్లేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. Read Also: విజయవాడలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు మరోవైపు ఉద్యోగ సంఘాల…
డీజీపీ గౌతమ్ సవాంగ్, మంత్రి కొడాలి నానిపై విమర్శలు చేశారనే ఆరోపణలపై టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నను సోమవారం సాయంత్రం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అమరావతి వన్టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి సోమవారం అర్ధరాత్రి బుద్ధా వెంకన్న బెయిల్పై విడుదలయ్యారు. స్టేషన్ బెయిల్ ఇచ్చి ఆయన్ను పోలీసులు విడుదల చేశారు. రెచ్చగొట్టేలా ప్రసంగం చేసినందుకు సెక్షన్ 153ఎ, భయోత్సాతం సృష్టించినందుకు సెక్షన్ 506, మత, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారని 505 (2),…
ఏపీలోని మహిళలకు జగన్ ప్రభుత్వం శుభవార్తను అందించింది. ఈరోజు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఆర్ధికంగా వెనుక బడిన వర్గాల్లోని 45 నుంచి 60 ఏళ్ల మధ్య గల మహిళలకు ఆర్థిక స్వావలంబన అందించాలనే ఉద్దేశంతో ఈ పథకం ద్వారా ఏటా మహిళలకు రూ.15వేలు నగదును అందిస్తున్నారు. ఈ పథకాన్ని ఈరోజు సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి ఉ.11 గంటలకు వర్చువల్గా సీఎం జగన్ ప్రారంభిస్తారు. Read Also: ఏపీ విద్యాశాఖ కీలక…
ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పాఠశాలల్లో ఉదయం పూట ప్రార్థనలను నిలిపివేయాలని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కరోనా నియంత్రణ మార్గదర్శకాలను విడుదల చేసింది. అంతేకాకుండా పాఠశాలల్లో ఎలాంటి క్రీడలు నిర్వహించవద్దని సూచించింది. విద్యార్థులు గూమిగూడకుండా టీచర్లు చర్యలు తీసుకోవాలని హితవు పలికింది. Read Also: ఏపీలో పలువురు ఐఏఎస్ల బదిలీ.. లిస్ట్ ఇదే కరోనా నేపథ్యంలో పాఠశాల…
ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేస్తూ సోమవారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్గా ప్రసన్న వెంకటేష్… మైనారిటీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా కె.సునీత… సాంఘిక సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా గంధం చంద్రుడు… కార్మిక శాఖ ప్రత్యేక కమిషనర్గా కార్తీకేయ మిశ్రా… కాపు కార్పొరేషన్ ఎండీగా రేఖారాణి…. విజయవాడ మున్సిపల్ కమిషనర్గా రంజిత్ బాషా… MSME కార్పొరేషన్ సీఈవోగా ఎన్వీ రమణారెడ్డి… ఏపీ భవన్ స్పెషల్ ఆఫీసర్గా…
✪ నేడు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం ప్రారంభం… ఈ పథకాన్ని వర్చువల్గా ప్రారంభించనున్న సీఎం జగన్✪ నేటి నుంచి ఏపీలో ఉద్యోగ సంఘాల నిరసనలు… పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాల నిరసనలు✪ విజయవాడ: నేడు బీజేపీ ఒక్కరోజు నిరసన దీక్ష… ఉద్యోగుల ఆందోళనలకు సంఘీభావంగా దీక్ష చేపట్టనున్న బీజేపీ నేతలు✪ విశాఖ: నేడు పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాల బైక్ ర్యాలీ.. కలెక్టరేట్ నుంచి పోలీస్ కమిషనర్ కార్యాలయం వరకు కొనసాగనున్న…
ఆంధ్రప్రదేశ్లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది.. ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 14,440 కోవిడ్ పాజివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఇక, మరోసారి విశాఖపట్నంలో రికార్డు స్థాయిలో రోజువారి కేసులు నమోదు అయ్యాయి.. కోవిడ్ కేసుల నమోదులో మళ్లీ టాప్ ప్లేస్ లోకి వెళ్లిపోయింది వైజాగ్.. వరుసగా నాలుగో రోజు కూడా పాజిటివ్ కేసుల సంఖ్య 2 వేలకు పైగానే వెలుగు చూశాయి.. గడిచిన 24 గంటల్లో 2,258 పాజిటివ్ కేసులు నమోదు కాగా..…
ఏపీలో చింతామణి నాటకంపై ప్రభుత్వం నిషేధం విధించడాన్ని కళాకారులు, తెలుగు భాషా ప్రేమికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు విశాఖలోని మద్దిలపాలెం జంక్షన్లో తెలుగు తల్లి విగ్రహం వద్ద కళాకారులు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో జబర్దస్త్ నటుడు అప్పారావు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జబర్దస్త్ నటుడు అప్పారావు మాట్లాడుతూ… చింతామణి నాటకంపై ఏపీ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. Read Also: చంద్రబాబు ఇంట్లో వ్యభిచారం జరుగుతోంది:…