మూడు రాజధానుల ఆంశంపై మరోసారి విచారణ జరిపింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. మూడు రాజధానుల బిల్లులను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టింది.. ప్రభుత్వం చట్టాలను ఉపసంహరించుకున్నా మళ్లీ ప్రవేశ పెడతామని పేర్కొనడంతో విచారణ కొనసాగించాలని న్యాయవాదులు కోరారు. పిటీషన్లలో ఏ అంశాలపై విచారణ కొనసాగించాలో అఫిడవిట్లు దాఖలు చేయాలని గతంలో త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్ అభివృద్ధి, నిర్మాణం నిలిపివేసిన పనులు కొనసాగించడం, రైతుల ప్లాట్లను అభివృద్ధి చేయడం, రాజధాని నుంచి కార్యాలయాల తరలింపు…
పీఆర్సీ అమలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిపింది హైకోర్టు.. ప్రభుత్వ తరపు న్యాయవాది శ్రీరామ్ వాదనలు వనిపించారు.. ఈ పిటిషన్ డివిజన్ బెంచ్ ముందు విచారించాలని, ఇది సింగిల్ బెంచ్ కాబట్టి.. ఇక్కడ విచారించకూడదని హైకోర్టుకు తెలిపారు.. ఆయన వాదనతో ఏకీభవించిన ధర్మాసనం రిట్ పిటిషన్‌ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తదుపరి చర్యలు తీసుకోవడానికి పంపాలని రిజిస్టర్‌ను ఆదేశించింది. పిటిషన్లు మళ్లీ సీజే బెంచ్‌కి బదిలీ…
ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్సీ వ్యవహారం ప్రభుత్వం-ఉద్యోగ సంఘాల మధ్య ఎటూ తేలకుండా పోతోంది.. ఓవైపు ఉద్యోగ సంఘాలు ఆందోళన బాట పడితే.. మరోవైపు.. చర్చల కోసం ప్రభుత్వం కమిటీ ఏర్పాటుచేసింది.. అయినా, చర్చలకు ముందు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.. అయితే, పీఆర్సీ సాధన సమితి తీరుపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇకపై చర్చల కోసం సంప్రదింపుల కమిటీ ఎదురుచూపులు ఉండబోవని స్పష్టం చేశారు.. ఉద్యోగ సంఘాలు ముందుకు వస్తేనే చర్చలు ఉంటాయన్న ఆయన..…
బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. కడప ఎయిర్‌పోర్టు విషయంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.. అయితే, ఆయన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి.. బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఓ ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్న ఆయన.. కడప ప్రజలు మనుషులను చంపుతారని వారికి ఎయిర్ పోర్టు అవసరమా అని సోమువీర్రాజు వ్యాఖ్యలు చేయడం శోచనీయం అన్నారు.. ఆయన తన మాటలు వెంటనే వెనక్కు…
అనంతపురం జిల్లాలో జగనన్న పాలవెల్లువ కార్యక్రమాన్ని శుక్రవారం నాడు క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం జగన్ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా అమూల్ సంస్థతో రెండు ఒప్పందాలపై సీఎం జగన్ సంతకాలు చేశారు. బాలమృతం, అంగన్వాడీ పిల్లలకు పాల సరఫరాపై అమూల్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ… పాలు పోస్తున్న మహిళలే అమూల్‌కు యజమానులు అని వెల్లడించారు. ప్రైవేట్ డైరీల కన్నా ఎక్కువ రేటు ఇచ్చి అమూల్ సంస్థ పాలు…
తిరుమల ఫిబ్రవరి నెలకు సంబంధించి శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను శుక్రవారం ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో టీటీడీ విడుదల చేసింది. ప్రతిరోజూ 12వేల టిక్కెట్లు చొప్పున రూ.300 దర్శనం టిక్కెట్లను టీటీడీ అందుబాటులో ఉంచగా.. అన్నీ టిక్కెట్లు 40 నిమిషాల వ్యవధిలోనే బుక్ అయిపోయాయి. చాలా మంది భక్తులకు టిక్కెట్లు దొరక్కపోవడంతో వారు నిరాశకు గురయ్యారు. Read Also: అదొక్కటే జగన్ చేసిన మంచి పని: టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల కాగా మరోవైపు ఫిబ్రవరి…
ఏపీలో జిల్లాల విభజనపై ప్రతిపక్ష నేతలు స్పందిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటు చేయడంపై ఇప్పటికే చంద్రబాబు, బాలకృష్ణ, పురంధేశ్వరి స్వాగతించారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా స్పందించారు. 2019 నుంచి జగన్ పాలనలో 100 పనులు చేస్తే అందులో 99 సుద్ద తప్పులు ఉన్నాయని… ఆ తప్పులతో జగన్ ప్రభుత్వం ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతోందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. ప్రతి తప్పుకి ప్రజలను డైవర్ట్ చేయడం ఈ ప్రభుత్వానికి…
విశాఖ జిల్లా పెందుర్తి మండలం సత్తివానిపాలెంలో రెవెన్యూ అధికారులపై వైసీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. రేవళ్ల చెరువులో 10 ఎకరాల భూబి ఆక్రమణకు గురైన విషయం అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో పెందుర్తి ఆర్ఐ శివ కుమార్, గ్రామ సచివాలయ కార్యదర్శి వెంకటేష్ ఆక్రమణకు గురైన భూమిని పరిశీలించారు. వెంటనే జేసీబీలతో వెళ్లి ఆక్రమణలను తొలిగించే ప్రయత్నం చేశారు. దీనిపై ఆగ్రహించిన వైసీపీ నేతలు పెందుర్తి ఆర్ఐ శివ కుమార్, గ్రామ సచివాలయ కార్యదర్శి వెంకటేష్‌పై దాడికి…
✪ తిరుమల: నేడు ఫిబ్రవరి నెల శ్రీవారి ప్రత్యేక దర్శనం టోకెన్లు విడుదల… ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో రూ.300 ప్రత్యేక దర్శనం టోకెన్లు విడుదల… రోజుకు 12వేల టోకెన్లు విడుదల చేయనున్న టీటీడీ.. రేపు సర్వదర్శనం టోకెన్లు విడుదల చేయనున్న టీటీడీ✪ విశాఖ: నేడు ఎన్టీఆర్ భవన్లో అఖిలపక్ష కార్మిక సంఘాల సమావేశం… ఫిబ్రవరి 23, 24 తేదీల్లో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కార్మిక సంఘాల పిలుపు.. సమ్మెను విజయవంతం చేసే కార్యాచరణపై చర్చించనున్న కార్మిక…