Pawan Kalyan: నవరత్నాలపై పవన్‌కు నవ సందేహాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓవైపు అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబరాల్లో ముగినిపోయింది.. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతిని పురస్కరించుకుని వైసీపీ ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తోంది.. జగన్ సర్కార్‌లో ప్రజల కోసం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, వాటి ఫలాలు అందుతున్న తీరు.. వివిధ అంశాలపై నేతలు మాట్లాడుతున్నారు.. ఇదే సమయంలో.. వైఎస్ జగన్ సర్కార్ అమలు చేస్తోన్న నవరత్నాలపై నవ సందేహాలు వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. నవరత్నాల అమలపై నవ సందేహాలంటూ ట్వీట్ చేశారు పవన్ కల్యాణ్..
ఇక, పవన్ వ్యక్తం చేసిన నవ సందేహాల విషయానికి వస్తే..
* మొదటి రత్నం – రైతు భరోసా… 64 లక్షల మందికి మేలు అని చెప్పి.. 50 లక్షల మందికే భరోసా ఇవ్వడం నిజం కాదా?.. మూడేళ్లలో 3 వేలమంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకొంటే కేవలం 700మందికే ఆర్థిక సాయాన్ని పరిమితం చేయలేదా?
* రెండో రత్నం – అమ్మ ఒడి : అమ్మ ఒడి 43 లక్షల మందికి మాత్రమే ఇచ్చి.. 83 లక్షల మందికి ఇచ్చామని ఎందుకు అబద్దపు ప్రచారం చేస్తున్నారు?
* మూడో రత్నం – పెన్షన్లు: పెన్షనర్ల జాబితాను కుదించి 5 లక్షల మందిని తొలగించిన మాట వాస్తవం కాదా?
* నాలుగో రత్నం – సంపూర్ణ మద్యపాన నిషేధం : మద్యం ఆదాయం 2018-19లో రూ.14 వేల కోట్లు… 2021-22లో రూ.22 వేల కోట్లు – ఇదేనా మద్య నిషేధం? ఈ ఆదాయం చూపించే రూ.8 వేల కోట్లు బాండ్లు అమ్మలేదా?
* అయిదో రత్నం – జల యజ్ఞం : పోలవరం ప్రాజెక్టును ‘యుద్ద ప్రాతిపదిక’న ఎప్పుడు పూర్తి చేస్తారో చెబుతారా?
* ఆరో రత్నం – ఆరోగ్యశ్రీ: ఆరోగ్యశ్రీ పథకం నుంచి ఆసుపత్రులు ఎందుకు పక్కకు తప్పుకొంటున్నాయి? సీఎంఆర్ఎఫ్ నుంచి వైద్యం ఖర్చులు ఎందుకు చెల్లించడం లేదు?
* ఏడో రత్నం – ఫీజు రీ యింబర్స్ మెంట్: రీ యింబర్స్ మెంట్ చేయకపోవడం వల్లే విద్యార్థులకు హాల్ టికెట్స్ ఆపేస్తున్న మాట నిజం కాదా? పీజీ విద్యార్థులకు ఫీజు చెల్లింపులు ఎందుకు నిలిపివేశారు?
* ఎనిమిదో రత్నం – పేదలందరికీ ఇళ్ళు: చెరువుల్లో, గుట్టల్లో స్థలాలు ఇచ్చిన మాట నిజమే కదా? ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఎందుకు మంజూరు చేయలేదు?
* తొమ్మిదో రత్నం – ఆసరా: పొదుపు సంఘాల సంఖ్యను ఏటేటా లక్షల కొద్దీ ఎందుకు తగ్గిస్తున్నారు? అభయ హస్తం నిధులు రూ.2 వేల కోట్లు ఎటుపోయాయి? అంటూ నవ సందేహాలను వ్యక్తం చేశారు పవన్ కల్యాణ్.
Also Read
- AP High Court: స్థానిక ఎన్నికల పిటిషన్లపై విచారణ పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
- Nadendla Manohar: డీఎస్సీపై అవకతవకలు జరిగితే అసెంబ్లీ ధైర్యంగా మాట్లాడండి..
- YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలకు వైసీపీ కసరత్తు.. అభ్యర్థుల ఖరారుపై మాజీ సీఎం జగన్ కీలక సూచనలు..
- Kakumanu Rajasekhar Death: వైసీపీలో విషాదం.. కాకుమాను రాజశేఖర్ ఆకస్మిక మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
— Pawan Kalyan (@PawanKalyan) July 8, 2022
తాజావార్తలు
-
Mahadev Betting App Case: మహదేవ్ కేసులో బిగ్ అరెస్ట్.. ఎయిర్‌పోర్టులోనే పట్టివేత.!
-
Saudi Warning: మక్కాకు ప్రమాదం పొంచి ఉంది.. సౌదీ హెచ్చరిక జారీ
-
Rahul Gandhi: ‘జ్ఞానేశ్ కుమార్ దేశద్రోహి’.. CECపై రాహుల్ సంచలన ఆరోపణలు
-
Best Captain: కపిల్, ధోనీ, కోహ్లీ, రోహిత్.. నలుగురిలో బెస్ట్ కెప్టెన్ ఎవరో తేల్చేసిన యువరాజ్ సింగ్ తండ్రి..
-
Iran-UAE: ఇరాన్ విమానాలకు యూఏఈ షాక్.. అన్ని విమానాలు నిలిపివేత.. కారణమిదే!
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!