బిడ్డా ఈ రాష్ట్రం వైసీపీ, జగనన్న అడ్డా.. ఎవ్వరి ఆటలు సాగవు అని హెచ్చరించారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. గుంటూరులో జరుగుతోన్న వైసీపీ ప్లీనరీలో మాట్లాడిన ఆయన.. టీడీపీ, చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం నేతలు నొటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డ ఆయన.. రోషం గురించి చంద్రబాబు మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. బాబు ఆయన దత్తపుత్రుడి ఆటలు సాగవని హెచ్చరించిన ఆయన.. బిడ్డా ఈ రాష్ట్రం వైసీపీ అడ్డా.. తాము సంస్కారంతో ఓపిగ్గా వున్నాం.. కానీ, లోకేష్ కామెడీ చేస్తున్నారని మండిపడ్డారు.. జగనన్న ఒక్క సైగ చేస్తే.. వారిని రాష్ట్రం నుంచి తరిమేస్తాం, చేప తోలు వలచినట్టు వలిచేస్తామని వార్నింగ్ ఇచ్చారు.. 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లు సాధించింది వైసీపీ విక్టరీ కొట్టింది.. ఇక, 2024లో 175 స్థానాలు కొడతాం.. రానున్న ఎన్నికల్లో టీడీపీ పాడి కడతాం అంటూ వ్యాఖ్యానించారు..
Read Also: Chandrababu: మొన్న చెల్లి వెళ్లిపోయింది.. ఇప్పుడు తల్లి వెళ్లిపోయింది..!
ఇక, సీఎం కుర్చీని ఎవరూ టచ్ చేయలేరని వ్యాఖ్యానించారు అనిల్ కుమార్.. చంద్రబాబుకైనా, లోకేష్ కైనా, పవన్ కల్యాణ్‌కైనా.. ఒక్కటే చెబుతున్నాం.. మీ ఆటలు బాస్ (జగన్) వచ్చేంత వరకే.. బాస్ సీఎం అయ్యాక.. ఆ కుర్చీని తీసుకునే దమ్ము ఇక ఎవరికీ లేదన్నారు. బిడ్డా.. ఈ రాష్ట్రం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డా.. అది జగన్‌మోహన్‌రెడ్డి అడ్డా.. అని తెలిపారు.. ఆ కుర్చీని టచ్ చేయడం కాదు కదా… కంటి చూపుతో కూడా చూడలేరు.. ఏమీ పీకలేరు అని హెచ్చరించారు. మనకు ఉన్నది 18 నెలలే.. జనంలో తిరుగుదాం.. జగనన్న సంక్షేమ కార్యక్రమాలను వివరిద్దాం.. 175కు 175 స్థానాలను గెలుచుకుందాం.. మళ్లీ జగనన్నను సీఎంను చేద్దాం.. 25 ఏళ్ల వరకు ఆయనను ఆ కుర్చీలో కూర్చోబెడదాం అని వ్యాఖ్యానించారు అనిల్ కుమార్ యాదవ్..