Chandrababu: నాడు చెల్లి.. నేడు తల్లి వెళ్లిపోయింది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి వైఎస్ విజయమ్మ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.. అయితే, వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత జరిగిన పరిణామాలపై స్పందిస్తూ.. మొన్నటి వరకు జగన్ అందరినీ వాడుకున్నాడు అని ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. నగరిలో జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. వాడుకుని వదిలేయడం జగన్ అలవాటుగా మారిందని విమర్శించారు.. మొన్న చెల్లి (వైఎస్ షర్మిల) వెళ్లిపోయింది.. ఇప్పుడు తల్లి (వైఎస్ విజయమ్మ) కూడా వెళ్లిపోయిందని వ్యాఖ్యానించారు. ఇక, చీకటి పాలన వద్దు… చీకటి జీవోలు వద్దు అని నినదించిన ఆయన.. ధైర్యంగా ఎంతమంది అమ్మ ఒడి, అసరా పెన్షన్‌లు ఇచ్చారు.. ఇంకా ఎవరికి ఏమేమి ఇచ్చారో వెబ్‌సైట్‌లో పెట్టే దమ్ముందా? అని నిలదీశారు.
Read Also: Jharkhand: సీఎం హేమంత్ సోరెన్ సన్నిహితులపై ఈడీ రైడ్స్..
Also Read
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
- AP Govt: దేశంలో తొలిసారిగా 3డీ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాలు.. ఏక కాలంలో 3 లక్షల ఇళ్లు..
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
- Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
జనవరిలో జాబ్ క్యాలెండర్ ఏమైంది? అని సీఎం జగన్‌ను ప్రశ్నించారు చంద్రబాబు.. యువతరానికి పంగనామాలు పెట్టారంటూ మండిపడ్డ ఆయన.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీది చెత్త పరిపాలనగా అభివర్ణించారు. జగన్ మాటలు కోటలు దాటుతున్నాయి.. కానీ, చేతలు గడప కూడా దాటడం లేదన్న ఆయన.. నాకు కేసులు కొత్తకాదన్నారు.. ఇప్పుడు పెగాసిస్ కేసు పెడుతాడట.. అసలు పెగాసిస్ అంటే ఎంటో జగన్ కు తెలుసా…? అని ఎద్దేవా చేశారు. ఇన్ఫర్మేషను టెక్నాలజీ గురించి నాకు చెబుతావా…? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నగరిలో చంద్రబాబు కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ప్రజానికం.. దీనిపై సంతోషాన్ని వ్యక్తం చేసిన ఆయన.. అధికారంలోకి వచ్చాకా నగరి రూపురేఖలు మారుస్తా అన్నారు. నగరిలో యాబై వేలమంది చేనేత కార్మికులు ఉన్నారు, నేను అధికారంలో ఉన్నప్పుడు యాబైశాతం కరెంట్ లో సబ్సిడీ ఇచ్చాను అని గుర్తుచేశారు. ఇక, మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఐదువందల యూనిట్లు పవర్ ఫ్రీగా ఇస్తానని ప్రటించారు. కానీ, వైసీపీ మాత్రం భారీగా కరెంట్ చార్జీలు పెంచింది… దానివల్ల చేనేత కార్మికులపై పెనుభారం పడిందన్నారు.. నగరినీ కాలుష్యరహితంగా మారుస్తాను… నగరిలో టెక్స్‌టైల్స్ పార్క్ ఏర్పాటు చేస్తాను అని హామీ ఇచ్చారు. మరోవైపు, డైనేజి కట్టలేని వ్యక్తి మూడు రాజధానులు కడుతాడా…? అని ప్రశ్నించారు చంద్రబాబు.. కాలువ తవ్వలేని వ్యక్తి ప్రాజెక్టులు కడుతాడా…? అని సెటైర్లు వేశారు.. నా కష్టాన్ని బూడిదలో పోసినా పన్నీరు చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!