ప్రకాశం జిల్లా పర్యటనలో మంత్రి అప్పలరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీని, వైఎస్ఆర్ కుటుంబాన్ని వేర్వేరుగా చూడలేమని తెలిపారు. విజయమ్మ గౌరవ అధ్యక్షురాలి పదవికి ఎందుకు రాజీనామా చేస్తున్నారో వివరించారని.. అయినా ఈ విషయంపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. వైఎస్ఆర్‌సీపీ అనేది జగన్ కష్టంతో ఎదిగిన పార్టీ అని అభిప్రాయపడ్డారు. వైసీపీ ప్లీనరీకి వచ్చిన జనాన్ని చూసి ప్రతిపక్షాలకు దిమ్మతిరిగిందని.. దీంతో పిచ్చిపిచ్చికూతలు కూస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రాన్ని ఒక వర్గానికి ధారాదత్తం చేశారని ఆరోపించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు అసలు నాలెడ్జ్ లేదన్నారు. రైతుల సమస్యలపై ఆయనకేమీ తెలియదన్నారు. ప్రచారం కోసం డ్రామాలు వేయటం సర్వసాధారణమని.. వాటిని సినిమాలాగే ఎంటర్‌టైన్‌మెంట్ కోణంలో జనం చూడాలని మంత్రి అప్పలరాజు హితవు పలికారు.
Read Also: Amaranath Yatra: ఇద్దరు ఏపీ యాత్రికులు గల్లంతు.. ఏపీ సర్కార్ ప్రకటన
అటు వైసీపీ రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ.. విజయమ్మ పెద్దమనసు చేసుకుని గౌరవాధ్యక్షురాలి పదవికి రాజీనామా చేశారన్నారు. విజయమ్మ రాజీనామా విషయాన్ని రాజకీయం చేయడం తగదన్నారు. వైసీపీకి శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఉండటం కరెక్ట్ కాదని చంద్రబాబు అంటున్నారని.. కానీ ఆయన చేస్తుంది కూడా అదే కదా అని కౌంటర్ ఇచ్చారు. ప్రత్యేక హోదా విషయంలో తమ పార్టీ స్టాండ్ లైవ్‌లోనే ఉందన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతూనే ఉన్నామని.. రాష్ట్రపతి ఎన్నికలకు ప్రత్యేక హోదాకు ముడిపెట్టి మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు.