Somu Veerraju: పోలవరం అంశాన్ని వివాదం చేసే కుట్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పోలవరం అంశాన్ని వివాదం చేసే కుట్ర జరుగుతోందన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. పోలవరాన్ని ప్రశ్నిస్తే.. తెలంగాణ ఏర్పాటును ప్రశ్నించినట్లే. పోలవరం గురించి ప్రశ్నిస్తే.. రాష్ట్ర విభజన అంశాన్ని తిరగ తోడినట్లే. రాష్ట్ర విభజన బిల్లు ప్రకారం పోలవరం నిర్మాణం చేయాలి. రాష్ట్ర విభజనపై పూర్తిగా అధ్యయనం చేసిన ఏకైక పార్టీ బీజేపీ. పోలవరం ముంపు ప్రాంతాల్లో కొన్ని గ్రామాల ప్రజలు తెలంగాణలో కలుస్తామంటున్నారు.వారంతా భద్రాచలం మీద ఆధార పడటం వల్ల అటు చూస్తున్నారు. విలీనం చేసిన మండలాల్లో సీపీఎం ఆందోళన చేయడం ఏమిటి..? అన్నారు.
ఏం మాయ రోగం వచ్చింది.. టీఆర్ఎస్ పార్టీతో లాలూచి పడి రోడ్డెక్కారా..? వారికి అన్నీ తెలిసి కూడా ఇలా చేస్తారా..? చంద్రబాబు పోలవరం సోమవారం అని ఆర్భాటం చేశారు. పోలవరం విషయంలో జగన్ ప్రజలను మోసం చేస్తున్నారు. గతంలో చంద్రబాబు కూడా ఇలానే ప్రకటించి దెబ్బ తిన్నారు. చంద్రబాబు పెద్ద ఎత్తున అవినీతి చేశారని జగన్ ప్రచారం చేశారు. మూడేళ్లలో వాటిని బయట పెట్టి ఎందుకు చర్యలు తీసుకోలేదు..? లోయర్ కాపర్ డ్యాం పాడైన విషయం పై అధ్యయనం జరుగుతుందన్నారు సోము వీర్రాజు. రేషన్ బియ్యం ఇవ్వకుండా జగన్ మోసం చేస్తున్నారు.
Also Read
- Rain Alert: కొనసాగుతోన్న అల్పపీడనం.. రాబోయే 24 గంటల్లో ఆ 13 జిల్లాలో వర్షాలు!
- TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
- YS Jagan: డీఎస్సీ అక్రమాలపై సీఎం చంద్రబాబుకు జగన్ ప్రశ్నలు.. 1-6 ట్విస్ట్‌లతో ఎక్స్‌లో పోస్టులు!
- Ganesh Idol Protest: 'వినాయకుడి'తో వినూత్న నిరసన.. దేవుడికి ఈ తిప్పలు తప్పలేదా..?
పేదలకు కేంద్రం ఇచ్చిన బియ్యం జగన్ పంపిణీ చేయడం లేదు. లక్షా నలభై వేల కార్డులు జగన్ ఇష్టం వచ్చినట్లు ఇచ్చారు. కేంద్రం గైడ్ లైన్సును పరిగణలోకి తీసుకున్నారా..?వీరిలో యాభై లక్షల మందికి అసలు బియ్యం అవసరం లేదు. వీటిని రీసైక్లింగ్ చేసి అమ్ముకుంటున్నారు. కాకినాడ కేంద్రంగా బియ్యం అక్రమ రవాణా సాగుతుంది. ఇతర దేశానికి ఇక్కడి నుంచే భారీగా వెళ్తుందని చెప్పడం విశేషం.బియ్యం కుంభకోణంపై వాస్తవాలు ప్రజలకు వివరిస్తాం. పేదలు తినే బియ్యాన్ని పందికొక్కుల్లా తింటారా. వీటి వెనుక ఉన్న అందరి బాగోతాలు బయట పెడతాం అని ఆవేశంగా అన్నారు సోము వీర్రాజు.
కేంద్ర మంత్రి చెప్పినా జగన్ ప్రభుత్వం స్పందించదా..? కేశినేని ఏపీ ఏక్ నాథ్ షిండే కామెంట్లపై స్పందించారు సోము వీర్రాజు. కేశినేని కామెంట్లపై నర్మగర్భ వ్యాఖ్యలు చేశారాయన. పరోక్షంగా కేశినేని కామెంట్లను సమర్థించారు సోము వీర్రాజు. ఎప్పుడో జరిగే అంశాలపై ఇప్పుడే ఎలా మాట్లాడతామంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు సోము వీర్రాజు. కేశినేని నాని భవిష్యత్ గురించి మాట్లాడారు కదా..?అప్పుడే మాట్లాడతాం అన్నారు సోము.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!