ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు చాలా రాష్ట్రాలను వర్షాలు అతలాకుతలం చేశాయి.. జులైతో పాటు.. ఈ నెలలో వర్షాలు, వరదలు సృష్టించిన విలయం నుంచి ఇప్పటికీ కొన్ని ప్రాంతాలు బయటపడలేదు.. ఈ సమయంలో.. సముద్రంలో అల్పపీడనం, వాయుగుడం, తుఫాన్ లాంటి పదాలు వినపడితేనే ఉలిక్కిపడుతున్నారు ప్రజలు.. అయితే, ఇప్పుడు తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం క్రమంగా బలపడుతోంది.. రేపటికి వాయుగుండంగా మారి పశ్చిమ బెంగాల్ దగ్గర తీరం దాటే అవకాశం ఉందని వాతావారణ శాఖ అంచనా…
* నేడు తిరుపతిలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పర్యటన.. స్వచ్ఛంద సంస్థ కార్యాలయంలో దివంగత రాస్ మునిరత్సం విగ్రహావిష్కరణ, మహాత్మగాంధీ ఆత్మకథ సత్యశోధన పుస్తకావిష్కరణలో పాల్గొననున్న సీజేఐ * ప్రకాశం : మార్కాపురం మండలం రాయవరంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి. * ప్రకాశం : కనిగిరి మున్సిపాలిటీ 9వ వార్డు సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే…
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో లీక్ ఎపిసోడ్లో కొత్త ట్విస్ట్ వచ్చి చేరింది… అమెరికాలోని ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ అంటూ టీడీపీ ప్రచారం చేస్తున్న లేఖ ఒరిజనల్ కాదని ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ స్పష్టం చేయడంతో మరోసారి దీనిపై చర్చ తెరపైకి వచ్చింది.. దీనిపై ఏపీ సీఐడీ పెట్టిన మెయిల్ కు సంబంధిత ల్యాబ్ నుంచి వివరణ వచ్చిందని చెబుతున్నారు.. ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ… ఎంపీ…
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై మండిపడ్డారు ఆంధ్రప్రదేశ్ మంత్రి చెల్లుబోయిన వేణు.. తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాడు అమరావతి గ్రాఫిక్స్ సృష్టించారు.. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై గ్రాఫిక్స్ చేయిస్తున్నారు అంటూ ఫైర్ అయ్యారు.. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఎపిసోడ్‌పై ఆయన స్పందిస్తూ… నాలుగు రోజుల్లో నిజాలు బయటకు వస్తాయి.. గ్రాఫిక్స్ చేసింది ఎవరో బయటపడుతుందన్నారు.. ఇక, ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా టీచర్ల అటెండెన్స్ కోసం ఫేస్ రికగ్నిషన్ యాప్ ఇప్పుడు గందరగోళం సృష్టిస్తోంది.. హాట్ టాపిక్‌గా మారిన ఈ యాప్ గురించి విస్తృతంగా చర్చ జరుగుతోంది. టీచర్లు స్కూళ్లకు రాగానే ముందుగా చేయాల్సిన పని ఫొటో దిగడం.. పాఠశాలల్లో కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది ప్రభుత్వం.. అయితే, ఆ యాప్‌లో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి.. ఇది తీవ్ర వివాదానికి దారితీసింది.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం టీచర్లకు కోపం తెప్పిస్తోంది. ఇప్పటివరకు వినియోగంలో ఉన్న బయోమెట్రిక్,…
Congress Bharat Jodo Yatra: 2024 సార్వత్రిక ఎన్నికల్లో పుంజుకుని దేశంలో మళ్లీ పూర్వ వైభవం సాధించాలని కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పాదయాత్ర చేయాలని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నారు. భారత్ జోడో యాత్ర పేరుతో దేశమంతా చుట్టాలని ఆయన సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు గురువారం జరగనున్న సీడబ్ల్యూసీ మీటింగ్‌లో రాహుల్ గాంధీ పర్యటన షెడ్యూల్ ఖరారు కానుంది. దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే అందులో సగం…
Nara Lokesh: విజయవాడలో చిరు వ్యాపారులతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. జగన్ సీఎం అయిన దగ్గర నుంచి చిరు వ్యాపారులను కూడా వదలకుండా దోచుకుంటున్నారని ఆరోపించారు. కరోనాను ఎదుర్కొన్నాం కానీ.. జగన్ వైరస్‌ను ఎదుర్కోలేకపోతున్నామని లోకేష్ చురకలు అంటించారు. ఏపీలో జగన్, అతని చుట్టుపక్కల ఉన్న నలుగురిదే రాజ్యం…
YSR Netanna Nestam: ఏపీలో మరో పథకం కింద నగదు పంపిణీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెల 23వ తేదీన కృష్ణా జిల్లా పెడనలో సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం కింద సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. ఈ పథకం కోసం ఇప్పటికే నేతన్నల నుంచి దరఖాస్తులు స్వీకరించి.. లబ్ధిదారుల జాబితాలను సచివాలయాలకు పంపించారు. కాగా సొంత మగ్గం…
Hindupuram: హిందూపురం నియోజకవర్గ ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ నడుం బిగించారు. ఈ మేరకు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం చలివెందులలో ఆయన ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రథాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ.. నేను హిందూపురం వాడినే అని… మనలో మనకి అమరికలు ఉండకూడదని వ్యాఖ్యానించారు. చలివెందులలో ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం శుభపరిణామం అని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా సేవలు అందించే బృహత్తర కార్యక్రమాన్ని…