Andhra Pradesh RGF: కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్(కేజీఎఫ్) గురించి అందరికీ తెలుసు. కేజీఎఫ్ సినిమాతో ఈ విషయం విశ్వమంతా తెలిసింది. అయితే ఏపీలో RGF ఉన్న సంగతి చాలా మందికి తెలియదు. ఆర్జీఎఫ్ అంటే రామగిరి గోల్డ్ ఫీల్డ్స్ . నష్టాల కారణంగా రెండు దశాబ్దాల క్రితం ఆర్జీఎఫ్కు తాళం పడగా.. ఇప్పుడు మళ్లీ తెరుచుకునేందుకు సిద్ధమవుతున్నాయి. రామగిరి బంగారు గనుల కోసం టెండర్లు మెుదలయ్యాయి. ఆగస్టు నెలాఖరులో టెండర్లు ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనంతపురం…
ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీలో చిరుత సంచారం కలకలం రేగింది. వర్శిటీ పరిపాలనా భవనం వద్ద కుక్కలపై చిరుత దాడికి యత్నించింది. ఈ దృశ్యాలు వర్శిటీ సీసీ కెమెరాల్లో దృశ్యాలు రికార్డు అయ్యాయి. దీంతో యూనివర్సిటీ విద్యార్థులు, భద్రతా సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. వర్సిటీకి చేరుకున్న అటవీ సిబ్బంది చిరుత సంచరించిన పరిసరాలను పరిశీలిస్తున్నారు. ఐతే ఆరు నెలలుగా ఎస్వీ యూనివర్సిటీ, వెటర్నరీ యూనివర్సిటీ, వేదిక్ యూనివర్సిటీ పరిసరాల్లో చిరుతలు తిరుగుతున్నాయని, రెండుసార్లు…
ఓవైపు బహిరంగ మార్కెట్లో ఉల్లి ధర రూ.20 నుంచి రూ.30 వరకు పలుకుతుంటే.. మరోవైపు.. గిట్టు బాటు ధర లేక.. రైతులు పంటను ధ్వంసం చేసే పరిస్థితి నెలకొంది.. కర్నూలు జిల్లాలో ఉల్లి దిగుబడులు మొదలయ్యాయి. ఉల్లి కర్నూలు మార్కెట్ యార్డుకు తరలి వస్తోంది. దిగుబడి కూడా సంతృప్తికరంగానే ఉంది. అయితే ఉల్లి ధర పడిపోయింది. రైతుల నుంచి క్వింటాలు ఉల్లి 400 నుంచి 800 పలుకుతోంది. వినియోగదారులకు వ్యాపారులు రెట్టింపు ధరకు విక్రయిస్తున్నారు. ఉల్లి గిట్టుబాటు…
బాడీ లాస్ కోసం ప్రయత్నిస్తే మైండ్ లాస్ అయినట్టుంది అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై సెటైర్లు వేశారు ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. లోకేష్ చాలా అమాయకంగా మాట్లాడుతున్నాడు.. వెయ్యి కోట్ల పెట్టుబడితో ఉన్న పరిశ్రమలు ప్రారంభించటానికి తన తండ్రికి టైం ఉండేది కాదని లోకేష్ అంటున్నాడు.. బాడీ లాస్ కోసం ప్రయత్నించి లోకేష్ కు మైండ్ లాస్ అయ్యినట్టు ఉంది అని ఎద్దేవా చేశారు.. అన్ని…
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ). అక్టోబరు నెలకు సంబంధించి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను రేపు (ఈ నెల 18వ తేదీన) విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. రేపు ఉదయం 9 గంటల నుంచి టీటీడీ వెబ్సైట్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. అయితే, భక్తులకు కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుని టికెట్లు బుక్ చేసుకుంటే మంచిది.. ఎందుకంటే.. అక్టోబర్‌లో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఉన్నాయి. ఆ ఉత్సవాల…
ఆంధ్రప్రదేశ్‌లో పిడుగుపాటుకు నలుగురు మృతిచెందారు.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా మారింది.. మృతులంతా కూలీలుగా చెబుతున్నారు.. ఏలూరు జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం బోగోలలో పిడుగు పడి నలుగురు కూలీలు మృతిచెందారు.. జామాయిల్ తోటలో కూలి పనికి వచ్చిన వారిపై తెల్లవారుజామున పిడుగు పడింది.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా మారడంతో.. విజయవాడకు తరలించారు.. జమాల్ తోట నరికేందుకు ఉదయమే పొలానికి వచ్చారు దాదాపు 30…
జనసేన అధినేత పవన్‌కల్యాణ్ మరోసారి ఆంధ్రప్రదేశ్‌లో పర్యటనకు సిద్ధం అవుతున్నారు.. కౌలు రైతు భరోసా యాత్ర పేరుతో ఇప్పటికే పలు జిల్లాల్లో పర్యటించిన జనసేనాని.. బలవన్మరణాలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలను పరామర్శిస్తూ.. ఆర్థిక సాయం చేస్తూ వస్తున్నారు.. ఇక, ఈ సారి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇలాకాలో పర్యటించనున్నారు పవన్ కల్యాణ్.. జనసేనాని కడప జిల్లా పర్యటన ఖరారైంది. ఈనెల 20న ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు లక్ష రూపాయల…
* ఢిల్లీ: నేడు ఉదయం 11 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం * హైదరాబాద్: నేడు లా సెట్, పీజీ లా సెట్ ఫలితాలను విడుదల చేయనున్న తెలంగాణ ఉన్నత విద్యా మండలి * హన్మకొండ: నేడు పరకాల బంద్‌కు బీజేపీ పిలుపు, బీజేపీ నేత గురుప్రసాద్‌పై దాడికి నిరసనగా బంద్‌కు పిలుపునిచ్చిన పార్టీ * నేడు మేడ్చల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన, మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టరేట్‌ను ప్రారంభించనున్న తెలంగాణ సీఎం * భద్రాచలం…
Gorantla Madhav Video: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌కు సంబంధించిన వీడియో వివాదంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ సీబీఐకి ఫిర్యాదు చేశారు. చెన్నై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) సైబర్ క్రైమ్ కార్యాలయానికి ఫిర్యాదుతో కూడిన ఈ-మెయిల్‌ను పంపారు. ఈ ఫిర్యాదుతో పాటు వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు సంబంధించిన వీడియో క్లిప్‌లను న్యాయవాది లక్ష్మీనారాయణ జత చేశారు. ఇటీవల వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలు రెండు ప్రధాన పార్టీల…