వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న.. విశాఖలో వైసీపీ నేతలు గంటకో ఘోరం, అరగంటకో భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించిన ఆయన.. 420 పార్టీలో విజయసాయిరెడ్డి, కొడాలి నాని లాంటి వాళ్లు 840లు అంటూ ఎద్దేవా చేశారు.. విశాఖలో వృద్ధాశ్రమ భూముల్నీ వైసీపీ నేతలు వదలట్లేదని విమర్శించారు.. విశాఖలో వైసీపీ సాగించిన భూ కబ్జా బాధితుల కోసం ఓ కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు…
విజయవాడలో నూతన న్యాయస్థాన భవనాలను సుప్రీంకోర్టు సీజేఐ ఎన్వీ రమణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు సీజే ప్రశాంత్ కుమార్ మిశ్రాతో పాటు సీఎం జగన్ పాల్గొన్నారు. విజయవాడ న్యాయస్థానాల ప్రాంగణంలో G+7 భవనాలు నిర్మించారు. వీటిలో 29 ఏసీ కోర్టు హాళ్లు, న్యాయవాదులు, కక్షిదారులకు వెయిటింగ్ హాళ్లు, క్యాంటీన్, ఏడు లిఫ్టులు సహా అన్ని సదుపాయాలు ఉన్నాయి. అత్యాధునిక సదుపాయాలతో ఈ నూతన భవనాలను నిర్మించారు. ఈ కార్యక్రమానికి ముందు విజయవాడ చేరుకున్న సీజేఐ ఎన్వీ…
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన అల్లుడు మంజునాథ రెడ్డి అనుమానాస్పదస్థితిలో మృతిచెందారు.. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లెలోని ఓ అపార్ట్మెంట్లో ఆయన ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.. ఆయన వయస్సు 36 సంవత్సరాలు.. అయితే, దీనిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన ప్రాణాలు విడిచినట్టు వైద్యులు ప్రకటించారు. Read Also: Monkeypox Test…
* నేడు మునుగోడులో టీఆర్ఎస్ ప్రజా దీవెన సభ, పాల్గొననున్న సీఎం కేసీఆర్, మధ్యాహ్నం భారీ కార్ల ర్యాలీతో హైదరాబాద్ నుంచి మునుగోడుకు కేసీఆర్ * హరారే: నేడు భారత్ – జింబాబ్వే రెండో వన్డే, ఇప్పటికే 3 వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో టీమిండియా * హైదరాబాద్: మునావర్ ఫారూఖీ కామెడీ షోకు పోలీసుల అనుమతి, నేడు హైటెక్స్‌లో మునావర్ కామెడీ షో, * ఇవాళ మునుగోడు నియోజక వర్గం నారాయణపురం పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి…
Bharatiya Janata Party: ఏపీలో రహదారులపై గతంలో సోషల్ మీడియా వేదికగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో పాటు జనసేన పార్టీ సెటైర్లు వేసింది. జనసేన పార్టీ ఫోటోలు తీసి పోస్ట్ చేసి తీవ్రస్థాయిలో విమర్శలు కూడా చేసింది. ఇప్పుడు బీజేపీ కూడా జనసేన బాటలోనే కొనసాగుతోంది. ఇటీవలే ప్రారంభమైన జనసేన ప్రచారం ఇంకా కొనసాగుతుండగా… ఏపీలో ఆ పార్టీతో పొత్తులో కొనసాగుతున్న బీజేపీ కూడా తాజాగా రోడ్ల దుస్థితిపై ప్రచారం మొదలుపెట్టింది. జనసేన మాదిరే కార్టూన్లతో బీజేపీ…
Gorantla Madhav: తన వీడియో ఫేక్ వీడియో అని ముందే చెప్పానని.. ఇప్పుడు అదే నిజమని తేలిందని వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యాఖ్యానించారు. ఫేక్ ఫోరెన్సిక్ రిపోర్టుతో మరోసారి టీడీపీ దొరికిపోయిందని.. అమెరికా నుంచి ఓ ఫేక్ రిపోర్ట్ తెప్పించారని.. ఈ రిపోర్టుతో చంద్రబాబు నానా యాగీ చేశారని ఆరోపించారు. సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్ అక్కడి నుంచి తెప్పించిన వివరాలతో టీడీపీ పరిస్థితి కుడితిలో పడిన బల్లి లాగా తయారైందన్నారు. ఓటుకు నోటు కేసులో…
Andhra Pradesh Volunteers: ఏపీలో ప్రతినెల ఒకటో తేదీ వచ్చిందంటే చాలు వాలంటీర్లే ఇంటింటికీ వెళ్లి ఫించన్ ఇస్తున్నారు. అయితే కొందరు వాలంటీర్స్ అమాయకపు వ్యక్తులను మోసం చేస్తూ బాగా డబ్బులు దండుకుంటున్నారు. తాజాగా కర్నూలు జిల్లా కోసిగి మండలం కామన్ దొడ్డిలో వాలంటీర్లు చేతి వాటం ప్రదర్శించారు. నూతనంగా మంజూరైన ఫించన్ ఇచ్చినట్టే ఇచ్చి ఫోటోలు దిగి వాలంటీర్లు వెనక్కి తీసుకున్నారని బాధితులు లబోదిబోమంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఫించన్ రావడంతో…
సామాన్యుడి మహాత్ముడుగా మారిన గొప్ప వ్యక్తి గాంధీ.. ఆయన ఆత్మకథల్లో అతిశయోక్తులు సాధారణంగా ఉంటాయి.. గాంధీ ఆత్మకథలో అన్ని వాస్తవాలే అన్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. మహాత్మా గాంధీ జీవిత చరిత్ర సత్యశోదన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన.. పుస్తకావిష్కరణ అనంతరం మాట్లాడుతూ.. గాంధీజీ రెండుసార్లు తిరుపతికి వచ్చినట్టు చరిత్ర చెబుతోంది.. 1921లో తొలిసారి, 1933లో రెండోసారి వచ్చారని తెలిపారు.. Read Also: Mumbai: కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం.. ఇక,…
కాకినాడ జిల్లాలో పేలుడు సంభవించింది.. కాకినాడ రూరల్ వాకలపూడిలోని ప్యారి షుగర్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది.. లారీలకు లోడు చేసే కన్వియర్ బెల్ట్ పేలినట్లు సమాచారం… ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు.. మరో నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో.. ఆస్పత్రికి తరలించారు.. అయితే, మృతిచెందిన కార్మికుల కుటంబాలను ఆదుకోవాలని ఆందోళనకు దిగారు కార్మికులు.. ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని.. ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.. ఇక, ప్రమాద సమాచారం తెలుసుకున్న…