సీపీఎస్ రద్దు చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన మాట వాస్తవమే అని మరోసారి స్పష్టం చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ.. శాసనమండలిలో సీపీఎస్ రద్దు పై వాయిదా తీర్మానం ఇచ్చారు పీడీఎఫ్ సభ్యులు.. ఆ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు మండలి చైర్మన్ రాజు.. అయితే, ఉపాధ్యాయులపై నమోదు చేసిన కేసులుపై పీడీఎఫ్ సభ్యులు పట్టుబట్టారు.. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడిస్తామని చెప్పటం ధర్మమేనా…? అని ప్రశ్నించారు.. సీపీఎస్ ను రద్దు చేస్తామని ఎన్నికల్లో మేము హామీ ఇచ్చిన మాట వాస్తవం.. ఇప్పటికే ఇచ్చిన హామీలను 95 శాతం అమలు చేశామన్నారు.. గత ప్రభుత్వం హామీలు ఇచ్చి తుంగలో తొక్కిందని విమర్శించారు. ఇక, ఉపాధ్యాయులపై కేసు వ్యవహారం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తాం.. పీడీఎఫ్ సభ్యుల ఆలోచనలకు అనుగుణంగా సానుకూలంగా స్పందన నిర్ణయం ఉంటుందన్నారు.
Read Also: CM KCR: మరోసారి బెజవాడకు కేసీఆర్.. ఈ సారి విషయం ఇదే..!
మాకు ఎవరి మీద కోపం ఉండదు.. మా ప్రభుత్వం ఫ్రెండ్లీ గవర్నమెంట్ అన్నారు మంత్రి బొత్స.. ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్న ఆయన.. అందరి మనోభావాలకు అనుగుణంగా పరిపాలన జరుగుతుందన్నారు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్యోగుల పక్షపాతి అని స్పష్టం చేశారు మంత్రి బొత్స.. మరోవైపు.. టీచర్లపై కేసుల విషయంలో హాట్ కామెంట్లు చేశారు శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు.. పీడీఎఫ్ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన ఆయన.. సభలో సంబంధిత శాఖకు సంబంధించి మంత్రులు లేరన్నారు.. ప్రభుత్వం చర్చకు రెడీగా ఉందన్న ఆయన.. టీచర్లపై క్రిమినల్ కేసులు పెట్టకూడదా…? అని ప్రశ్నించారు.. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరిపైనానై కేసులు పెట్టొచ్చన్నారు మోషన్ రాజు.