* ఇండోర్‌లో నేడు భారత్-సౌతాఫ్రికా చివరి టీ-20, రాత్రి 7 గంటలకు భారత్-సౌతాఫ్రికా మ్యాచ్, మూడో టీ20లో కోహ్లీ, కేఎల్ రాహుల్ విశ్రాంతి * తిరుమలలో 8వ రోజు వైభవంగా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. నేడు ఉదయం 7 గంటలకు రథోత్సవం, రాత్రి 7 గంటలకు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్న శ్రీవారు * నేటి నుంచి విశాఖ-పుణె మధ్య నాన్‌స్టాప్ విమాన సర్వీసులు, వారంలో మూడు రోజులు నడిపే విధంగా ఇండిగో షెడ్యూల్ ప్రకటన * హైదరాబాద్:…
Dharmana Prasad Rao: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఆంధ్రప్రదేశ్ పరిపాలన వికేంద్రీకరణపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి మంత్రులు ధర్మాన ప్రసాదరావు, చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యేలు, మేధావులు, సామాజిక వేత్తలు హాజరయ్యారు. రాజమండ్రి వైసీపీ ఎంపీ మార్గాని భరత్ అధ్యక్షతన ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతోంది. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేశారు. హైదరాబాద్ లాంటి రాజధాని నుంచి విడిపోయిన మనం దురదృష్టవంతులు అయ్యామని…
Kidnap Mistery: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో 8 ఏళ్ల బాలుడి కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. రాజీవ్ సాయి (8) అనే బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. రాజీవ్ తండ్రి చెన్నైలో ధాన్యం వ్యాపారం చేస్తున్నాడు. దసరా పండుగ కోసం వీరి కుటుంబం చెన్నై నుంచి చిలకలూరిపేటకు వచ్చింది. పట్టణంలోని 13వ వార్డులో ఉన్న దేవాలయంలో రాజీవ్ తల్లిదండ్రులు పూజలు చేస్తున్న సమయంలో బాలుడిని దుండగులు కిడ్నాప్ చేశారు. రాజీవ్ తల్లిందండ్రుల ఫిర్యాదు మేరకు…
God Father: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పెద్ద సినిమాలు విడుదల కాగానే ఎక్కువ రేట్లకు టిక్కెట్లు అమ్ముకోవడం.. చిన్న సినిమాలు రాగానే ఆ ధరలను తగ్గించడం జరుగుతోంది. ఇటీవల కాలంలో పెట్టుబడులు రావాలంటే టిక్కెట్ల ధరలను పెంచడమే ప్రత్యామ్నాయంగా ఇండస్ట్రీ పెద్దలు ఆలోచిస్తున్నారు. అయితే విచిత్రంగా దసరా కానుకగా విడుదలయ్యే పెద్ద సినిమాల టిక్కెట్ ధరలను మాత్రం సాధారణ రేట్లకే విక్రయిస్తున్నారు. గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ వంటి సినిమాల బుకింగ్స్ ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి.…
Andhra Pradesh: గాంధీ జయంతి సందర్భంగా ఆదివారం నాడు కేంద్ర ప్రభుత్వం జలజీవన్ మిషన్ అమలుకు సంబంధించి ర్యాంకులను ప్రకటించింది. విజ్ఞాన్ భవన్లో నిర్వహించిన స్వచ్ఛభారత్ దివస్ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఆధ్వర్యంలో 2022లో జలజీవన్ మిషన్ అమలు నివేదికను విడుదల చేశారు. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌కు 13వ ర్యాంకు దక్కింది. ఈ పథకం అమలు పనితీరులో 2020-21లో 50 శాతం…
Araku Coffee: చాలా మంది ఉదయాన్నే లేవగానే కప్పు కాఫీ తాగనిదే ఏ పని కూడా చేయరు. ఓ మంచి కాఫీ తియ్యటి అనుభూతిని అందిస్తుంది. మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. కమ్మగా ఉండే కాఫీ పంట ఎక్కడో కాదు మన ఆంధ్రప్రదేశ్‌లోనే పండుతోంది. విశాఖ జిల్లాలోని అరకులో పండే కాఫీ ఆకులకు దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగానూ మంచి డిమాండ్ ఉంటోంది. మన కాఫీ బ్రాండ్‌ను అరకు కాఫీ విదేశీ మార్కెట్లో మరింత సుస్థిరం చేస్తోంది. అంతర్జాతీయంగా…
What’s Today: • తిరుమల: నేడు 7వ రోజు శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఈరోజు ఉ.8 గంటలకు సూర్యప్రభ వాహనంపై విహరించనున్న శ్రీవారు.. రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్న స్వామివారు • విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు.. నేడు దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు • నేడు శ్రీశైలంలో 8వ రోజు దసరా మహోత్సవాలు.. సాయంత్రం మహాగౌరి అలంకారంలో భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనం.. నందివాహనంపై పూజలందుకోనున్న ఆదిదంపతులు.. రాత్రి క్షేత్ర…
CM Jagan: ఏపీ సీఎం జగన్ నెలరోజుల కిందట కోనసీమలో వరద బాధితులను పరామర్శించేందుకు పర్యటించారు. ఈ సందర్భంగా అరుదైన వ్యాధితో బాధపడుతున్న హనీ అనే చిన్నారి పరిస్థితిని ఆమె తల్లితండ్రులు ప్లకార్డు ద్వారా ప్రదర్శించి సీఎం జగన్ దృష్టిలో పడ్డారు. ఎంతో అరుదైన ‘గాకర్స్’ వ్యాధితో బాధపడుతున్న ఆ చిన్నారి పరిస్థితిని తెలుసుకున్న సీఎం జగన్ చలించిపోయారు. చిన్నారి వైద్యచికిత్సకు అయ్యే ఖర్చు భరిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ… తాజాగా ఆ బాలిక…
CM Jagan: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం మూలా నక్షత్రం కావడంతో దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు భారీ స్థాయిలో బారులు తీరారు. మూలా నక్షత్రం ప్రత్యేక రోజు కావడంతో ఏపీ సీఎం జగన్ సంప్రదాయ దుస్తుల్లో ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధికి వచ్చారు. సీఎం రాక నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై భారీ భద్రత ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పించారు. వేదమంత్రోచ్ఛారణల నడుమ పట్టువస్త్రాలతో పాటు పసుపు,…