Roja Selvamani: ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. తాజాగా మంగళవారం తూర్పు గోదావరి జిల్లా తణుకులో జరిగిన జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన కార్యక్రమానికి మంత్రి రోజా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఎడ్ల బలప్రదర్శనలో ఆమె పాల్గొన్నారు. ఎడ్లబండిని తోలుతూ ఉత్సాహంగా కనిపించారు. ఆమె ఎడ్లబండిని తోలిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.…
KVP: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో చేపట్టిన భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్న భారత్ జోడో యాత్ర ఈనెల 18న ఏపీలోకి ప్రవేశించనుంది. కర్ణాటక సరిహద్దు మోక వద్ద ఏపీలో ప్రారంభం కానుంది. ఏపీలో నాలుగు రోజుల పాటు 90 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ఈరోజు భారత్ జోడో యాత్ర నిర్వహణపై కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ సీనియర్…
Satyakumar: తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు దసరా పండగ సందర్భంగా జాతీయ పార్టీపై ప్రకటన చేస్తానని కేసీఆర్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఏపీలో టీడీపీ, బీజేపీ నేతలు తమకు టచ్‌లోనే ఉన్నారని టీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఇప్పటికే కొందరు నేతలతో కేసీఆర్ నేరుగా మాట్లాడారని లీకులు ఇస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై ఏపీ బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ స్పందించారు. ఏపీలో ఒక్క బీజేపీ కార్యకర్తను అయినా కేసీఆర్…
Suryalanka: బాపట్ల జిల్లా సూర్యలంక సముద్ర తీర ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. సముద్ర స్నానానికి వచ్చి ముగ్గురు యువకులు మృతి చెందారు. మరో ముగ్గురు గల్లంతు అయ్యినట్లు తెలుస్తోంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గల్లంతైన వారి కోసం జాలర్లతో కలిసి పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. బాధితులు విజయవాడ సింగ్ నగర్‌కు చెందిన విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. Read Also: Y. S. Sharmila: మరోసారి ఫైర్.. పండిత పుత్ర…
అమరావతి రాజధాని విషయంలో రగడ కొనసాగుతూనే ఉంది.. పాలక, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది.. అయితే, అమరావతి రాజధాని అంశంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు అధర్మంగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ… వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేతగా అమరావతిని రాజధానిగా ఆమోదించిన విషయం వాస్తవమా కాదా..? అని నిలదీసిన ఆయన… ఆనాడే మూడు రాజధానులు కావాలని వైఎస్ జగన్ ఎందుకు చెప్పలేదు..? అని ప్రశ్నించారు… శాసనం, చట్టం, ధర్మాలను విస్మరించి…
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.. ఇప్పుడు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతోంది.. ఆంధ్రప్రదేశ్ తీరాన్ని ఆనుకుని తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అంచనా వేసిన ఐఎండీ… ఆంధ్రప్రదేశ్‌కు ఎల్లో అలర్ట్ జారీ చేసింది… ఈ అల్పపీడన ప్రభావంతో.. ఉత్తరాంధ్రలో పలు చోట్ల భారీ వర్షాలలు కురుస్తాయని ఐఎండీ వర్గాలు చెబుతున్నాయి… ఇప్పటికే విశాఖపట్నంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి… వర్షానికి తోడు తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి… ఇక, ఐఎండీ ఎల్లో వార్నింగ్…
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు అపూర్వ స్పందన వస్తుంది.. కాంగ్రెస్‌కు భారత్ జోడో యాత్ర సంజీవని అంటున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్.. తమిళనాడు, కేరళను దాటి ప్రస్తుతం కర్ణాటకలో పాదయాత్ర సాగుతుండగా.. రెండు రోజులు బ్రేక్ ఇచ్చారు.. అయితే, కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది భారత్ జోడో యాత్ర.. దీంతో, కాంగ్రెస్ నేతలు పాదయాత్ర ఏర్పాట్లలో మునిగిపోయారు.. అందులో భాగంగా కర్నూలులో పర్యటించారు జైరాం రమేష్..…
ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల పరిస్థితిపై పలు సందర్భాల్లో విమర్శలు వస్తూనే ఉన్నాయి.. తాజాగా, భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఏపీలోని రోడ్ల దుస్థితిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం ప్రభగిరిపట్నం సమీపంలోని కిసాన్ క్రాఫ్ట్ ను సందర్శించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నా సొంత జిల్లా నెల్లూరులో కిసాన్ క్రాఫ్ట్ సంస్థను నెలకొల్పడంఎంతో సంతోషంగా ఉందన్నారు.. స్ధానికంగా ఉన్న గ్రామాల ప్రజలకు ఉపాధి కల్పించడం ఎంతో అభినందనీయం అన్నారు.. నెల్లూరు జిల్లా నుండి…
రాజధానుల వ్యవహారం ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాకరేపుతూనే ఉంది… అభివృద్ధి వికేంద్రీకరణ తమ ప్రభుత్వం లక్ష్యం.. మూడు రాజధానులు ఏర్పాటు చేసితీరుతామని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతుంటే.. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.. రాజు మారినప్పుడల్లా.. రాజధాని మారుతుందా? అని మండిపడుతున్నాయి.. అయితే, మూడు రాజధానులు అభివృద్ధి చేయాలన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నిర్ణయానికి ప్రజల మద్దతు ఉందన్నారు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ.. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. శాసన…