2024 నాటికి అమెరికా కంటే మంచి రోడ్లు
దేశంలోని రహదారులను దశలవారీగా మరింత మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. 2024 చివరి నాటికి అమెరికాలోని రోడ్ల కంటే భారత్‌లో మెరుగైన రోడ్లను సిద్ధం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. గోవా సువారి నది వంతెన మొదటి దశ ప్రారంభోత్సవంలో ఈ ప్రకటన చేశారు. ముంబై-నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ వే భారతదేశంలో ఇటీవల ప్రారంభించబడిన ఉత్తమ రహదారులలో ఒకటని మంత్రి అన్నారు. ఈ రహదారికి 120 మీటర్ల వెడల్పు, 22.5 మీటర్ల వెడల్పుతో డివైడర్, గార్డెన్స్, 50కి పైగా ఫ్లై ఓవర్లు, 700 అండర్‌పాస్‌లు ఏర్పాటు చేశారు. ఇన్ని వ్యవస్థలు కల్పించినప్పటికీ, అనేక విదేశాల రోడ్లతో పోల్చినప్పుడు, భారత దేశ రహదారులు ఇప్పటికీ చాలా వెనుకబడి ఉన్నాయి.
డ్రగ్స్ స్మగ్లర్ ఎడ్విన్ కేసులో ఇద్దరు అరెస్ట్
హైదరాబాద్ లో డ్రగ్స్ కేసులు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇంటర్నేషనల్ డ్రగ్స్ స్మగ్లర్ ఎడ్విన్ కేస్ లో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ కి చెందిన వ్యాపారవేత్త కృష్ణ కిషోర్ రెడ్డి తో పాటు ప్రముఖ డీజే మైరాన్ మోహిత్ ని అరెస్ట్ చేశారు. ప్రముఖ హీరోయిన్ భర్తనే మైరాన్ మోహిత్. టాలీవుడ్ బాలీవుడ్ హీరోయిన్ గా కొనసాగుతున్న నేహా దేశ్ పాండే భర్త మైరాన్. 12 ఏళ్ల నుంచి డ్రగ్స్ సప్లై చేస్తున్నాడు మైరాన్. ఇంటర్నేషనల్ డీజే ఆర్గనైజర్ గా ఉన్నాడు మైరాన్. దేశవ్యాప్తంగా డీజేలు నిర్వహించడంలో మైరాన్ దిట్టగా పేరుంది. వంద మందికి పైగా డీజేలను తన గుప్పిట్లో పెట్టుకున్నాడు మైరాన్. గోవాతో పాటు దేశవ్యాప్తంగా డీజేలను ఆర్గనైజ్ చేస్తున్నాడు. డీజేలో మాటున డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు మైరాన్. గోవా డ్రగ్స్ కేసులో కీలక నిందితుడు ఎడ్విన్ తో మైరాన్ కు పరిచయాలు ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. ముంబై, గోవా, బెంగళూరు హైదరాబాదులోని పబ్ లకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు మైరాన్..50 మందికి పైగా డ్రగ్ పెడ్లర్స్ తో అతనికి కీలక సంబంధాలున్నాయి. డబ్బుతో పాటు సన్ బర్న్ లో జరిగే పార్టీలకు డ్రగ్ సరఫరా చేస్తుంటాడు మైరాన్. టాలీవుడ్ బాలీవుడ్ తో పాటు వ్యాపారవేత్తలతో అతనికి లింకులు వున్నాయి.
కొడాలి నాని షాకింగ్ కామెంట్స్.. బీఆర్ఎస్ ప్రభావం శూన్యం
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు టీఆర్ఎస్‌ను కాస్తా బీఆర్‌ఎస్‌గా మార్చేవారు గులాబీ పార్టీ బాస్ కేసీఆర్.. ఆంధ్రప్రదేశ్‌పై కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.. తోట చంద్రశేఖర్‌తో పాటు మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు సహా మరికొందరు నేతలు బీఆర్ఎస్‌లో చేరనున్నారు.. మరోవైపు, ఏపీలోని 175 స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని.. గెలిచేది కూడా తామేనని ధీమా వ్యక్తం చేశారు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి.. అంతేకాదు, పోలవరం, ఏపీకి ప్రత్యేక హోదా విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.. దీంతో, ఏపీలో రాజకీయ సమీకరణలు మారనున్నాయా? బీఆర్ఎస్ పట్టుభిగిస్తుందా? అనే చర్చ సాగుతోన్న తరుణంలో.. బీఆర్ఎస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని.. గుడివాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభావం ఉండదని స్పష్టం చేశారు.
దిశ ఎన్ కౌంటర్ పై మరోసారి విచారణ
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ ఎన్ కౌంటర్ పై తాజాగా నేడు మరోసారి విచారణకు రానుంది. సిర్పూర్కర్ కమిషన్ నివేదికపై విచారించాలని హైకోర్టును గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో గత నెల 19న హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఈ క్రమంలో నేడు దిశ ఎన్‌కౌంటర్ కేసుపై మరోసారి విచారణ జరగనుంది. ఎన్కౌంటర్‌లో పాల్గొన్న వారిపై క్రిమినల్ చర్యలకు ఆదేశించాలని బాధితుల తరఫు పిటిషనర్ హైకోర్టును కోరారు. అయితే.. 2019 డిసెంబర్ 6న నలుగురు ఎన్ కౌంటర్ అయ్యారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు జ్యుడిషియల్ సిర్పూర్కర్ కమిషను ఏర్పాటు చేసింది. ఎన్ కౌంటర్ బూటకం అని సిర్పూర్కర్ కమిషన్ తేల్చి చెప్పింది. చట్టపరమైన నిబంధనలను, పోలీస్ మాన్యువల్ రూల్స్ ను అతిక్రమించారని తెలిపింది కమిషన్. మీడియాకు విచారణ కమిషన్ కు పోలీసులు కట్టుకథలు చెప్పారని కమిషన్ తెలిపింది. ఎన్ కౌంటర్ స్థలంలో సీసీ కెమెరా పుటేజ్ దొరక్కుండా చేసిందని రిపోర్ట్ ఇచ్చింది సిర్పూర్కర్ కమిషన్.
నా చొక్కా చింపేసిన వారికి రిటర్న్ గిఫ్ట్ గ్యారంటీ
పోలీసుల తీరుపట్ల టీడీపీ సీనియర్ నేత చింతమనేని ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 3న తన పుట్టినరోజు సందర్భంగా ఏలూరు రక్తదాన శిబిరం ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు చింతమనేని ప్రభాకర్ వెళ్లగా పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు తన చొక్కా చింపివేశారని ప్రెస్‌మీట్‌లోనే చింతమనేని ప్రభాకర్ తన చొక్కా విప్పి చూపించారు. అత్యుత్సాహంతో తన చొక్కా చింపిన పోలీసులకు రిటర్న్ గిఫ్ట్ ఉంటుందని చింతమనేని హెచ్చరించారు. ఇప్పటికే తనపై 31 కేసులు పెట్టారని.. మరిన్ని కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చింతమనేనికి పట్టిన గతి పడుతుందని తనను ఉదాహరణగా చూపాలని ఈ ప్రభుత్వం అనుకుంటోందని ఆరోపించారు. తన బట్టలు చించిన పోలీసులకు రేపు బట్టలుంటాయా అని ప్రశ్నించారు. ఆశ్రమ కళాశాలలో పిల్లల ఫీజులు ఎలా కట్టారో తమకు తెలియదా అని చింతమనేని ప్రభాకర్ విమర్శలు చేశారు. దీనికి సంబంధించి అన్ని వివరాలు త్వరలోనే బయట పెడతామన్నారు. జగన్ తాత దిగొచ్చినా తెలుగుదేశం పార్టీని ఏమీ చేయలేరన్నారు.
విరాట్ కోహ్లీ పై బంగర్ ఆసక్తికర కామెంట్స్
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీపై మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. కోహ్లీ చాలా తక్కువ కాలంలోనే ఎక్కువ సెంచరీలు పూర్తి చేశాడు. ఇది చిన్న విషయం కాదని.. అతడు త్వరలోనే సచిన్‌ను కూడా దాటేస్తాడని బంగర్ వాఖ్యానించాడు. ఈ ఏడాది టీమిండియా 26 నుంచి 27 వన్డే మ్యాచ్‌లను ఆడుతుందని.. వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్ చేరితే అది అదనం అన్నాడు. కాబట్టి ఈ మైలురాయిని ఈ ఏడాదిలోనే కోహ్లీ అందుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయని బంగర్ అన్నాడు. అయితే ఈ ఫీట్ సాధించడం కోహ్లీకి అంత ఈజీ కాదని బంగర్ అభిప్రాయపడ్డాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో సెంచరీ సాధించిన కోహ్లీ.. ఆ తర్వాత రెండు టెస్టుల్లో పెద్దగా ఆకట్టుకోలేదు. మూడు ఫార్మాట్లలో ఆడుతున్న కోహ్లీ వంటి ఆటగాళ్లు అడ్జస్ట్ అవడం కష్టమని బంగర్ చెప్పుకొచ్చాడు. కోహ్లీ మూడు ఫార్మాట్లలో ఆడుతున్నాడు కాబట్టి ఈ ఫీట్ సాధించాలంటే ఒక్క బంతికి కూడా కాన్సంట్రేషన్ మిస్ కాకూడదన్నాడు.
నెల్లూరు చేపల పులుసును నెలరోజుల్లోనే బంద్… జబర్దస్త్ కమెడియన్ షాకింగ్
జబర్దస్త్ ద్వారా పరిచయమై కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్న నటుడు కిర్రాక్ ఆర్పీ. నాగబాబు, రోజా జడ్జిలుగా ఉన్న సమయంలోనే ఆర్పీ షో నుంచి బయటికి వచ్చేశాడు. అనంతరం నిర్మాతగా మారి ఒక సినిమా తీసి చేతులు కాల్చుకున్నాడు. మళ్లీ తిరిగి కామెడీనే నమ్ముకొని మరో ఛానెల్ లో కమెడియన్ గా సెటిల్ అయ్యాడు. ఇక ఈ మధ్యనే జబర్దస్త్ గురించి అందులో ఉన్నవారి గురించి ఒక ఇంటర్వ్యూలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడి షాక్ ఇచ్చాడు. ఇక కామెడీ షోలు అన్ని పక్కన పెట్టి నెల క్రితమే కూకట్ పల్లిలో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే పేరుతో ఒక కర్రీ పాయింట్ ఓపెన్ చేశాడు. ఊహించని విధంగా ఈ కర్రీ పాయింట్ ఓ రేంజ్ లో దూసుకుపోయింది. అక్కడికి వచ్చే జనాన్ని ఆపలేక ఆర్పీ బౌన్సర్లను కూడా పెట్టాడు. దాదాపు లక్షల్లో లాభాలను ఆర్జించడం మొదలుపెట్టాడు ఆర్పీ. నెల్లూరు నుంచి ఫ్రెష్ చేపలను తెచ్చి.. మంచిగా వండుతుండడంతో జనాలు కర్రీ పాయింట్ కు క్యూ కట్టారు.
‘ఐరావతం’ సీక్వెల్ కు సన్నాహాలు!
గత యేడాది వచ్చిన సినిమాల్లో థ్రిల్లర్ బేస్డ్ హారర్ మూవీస్ కు చక్కని ఆదరణ లభించింది. ముఖ్యంగా చక్కని కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమాలను జనం బాగా ఆదరించారు. మరో విశేషం ఏమంటే… ఈ తరహా సినిమాలు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లోనూ తమ సత్తాను చాటాయి. ఆ కోవకు చెందిందే ‘ఐరావతం’ చిత్రం. పలు బుల్లితెర సీరియల్స్ లో కథానాయకుడిగా నటించిన అమర్ దీప్ చౌదరి హీరోగా నటించిన సినిమా ‘ఐరావతం’. ఈ మూవీతో ప్రముఖ మోడల్ తన్వీ నెగ్గి హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ మొదటి సినిమాలోనే ఆమె ద్విపాత్రాభినయం చేయడం విశేషం. ఇక సెక్సీ క్యారెక్టర్స్ తో యూత్ ను గత కొంతకాలంగా ఆకట్టుకుంటున్న ఎస్తేర్ నొర్హా ‘ఐరావతం’లో తన ఇమేజ్ కు పూర్తి భిన్నమైన పాత్రను చేసి మెప్పించింది. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ శిష్యుడు సుహాస్ మీరా ఈ సినిమాను ఆద్యాంతం ఆసక్తికరంగా మలిచారు. దాంతో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ‘ఐరావతం’ సినిమాకు విశేష ఆదరణ లభిస్తోంది. ఇంతవరకూ ఈ సినిమా 100 మిలియన్ అండ్ ఫిఫ్టీ ధౌజండ్ వ్యూయింగ్ మినిట్స్ ను పొంది, తెలుగు సినిమాల్లో టాప్ ఫైవ్ ప్లేస్ ను పొందిందని నిర్మాత రాంకీ పలగాని, బాలయ్య చౌదరి చల్లా, లలిత కుమారి తోట తెలిపారు.