Big Breaking: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది.. రోడ్లపై సభలు, ర్యాలీలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.. ప్రజల భద్రత దృష్ట్యా ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం.. ఇక, జాతీయ, రాష్ట్ర, పంచాయతీ రాజ్, మున్సిపల్, మార్జిన్లకు నిబంధనలు వర్తింపజేయనున్నారు.. ప్రత్యామ్నాయ ప్రదేశాలు ఎంపిక చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం.. రోడ్లకు దూరంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండే ప్రదేశాలు ఎంపిక చేయాలని ఆదేశాల్లో పేర్కొంది సర్కార్.. ఎంపిక చేసిన ప్రదేశాల్లోనే సభలకు షరతులతో కూడిన అనుమతి ఇవ్వాలని స్పష్టం చేసింది.. ఇక, షరతులు ఉల్లంఘిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొంది.. ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ హోంశాఖ. కాగా, ఈ మధ్య టీడీపీ అధినేత నిర్వహించిన రెండు సభల్లో దురదృష్టకరమైన ఘటనలు చోటు చేసుకున్నాయి.. కందుకూరులో ఎనిమిది మంది మృతి చెందగా.. తాజాగా గుంటూరులో ముగ్గురు మృత్యువాత పడిన విషయం విదితమే.
Read Also: Astrology : జనవరి 03, మంగళవారం దినఫలాలు