* నేడు భారత్-శ్రీలంక మధ్య తొలి టీ20.. ముంబై వేదికగా రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్న మ్యాచ్
* నేడు గోదావరి బోర్డు, 11న కృష్ణా బోర్డు సమావేశం.. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి కసరత్తు, కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్ధేశిస్తూ కేంద్రం గెజిట్ జారీ, తెలుగు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయ సాధనకు కేంద్రం యత్నం
* తూ.గో: నేడు రాజమండ్రిలో సీఎం జగన్ పర్యటన.. వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపు లబ్ధిదారులతో సీఎం జగన్ ముఖాముఖి
* కాకినాడ: నేడు తునిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనున్న మంత్రి దాడిశెట్టి రాజా
* తిరుమల: .వైకుంఠ ఏకాదశి రోజున శ్రీవారికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం.. ఏకాదశి పర్వదినం రోజున స్వామివారికి 7.68 కోట్ల రూపాయలను హుండీ ఆదాయంగా సమర్పించిన భక్తులు.. ఇప్పటి వరకు గత ఏడాది అక్టోబర్ 23వ తేదీన లభించిన రూ.6.31 కోట్లే అత్యధిక హుండీ ఆదాయం
* తిరుమల: జనవరి 11 వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం, సర్వదర్శనం భక్తులుకు తిరుపతిలో టోకేన్లు జారి చేస్తూన్న టిటిడి
* నెల్లూరు జిల్లా: నేడు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరులోని కస్తూర్బా కళాక్షేత్రంలో జరిగే వై.ఎస్.ఆర్.పెన్షన్ల కానుక కార్యక్రమంలో పాల్గొంటారు.
* అల్లూరి జిల్లా: వర్షాన్ని తలపిస్తున్న పొగ మంచు.. పాడేరు లో 15.. మినుములురు 13 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు
* సీఎం పర్యటన నేపథ్యంలో రాజమండ్రిలో ట్రాఫిక్ ఆంక్షలు, ఉదయం ఏడు గంటల నుంచి రాజమండ్రి నగరంలో ఆర్టీసీ బస్సులు దారి మళ్లింపు.. స్టేడియం రోడ్, వై-జంక్షన్ నుంచి ఆర్టీసీ బస్సులు జాతీయరహదారి మీదుగా డైవర్షన్, బహిరంగ సభకు వచ్చే వాహనాల కోసం పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు
* కడపలో పదో డివిజన్‌లో డిఫ్యూటీ సీఎం అంజద్‌బాష గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం
* విజయనగరం: గంట్యాడలో నేడు పెన్షన్ పంపిణీ కార్యక్రమం.. పాల్గొననున్న మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య..
* తిరుమల: ఇవాళ శ్రీవారిని దర్శించుకోనున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై
* తిరుపతి: నేడు పద్మావతి మహిళా యూనివర్సిటీ పాలక మండలి సమావేశం, నేడు శ్రీనివాసమంగాపురంలో ద్వాదశి ద్వారా దర్శనం
* చిత్తూరు జిల్లా: ఎస్ఆర్ పురం మండలం ఎస్ఎల్ వి కళ్యాణ మండపంలో నూతన పింఛన్ల పంపిణీ చేయనున్న డిప్యూటీ సీఎం నారాయణస్వామి
* చిత్తూరు: రేపటి నుండి ముడు రోజుల పాటు కుప్పంలో చంద్రబాబు పర్యటన
* శ్రీకాకుళం రూరల్ మండలం వప్పంగి గ్రామంలో గడపగడపకి మన ప్రభుత్వం కార్యక్రమం.. పాల్గొననున్న మంత్రి ధర్మాన.
* శ్రీకాకుళం: బూర్జ పంచాయితీలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం.. హాజరుకానున్న స్పీకర్ తమ్మినేని సీతారాం.