బీఆర్ఎస్ సరదా కోసం కాదు.. దేశం కోసం
తెలంగాణ భవన్ లో ఇవాళ సందడి నెలకొంది. ఏపీకి చెందిన నేతలు కొందరు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఏపీ నేతలకు స్వాగతం పలికారు సీఎం కేసీఆర్. ఏపీకి చెందిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, టీజే ప్రకాష్, రమేష్ నాయుడు, శ్రీనివాస్ నాయుడు, జేటీ రామారావు, వంశీ కృష్ణ, సతీష్ కుమార్, ఫణికుమార్, మణికంఠ, నయిముల్ హక్ లకు స్వాగతం పలికారు. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన సీఎం కేసీఆర్ పార్టీ సిద్ధాంతాల గురించి మాట్లాడారు. బీఆర్ఎస్ అంటే తమషా కోసమో, చక్కిలిగింతల కోసమో, దేశంలో ఒక మూల కోసమో, ఒక రాష్ట్రం కోసమో కాదు. బీఆర్ఎస్ ఈజ్ ఫర్ ఇండియా. కచ్చితంగా లక్ష కి.మీ. ప్రయాణం అయినా తొలి అడుగుతోనే ప్రారంభమవుతుంది. లక్ష్య శుద్ధి, సంకల్ప శుద్ధి ఉంటే.. సాధించలేనిదంటూ ఏమీ ఉండదు. ప్రపంచంలో మానవజీవితంలో అనేక పర్యాయాలు ఆ విషయాలు రుజువయ్యాయి అని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఏపీకి చెందిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్, మాజీ ఐఆర్ఎస్ చింతల పార్ఠసారథితో పాటు పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రసంగించారు.
మీ రాజకీయం కోసం జనాల్ని బలిచేస్తారా?
Perni Nani
టీడీపీ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని. టీడీపీ ఆధ్వర్యంలో దుర్మార్గమైన రాజకీయ కార్యక్రమం. 30 వేల మందికి చంద్రన్న సంక్రాంతి కానుకలు తయారు చేశారని ప్రకటించారు. ఖాళీ లారీలు పెట్టి మోసం చేస్తారా? మీటింగ్ కోసం, స్వచ్చంద సంస్థ పేరు చెప్పి రాక్షస క్రీడ జరపడం దారుణం అన్నారు. డ్రోన్ షాట్ల కోసం ఇలా చేస్తారు. గ్రాఫిక్స్ అలవాటు పడ్డారు. 2014 నుంచి దిక్కుమాలిన జబ్బు చంద్రబాబుకి తగ్గలేదన్నారు. మీ పాపాలు లెక్కకు మిక్కిలి చేస్తున్నారు. మీకు జనాల్ని ఆకర్షించే శక్తి లేదు. కొడుక్కి బాబుమీద నమ్మకం లేదు. కొడుకు పాదయాత్ర పోస్టర్ పై తండ్రి ఫోటో కూడా లేదు. చంద్రబాబు ఫోటో లేకుండా ఇలా చేయడం… బాబుమీద కొడుక్కి మీద నమ్మకం లేదు.. దత్తపుత్రుడి మీద నమ్మకం లేదు. సీపీఐ రామకృష్ణకు ఇష్టం అన్నారు.
నిరాహారదీక్ష విరమించిన హరిరామజోగయ్య
ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో దీక్ష విరమించారు మాజీ మంత్రి హరిరామ జోగయ్య. దీక్ష విరమించాలని పవన్ కళ్యాణ్ కోరారు. దీంతో పవన్ సూచన మేరకు దీక్ష విరమిస్తున్నానని ప్రకటించారు హరిరామ జోగయ్య. అంతకుముందు మాజీ మంత్రి చేగొండి హరి రామ జోగయ్యతో మాట్లాడాను… ఇది మూర్ఖపు, మొండి ప్రభుత్వం… కాపులకు రిజర్వేషన్లను వేరే విధంగా సాధించుకుందామని జోగయ్యకు చెప్పాను… జోగయ్య లాంటి వ్యక్తుల సలహాలు.. అనుభవం అవసరం అన్నారు పవన్ కళ్యాణ్.దీక్ష విరమించాలని జోగయ్యకు పవన్ కళ్యాణ్ ఫోన్ చేశారు. జోగయ్యకు నచ్చ చెప్పిన పవన్… దీక్ష విరమించాలని కోరారు. అన్ని రకాలుగా ఆలోచించి కార్యాచరణ రూపొందిద్దామని జోగయ్యకు పవన్ సూచించారు. మందులు కూడా వేసుకోకుండా నిరాహార దీక్షకు దిగడం బాధ కలిగిస్తోందన్నారు పవన్. ఒక్కసారిగా ఇంతటి సాహసం చేస్తే ఎలా అంటూ జోగయ్యకు పవన్ బుజ్జగించారు. పవన్ సీఎం కావాలి.. పవన్ ద్వారా రాష్ట్ర ప్రజలు బాగుండాలన్నదే తన కోరికన్నారు జోగయ్య. తాను వచ్చి జోగయ్యను కలుస్తానన్నారు పవన్. జోగయ్య మార్గ దర్శకత్వం వహించాలన్నారు పవన్. సీఎం జగన్ దిగి రావాలన్నదే తన ఆ ఆలోచనన్న జోగయ్య… పవన్ సూచనకు సానుకూలంగా స్పందించారు. దిగిరావాలంటే రాజకీయంగా ఆలోచన చేద్దామన్నారు పవన్. ఆమరణ దీక్షల్లాంటివి వద్దన్న జనసేనాని… కనీసం దీక్షకు విరామం ప్రకటించాలని జోగయ్యను కోరారు పవన్ కళ్యాణ్.
పవన్ ట్యాలెంట్ ని బయటకు తీసింది నేనే
నటుడు , నిర్మాత బండ్ల గణేష్ కు వివాదాలు లేకపోతే నిద్రపట్టేలా ఉండదేమో అంటున్నారు అభిమానులు. కావాలనే ఆయన వివాదాలను కొనితెచ్చుకుంటున్నారంటూ మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ కు భక్తుడును అని పవన్ అభిమానులు బండ్లను కూడా అభిమానిస్తారు. కానీ, గత కొన్ని రోజులుగా బండ్ల ప్రవర్తనలో మార్పు వస్తోందని వారు కూడా చెప్పుకొస్తున్నారు. మొన్నటికి మొన్న ఎన్టీఆర్ నా గాడ్ అని చెప్పుకొచ్చి పవన్ అభిమానులకు ఆగ్రహం తెప్పించాడు. ఇక ఇప్పుడు పవన్, త్రివిక్రమ్ లపై సంచలన వ్యాఖ్యలు చేసి మరోసారి హాట్ టాపిక్ గా మారాడు.ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బండ్ల గణేష్.. పవన్ కళ్యణ్ గురించి, త్రివిక్రమ్ గురించి మాట్లాడుతూ ఫైర్ అయ్యాడు. ” పవన్ కళ్యాణ్ కు బిగ్గెస్ట్ హిట్ ఇచ్చింది నేను.. నిజమైన పవన్ కళ్యాణ్ ను బయటకు తీసింది నేను.. విపరీతమైన ట్యాలెంట్ ఉన్నా ఆయన అద్భుతమైన వ్యక్తి.. ఆయనకో అతీతమైన వ్యక్తి అన్నారు బండ్ల గణేష్.
జగన్ తో కోటంరెడ్డి భేటీ.. విమర్శలపై వివరణ ఇచ్చిన ఎమ్మెల్యే
తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌తో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇటీవల కాలంలో ప్రభుత్వం, అధికారులపై కోటంరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో కోటంరెడ్డిని సీఎం జగన్ పిలిపించగా.. ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. అనంతరం వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉన్న సమస్యలనే తాను మాట్లాడానని.. తాను ప్రస్తావించిన సమస్యలను పరిష్కరించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారన్నారు. తన నియోజకవర్గంలో గడప గడపకు కార్యక్రమం వెనుకబడి ఉందని.. వేగం పెంచాలని సీఎం జగన్ సూచించారని కోటంరెడ్డి తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 141 రోజులు, మరోసారి 105 రోజులు గడప గడపకు కార్యక్రమం చేశానని.. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పలు దఫాలు ప్రతి గడపను టచ్ చేశానని ఎమ్మెల్యే కోటంరెడ్డి వివరించారు. తర్వాత అనారోగ్య కారణాల వల్ల గడప గడపకు కార్యక్రమ సమయాన్ని కాస్త తగ్గించాల్సి వచ్చిందన్నారు. నెమ్మదిగా అయినా కచ్చితంగా తిరగాలని సీఎం సూచించారన్నారు. పొట్టిపాలెం బ్రిడ్జ్, ఇళ్ళ స్థలాలు, దర్గా నిర్మాణం, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, గురుకుల పాఠశాల వంటి సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లినట్లు కోటంరెడ్డి తెలిపారు. తాను ఎక్కడా ప్రభుత్వంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదన్నారు. అధికారుల సహాయ నిరాకరణపైనే తాను మాట్లాడానని చెప్పారు.
ప్రజల సొమ్మును దోచుకోవడానికి సిగ్గుగా లేదు
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్, మంజు వారియర్ జంటగా హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం తునీవు. తెలుగులో తెగింపు పేరుతో రిలీజ్ కానుంది. బోనీ కపూర్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ కాంబోలో వలిమై సినిమా వచ్చిన సంగతి తెల్సిందే. ఇక ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం యాక్షన్ మోడ్ లో సాగిపోయింది. డబ్బు కోసం అజిత్ ఒక బ్యాంక్ ను కొల్లగొట్టాలనుకుంటాడు. దాని కోసం బ్యాంక్ లో ఉన్నారందరిని బందీలను చేస్తాడు. ఇక ఈ విషయం ప్రభుత్వానికి తెలియడం.. ఆ బ్యాంక్ లో కార్పొరేట్ సంస్థ షేర్స్ కోసం ఉంచిన డబ్బు కోట్లలో ఉండడంతో అజిత్ ను ఎలాగైనా అక్కడి నుంచి తప్పించాలని ప్రయత్నిస్తారు.అసలు రా ఏజెంట్ అయిన అజిత్ కు ఈ బ్యాంక్ దోపిడీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది. వాళ్ళ టీం మొత్తాన్ని బయట ఉంచి.. అజిత్ మాత్రమే లోపలకు ఎందుకు వెళ్ళాడు. అసలు ఆ డబ్బు ఎవరిది..?
2021తో పోలిస్తే 2022లో భారతీయ రైల్వేలకు భారీగా ఆదాయం
2021తో పోలిస్తే 2022లో భారతీయ రైల్వేలకు భారీగా ఆదాయం సమకూరింది. 2022 ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య ప్రయాణికుల నుంచి వచ్చే ఆదాయం గణనీయంగా పెరిగింది. ఈ మేరకు 71శాతం వృద్ధి కనబరిచిందని రైల్వేశాఖ వెల్లడించింది. 2022 ఏప్రిల్ నుంచి 2022 డిసెంబర్ మధ్య కాలంలో కేవలం ప్రయాణికుల నుంచి రూ.48,913 కోట్ల ఆదాయం వచ్చిందని రైల్వే శాఖ ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో కేవలం రూ.28,569 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చిందని గుర్తుచేసింది. రిజర్వుడ్ ప్యాసింజర్ కేటగిరీలో రూ.38,482 కోట్ల ఆదాయం వచ్చిందని.. ఇది గత ఏడాదితో పోలిస్తే 56 శాతం అధికమని వెల్లడించింది. 2022 ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 31 మధ్య అన్‌రిజర్వుడ్ ప్యాసింజర్ల నుంచి వచ్చిన ఆదాయం రూ.10,430 కోట్లుగా ఉందని తెలిపింది. గత ఏడాది ఈ సంఖ్య రూ.2,169 కోట్లుగా ఉందని వివరించింది. 2022 ఏప్రిల్, డిసెంబర్ మధ్య రిజర్వ్ ప్రయాణికుల సంఖ్య కూడా పెరిగిందని రైల్వే శాఖ వెల్లడించింది. ఈ వ్యవధిలో 59.61 కోట్ల బుకింగ్స్ జరిగాయని తెలిపింది. కిందటి ఏడాదితో పోలిస్తే ఇది 6 శాతం ఎక్కువ అని పేర్కొంది. కాగా 2021లో దేశంలో కరోనా ప్రభావం అధికంగా ఉంది. ఈ కారణంగా ప్రయాణాలపై కఠిన ఆంక్షలు ఉండేవి. రైళ్లు కూడా పరిమిత సంఖ్యలోనే తిరిగాయి. దీంతో రైల్వే శాఖ ఆదాయం పడిపోయింది.