Christamas: ఆదివారం క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఏపీ ప్రజలకు సీఎం జగన్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. కరుణ, ప్రేమ, దాతృత్వం, త్యాగం వంటి వాటిని క్రీస్తు తన జీవితం ద్వారా మానవాళికి అందించించిన గొప్ప సందేశాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు కరుణామయుడి ఆశీస్సులు, దీవెనలు లభించాలని జగన్ ఆకాంక్షించారు. మరోవైపు ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, కరుణ, సేవలతో కూడిన శాంతియుత జీవన మార్గాన్ని ఏసు ఈ ప్రపంచానికి అందించారని…
Botsa Satyanarayana: టీడీపీ అధినేత చంద్రబాబుపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. పార్టీని నిలబెట్టుకోవడానికి చంద్రబాబు తెగ తాపత్రయ పడుతున్నాడని ఆయన ఆరోపించారు. ఆయనకు జవసత్వాలు అయిపోయాయని.. అందుకే వాటిని నిలుపుకోవడానికి పర్యటనలు చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. నిర్మాణాత్మకమైన అంశాలు చెబితే ప్రజలు దాని గురించి ఆలోచిస్తారని.. కానీ అసత్యాలు చెప్తే నమ్మరనే సంగతి గుర్తుపెట్టుకోవాలన్నారు. రాజాం, బొబ్బిలి సభలలో చంద్రబాబు అన్నీ అసత్యాలే చెప్పారని మంత్రి బొత్స మండిపడ్డారు. బొబ్బిలి రైతు…
Andhra Pradesh: వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల్లో అత్యాధునిక హంగులతో నిర్మించిన నూతన బస్ టెర్మినల్‌ను సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించారు. మూడు రోజుల పర్యటన కోసం వైఎస్ఆర్ కడప జిల్లాకు విచ్చేసిన సీఎం జగన్ శనివారం నాడు పులివెందులలో నూతనంగా నిర్మించిన బస్ టెర్మినల్ ను ప్రారంభించారు. అనంతరం బస్ టెర్మినల్ ను సీఎం జగన్ స్వయంగా పరిశీలించి, ఆర్టీసీ కార్యాలయం, కాంప్లెక్స్ నిర్మాణ శైలిని ప్రయాణికుల సదుపాయాలను పరిశీలించారు. ప్రారంభోత్సవానికి ముందు సీఎం జగన్…
CM Jagan: కడప జిల్లా పులివెందులలో పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. గ్లాస్లో 75 శాతం నీళ్లు ఉన్నా నీళ్లు లేవని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కావాలనే మన ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మనకు ఓటు వేయని వారికి కూడా మంచి చేస్తున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు. గతంలో ఇదే రాష్ట్రమని.. ఇదే బడ్జెట్…
సార్వత్రిక ఎన్నికలకు ఇంకా సమయంలో ఉన్నా ఆంధ్రప్రదేశ్‌లో అప్పుడే ఎన్నికల పొత్తులపై చర్చలు సాగుతున్నాయి.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడడమే తన ధ్యేయమని ఒకరు అంటే.. అంతే ఏకమై.. ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలని మరికొందరు అంటున్నారు.. కానీ, తమకు జనసేన పార్టీతోనే పొత్తు.. మరో పార్టీ అవసరం లేదంటున్నారు భారతీయ జనతా పార్టీ నేతలు.. విశాఖలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ పొత్తుల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు.. జనసేనతో తప్ప…
ఎక్కడైనా వినియోగదారులను మోసం చేస్తే కఠిన శిక్షలు, భారీ జరిమానాలు తప్పవని హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి కార్మూరి నాగేశ్వరరావు.. జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో జాతీయ వినియోగదారుల దినోత్సవం నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో వినియోగదారుడు మోసపోయిన ప్రాంతానికే వెళ్లి ఫిర్యాదు చేయాల్సి వచ్చేది.. కానీ, ఇప్పుడు ఎక్కడి…
45 నిమిషాల్లోనే అయిపోయిన శ్రీవారి టికెట్లు.. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు పరితపిస్తుంటారు.. రోజులతో సంబంధం లేకుండా వేలాది మంది శ్రీవారిని దర్శించుకుంటారు.. అయితే, ప్రత్యేక రోజుల్లో మరింత రద్దీగా ఉంటాయి తిరుమల గిరులు.. ఇక, వైకుంఠ ఏకాదశి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. వైకుంఠ ద్వారం ద్వారా శ్రీవారిని దర్శించుకోవాలని భక్తులు లక్షలాదిగా తరలివస్తారు.. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ కూడా ఏర్పాట్లు చేస్తూ వస్తుంది.. ఇక ఈ ఏడాది వైకుంఠ…
GVL Narasimha Rao: అధికారం పోగానే చంద్రబాబు హైదారాబాద్ వెళ్లిపోయారు.. 2024 ఎన్నికల తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిస్థితి గంతే.. లోటస్ పాండ్‌లో కూర్చుంటారు అంటూ జోస్యం చెప్పారు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేంద్ర ప్రభుత్వం అన్ని సహాయసహకారాలు అందిస్తున్నా రాష్ట్రంలో సుపరిపాలన లేదని విమర్శించారు.. వైసీపీ, టీడీపీ సొంత వ్యాపారాల కోసం పరిపాలనను ఉపయోగించుకున్నాయని ఆరోపించారు. అయితే, బీజేపీ మాత్రమే ఏపీని అభివృద్ధి చేసే…