తన సొంత జిల్లా కడపలో పర్యటిస్తున్నర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఇవాళ ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు.. మూడు రోజులపాటు జిల్లా పర్యటనలో భాగంగా నిన్న ఇడుపులపాయకు చేరుకున్నారు. నిన్న కడప, కమలాపురం ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ముగించుకుని ఇడుపులపాయకు వెళ్లిన సీఎం.. ఇవాళ ఉదయం వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు.. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.. అనంతరం వైఎస్ విగ్రహానికి పూల మాల వేసి…
ఆంధ్రప్రదేశ్లోని ప్రతి రైతు కుటుంబంపై రూ.2,45,554 అప్పు ఉన్నట్లు పార్లమెంట్లో ప్రకటించారు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్.. రైతుల రుణ భారంలో దేశంలోనే ఏపీ టాప్లో ఉందని.. రెండు, మూడు స్థానాల్లో కేరళ, పంజాబ్ ఉంటే.. రూ. 1,52,113 తలసరి అప్పుతో తెలంగాణ ఐదో స్థానంలో ఉందని ఆయన రాజ్యసభలో వెల్లడించారు. తలసరి రుణ భారం రూ. 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, కేరళ, పంజాబ్ ఉన్నాయని.. జాతీయ సగటు కంటే…
శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు విడుదల కలియు ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి ప్రతీరోజూ వేల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు.. ఇక, వైకుంఠ ఏకాదశి వచ్చిందంటే.. తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడుతుంటాయి.. అయితే, భక్తుల రద్దీ దృష్ట్యా.. వైకుంఠ ద్వార దర్శనానికి ప్రత్యేకంగా టికెట్లు తీసుకొచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. శ్రీవారి ఆలయంలో జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం కోసం శ్రీవాణి టికెట్ల ఆన్లైన్…
ప్రేమ పేరుతో అబ్బాయిల చేతిలో మోసపోయిన అమ్మాయిలు ఎంతో మంది ఉంటారు.. కొన్ని కథలు ప్రేమతో ఆగిపోతే.. మరికొన్ని పెళ్లి వరకు వెళ్తాయి.. తీరా పెళ్లి అయిన తర్వాత శారీరక వాంఛలు తీరిన తర్వాత.. వారి ఆలోచన విధానం మరోలా ఉంటుంది.. ఎవరైనా ప్రేమించుకుంటే.. ఏ గుడికో.. మరో ప్రార్థనా మందిరానికో వెళ్లి పెళ్లి చేసుకుంటారు.. రహస్య వివాహాలు చేసుకుని.. కాపురం పెట్టినవారు కూడా ఉన్నారు.. అయితే, ఓ ప్రబుద్ధుడి వ్యవహారం మొత్తం ఆది నుంచి అనుమానాస్పదంగా…
Rains Alert: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి అల్పపీడనంగా మారింది.. ఈ అల్పపీడనం వాయువ్య దిశగా పయనిస్తూ గురువారం నాటికి వాయుగుండంగా మారిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఈ వాయుగుండం పశ్చిమ నైరుతి దిశగా కదిలే అవకాశం ఉందని పేర్కొంది.. అయితే, దీని ప్రబాశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖాధికారులు చెబుతున్నారు.. ఆంధ్రప్రదేశ్ తో పాటు తమిళనాడు రాష్ట్రంలో కూడా వర్షాలు కురిసే అవకాశం…
కలియు ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి ప్రతీరోజూ వేల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు.. ఇక, వైకుంఠ ఏకాదశి వచ్చిందంటే.. తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడుతుంటాయి.. అయితే, భక్తుల రద్దీ దృష్ట్యా.. వైకుంఠ ద్వార దర్శనానికి ప్రత్యేకంగా టికెట్లు తీసుకొచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. శ్రీవారి ఆలయంలో జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం కోసం శ్రీవాణి టికెట్ల ఆన్లైన్ కోటాను విడుదల చేసేందుకు సిద్ధమైంది.. ఇవాళ ఉదయం…
* హైదరాబాద్: నేడు మహాప్రస్థానంలో కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు.. ఉదయం 11 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో కైకాల అంత్యక్రియలు * కడప జిల్లాలో నేడు రెండో రోజు సీఎం జగన్ పర్యటన.. మధ్యాహ్నం వరకు ఇడుపులపాయలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొననున్న సీఎం.. వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి, ప్రత్యేక ప్రార్థనలు చేయనున్న సీఎం.. మధ్యాహ్నం పులివెందులలో ఆర్టీసీ బస్టాండ్ తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్న జగన్.. * పశ్చిమ గోదావరి జిల్లా: భీమవరంలో…
Chandra Babu: కడప జిల్లా కమలాపురంలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు విజయనగరం జిల్లా బొబ్బిలి బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. జగన్ తరహాలో తాను ఒక రాష్ట్రం ముఖ్యమని.. అధికారం ముఖ్యమని చెప్పను అని.. తనకు తెలుగు జాతి ముఖ్యమని.. తెలుగు ప్రజలు ముఖ్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలుగు ప్రజలు ఎక్కడుంటే తాను అక్కడ ఉంటానని.. వాళ్లకు ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని తెలిపారు. తెలుగు జాతి…