Sajjala: ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రతిపక్షాలపై మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రతిపక్షం టీడీపీ మాయలమరాఠీగా మీడియా మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకుని అబద్దాలను ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. పరిపాలన ఎలా ఉండాలో మూడున్నర ఏళ్లలో సీఎం వైఎస్ జగన్ ఒక మోడల్‌గా నిలిచారని సజ్జల అన్నారు. ఎస్సీలలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని 2019 వరకు అధికారంలో ఉన్న వ్యక్తి అనలేదా అని ప్రశ్నించారు. ఇపుడు అదే వ్యక్తి తన చంద్రన్న కానుక, విదేశీ…
Kesineni vs Devineni: బెజవాడ ఎంపీ కేశినేని నాని వ్యవహారం ఇప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో కాకరేపుతోంది.. తనకు నచ్చని వారికి టికెట్ ఇస్తే అంతే.. సహకరించేది లేదని మొహమాటం లేకుండా చెప్పేస్తున్నారు.. ఇక, ఇవాళ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు విషయంలోనూ అదే వైఖరి ప్రకటించారు.. ఎన్టీఆర్ జిల్లా జక్కంపూడి కాలనీలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కేశినేని నాని… దేవినేని ఉమకు ఝలక్ ఇచ్చే వ్యాఖ్యలు చేశారు..…
కేశినేని బ్రదర్స్.. నాని కామెంట్లపై చిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు.. అన్న కేశినేని నాని వ్యాఖ్యలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టీడీపీ నేత, నాని తమ్ముడు కేశినేని చిన్ని.. ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా నడుస్తాం.. పార్టీ కోసం శ్రమిస్తున్నాం అన్నారు.. ఎన్టీఆర్ జీవితం మాకూ.. అందరికీ ఆదర్శం అన్నారు.. కానీ, గొల్లపూడిలో పార్టీ కార్యాలయం విషయంలో ప్రభుత్వం వైఖరి సరికాదని మండిపడ్డారు. ఇక, కేశినేని నాని కామెంట్లపై…
High Court: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరోసారి ఇద్దరు అధికారులకు శిక్ష విధించింది.. కోర్టు ధిక్కరణ కేసులో ఐఆర్ఎస్ అధికారి రామకృష్ణ, ఐఏఎస్ అధికారి బూడితి రాజశేఖర్ కు నెల రోజుల పాటు జైలు శిక్షతో పాటు 2000 రూపాయల జరిమానా విధించింది హైకోర్టు.. అయితే, కోర్టుకు భేషరతుగా క్షమాపణలు చెప్పారు అధికారులు రామకృష్ణ, రాజశేఖర్.. ఇద్దరు అధికారులు కోర్టును క్షమాపణ కోరడంతో.. ఆ తర్వాత తీర్పును సవరించిన హైకోర్టు.. ఇవాళ సాయంత్రం వరకు కోర్టులోనే నిలబడాలని అధికారులకు…
Devineni Uma: దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయాలే అజెండా.. పేదవాడి వద్దకు ప్రజాప్రతినిధులను తీసుకెళ్లింది ఆయనేనని గుర్తుచేసుకున్నారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు.. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో నిర్వహించిన ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అయితే, స్థల వివాదంతో కలెక్టర్ ఆదేశాల మేరకు మైలవరం టీడీపీ కార్యాలయానికి తాళాలు వేశారు పోలీసులు.. తాళాలేసిన టీడీపీ కార్యాలయాన్ని పరిశీలించిన దేవినేని ఉమ, కేశినేని చిన్ని… వర్ధంతి కార్యక్రమం సందర్భంగా…
Kesineni Chinni:కేశినేని బ్రదర్స్ వ్యవహారం ఆ మధ్య ఏపీ రాజకీయాల్లో.. ముఖ్యంగా బెజవాడ పాలిటిక్స్‌లో హీట్ పెంచింది.. అయితే, ఈ మధ్య ఓవైపు ఇతర పార్టీల నేతలను టీడీపీలోకి ఆహ్వానిస్తూనే.. పార్టీ అధిష్టానంపై సంచల వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు ఎంపీ కేశినేని నాని.. నాకు ఎవరూ సీటు ఇవ్వాల్సి అవసరం లేదు.. పోటీ చేస్తే గెలుస్తానని చెప్పుకొచ్చిన ఆయన.. అంతే కాదు.. కొన్ని నియోజకవర్గాల్లో ఎవరికి సీటు కేటాయించాలి అనే విషయంలోనూ హాట్ కామెంట్లు చేశారు.. వచ్చే…
గులాబీ పార్టీ బాస్ ప్రసంగంపై ఉత్కంఠ మరో కొత్త చరిత్రకు నాంది పలుకుతున్నారు తెలంగాణ సీఎం, గులాబీ పార్టీ బాస్ కె.చంద్రశేఖర్‌రావు.. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చిన తర్వాత తొలి సారీ ఖమ్మం వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు.. ఇప్పటికే ఈ సభ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.. తెలంగాణ జైత్రయాత్ర సాగించిన పోరు భూమి మరో సమర నినాదానికి సిద్ధమైంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పి.. మతోన్మాద శక్తుల నుంచి దేశాన్ని…
Srisailam: శ్రీశైలంలో ఇవాళ్టితో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.. సాయంత్రం అశ్వవాహనంపై పూజలు అందుకోనున్నారు ఆదిదంపతులు.. ఆలయంలో శ్రీస్వామి, అమ్మవారికి ఆలయ ఉత్సవం నిర్వహించనున్నారు.. రాత్రి పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంతసేవతో సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు ముగింపు పలకనున్నారు.. ఏడు రోజుల పంచాహ్నిక దీక్షతో నిత్యం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అలంకారాలు భక్తులను కనువిందు చేస్తున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరవరోజు అనగా మంగళవారం ఉదయం శ్రీచండీశ్వరస్వామికి షోడశోపచార క్రతువులు చేశారు. అటుపై దేవస్థానం ఈవో లవన్న ఆధ్వర్యంలో…
APSRTC: జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్.. ఖమ్మం వేదికగా బీఆర్ఎస్ తొలి సభను నిర్వహిస్తున్నారు.. ఈ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.. ఇప్పటికే మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు.. మాజీ ముఖ్యమంత్రులు, జాతీయ నేతలు.. రాష్ట్ర నేతలు ఇలా.. చాలా మంది హాజరుకాబోతున్నారు.. ఇదే సమయంలో.. భారీ ఎత్తున జన సమీకరణ జరుగుతోంది.. ఓవైపు తెలంగాణలోని వివిధ జిల్లాలతో పాటు.. సరిహద్దులోని ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ప్రజలు తరలివస్తున్నారు.. దీని కోసం భారీ జన…
* ఢిల్లీ: నేడు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం.. పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్న కేంద్రం.. * నేడు భారత్ వర్సెస్ న్యూజిలాండ్ తొలి వన్డే.. ఉప్పల్ వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం.. * నేడు స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతి.. ఏపీ, తెలంగాణలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు, హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించనున్న జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ * నేడు ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ.. హాజరుకానున్న ఢిల్లీ,…