Parthasarathy: కేసీఆర్ జాతీయ పార్టీ నేతగా ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం కృషి చేస్తారని తెలిపారు బీఆర్ఎస్ నేత పార్థసారథి.. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేసీఆర్ ఎప్పుడైనా ఆంధ్ర పాలకులు, పెట్టుబడిదారుల దోపిడీనే ప్రశ్నించారు.. కానీ, ప్రజలను ఆయన ఎప్పుడూ దూషించలేదని స్పష్టం చేశారు.. ఇక, కేసీఆర్ సీఎం అయ్యాక.. తెలంగాణలో ఉన్న ఏపీ ప్రజలను అభివృద్ధిలో భాగస్వామ్యం చేశారని తెలిపారు. విభజన హామీలు అమలు చేయకుండా బీజేపీ ప్రభుత్వం ఏపీకి అన్యాయం చేసిందని విమర్శించారు.. కేసీఆర్…
Passenger Train: విశాఖపట్నం జిల్లాలో ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది.. అయితే, డ్రైవర్ అప్రమత్తతో భారీ ప్రమాదం తప్పింది.. ఇవాళ ఉదయం అనంతగిరి మండలం కాశీపట్నం దగ్గర విశాఖ – విశాఖ – కిరండోల్ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పినట్టు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో పట్టాలపై నుంచి పక్కకు ఒరిగిపోయింది ఓ బోగీ.. డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది.. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో ప్రయాణికులు, కుటుంబసభ్యులు, రైల్వే అధికారులు ఊపిరిపీల్చుకున్నారు..…
Police Station: అనంతపురం జిల్లా రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఓ దొంగ అనుమానాస్పద మృతి కేసు పోలీసులపై వేటు పడేలా చేసింది.. ఈ ఘటనపై కల్యాణదుర్గం డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ.. రాయదుర్గంలో గొర్రెల దొంగతనం జరగడంతో ఇద్దరు దొంగలను స్థానికులు పట్టుకుని సోమవారం తమకు అప్పగించారు. సోమవారం ఉదయం 10:30 గంటలకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈరోజు రిమాండ్‌కు పంపవలసి ఉంది. రామాంజనేయులు అలియాస్ అంజి, శ్రీనివాసులు ఆత్మకూరు మండలం సనప గ్రామానికి చెందినారు. రామాంజనేయులపై దాదాపు…
Kottu Satyanarayana: టీడీపీతో పాటు.. జనసేన పార్టీని, ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తూ వస్తోంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. అవకాశం దొరికినప్పుడల్లా.. పవన్‌పై సంచలన విమర్శలు చేస్తున్నారు.. అయితే, పవన్ కల్యాణ్.. చంద్రబాబు సీఎం అవ్వడం కోసం పనిచేస్తున్నాడని ఆరోపించారు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ.. కానీ, పవన్ కల్యాణ్ వెనకాల వచ్చేవాళ్లు మాత్రం పవన్ సీఎం అవ్వాలనుకుంటున్నారని తెలిపారు.. మరోవైపు, వైసీపీ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుంది.. మాకు…
ఇవాళ హైదరాబాద్‌కు మూడు రాష్ట్రాల సీఎంలు.. కేరళ, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నేడు హైదరాబాద్ రానున్నారు. జనవరి 18న జరగనున్న బీఆర్ఎస్ బహిరంగ సభలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంతన్ ఖమ్మం పాల్గొననున్నారు.యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కూడా ఈరోజు హైదరాబాద్ చేరుకోనున్నారు. వీరంతా రేపు ఉదయం సీఎం కేసీఆర్‌తో కలిసి ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రికి వెళ్లనున్నారు. స్వామివారి దర్శనానంతరం అందరూ ఖమ్మం సభకు…
Sriharikota: శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లో వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి.. 24 గంటల వ్యవధిలోనే ఇద్దరు సీఐఎస్ఏఫ్ ఉద్యోగులు ఆత్మహత్య చేసుకోవడంతో.. అసలు షార్ సెంటర్లో ఏం జరుగుతోంది? అనే ఆందోళన మొదలైంది.. అయితే, ఈ ఘటనలను సీరియస్‌గా తీసుకున్న అధికారులు.. ఆత్మహత్యలపై విచారణ చేపట్టారు.. చెట్టుకు ఊరివేసుకుని ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కానిస్టేబుల్ చింతామణి ఆత్మహత్య చేసుకున్నారు.. 29 ఏళ్ల చింతామణి 2021లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు.. శిక్షణానంతరం శ్రీహరికోటలోని యూనిట్లో విధులు నిర్వహిస్తున్నాడు..…
MP Kesineni: టీడీపీ సీనియర్ నేత, బెజవాడ ఎంపీ కేశినేని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఎన్నికల్లో పోటీపై కీలక వ్యాఖ్యలు చేశారు.. పార్టీలతో నాకు పని లేదు.. ప్రజలు కోరుకుంటే నన్ను ఇండిపెండెంటుగా గెలిపిస్తారు.. చంద్రబాబు టిక్కెట్ ఇవ్వకుంటే ఏమవుతుంది..? అంటూ హాట్ కామెంట్లు చేశారు.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని నేనెక్కడా చెప్పలేదన్న ఆయన.. ప్రధాని నరేంద్ర మోడీని నిండు సభలో వ్యతిరేకించా.. అయినా బెజవాడలో పనులు ఆగాయా..? దటీజ్ కేశినేని నాని…
* ఢిల్లీ: నేటితో ముగియనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు * హైదరాబాద్: నేడు ఉప్పల్ స్టేడియంలో టీమిండియా ప్రాక్టీస్.. రేపు భారత్-కివీస్ వన్డే * నేడు శ్రీశైలంలో 6వ రోజు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు.. ఉదయం బ్రహ్మోత్సవాలు పూర్ణాహుతి, త్రిశూలస్నానం.. సాయంత్రం సదస్యం, నాగవలి బ్రహ్మోత్సవాలకు దేవతలను ఆహ్వానిస్తు కట్టిన ధ్వజపటాన్ని ధ్వజావరోహణం * తిరుపతి: నేడు మల్లయ్యపల్లి, డోర్ఢకంబాల, మఠంపల్లెలో జల్లికట్టు వేడుకలు.. * నేడు సంక్రాంతి మహోత్సవాల్లో భాగంగా శ్రీ మూలస్థాన ఎల్లమ్మకు…
Recording Dances: ఏపీలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. సంప్రదాయ ఉత్సవాల్లో భాగంగా పలుచోట్ల కోడిపందాలు, గుండాటలు, రికార్డింగ్ డ్యాన్సులు జరుగుతున్నాయి. అయితే అధికార పార్టీ నేతల అండతోనే ఇవి జరుగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంక్రాంతి సంబరాల పేరుతో బ్రహ్మంగారిమఠం మండలంలో జోరుగా రికార్డింగ్ డ్యాన్సులు జరుగుతున్నాయి. చెంచయ్యగారిపల్లెలో డీజే మాటున మహిళలతో అశ్లీల నృత్యాలను నిర్వహిస్తున్నారు. అధికార పార్టీ నేతల మద్దతుతో గతరాత్రి బహిరంగంగా రికార్డిండ్ డ్యాన్సులు ఏర్పాటు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.…