Payyavula Keshav: ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధానిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు.. రాబోయే రోజుల్లో విశాఖపట్నం రాజధాని కాబోతుంది.. త్వరలో నేను కూడా విశాఖపట్నం షిఫ్ట్ అవుతున్నాను అంటూ దౌత్య వేత్తల సమావేశంలో స్పష్టం చేశారు.. విశాఖపట్నంలో జరిగే అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సుకు మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నా అంటూ వ్యాఖ్యానించారు సీఎం జగన్.. ఈ వ్యవహారం ఇప్పుడు.. ఏపీ రాజకీయాల్లో కాకరేపుతోంది.. సీఎం జగన్ వ్యాఖ్యలపై స్పందించిన టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్… సీఎం జగన్ విశాఖ రాజధాని ప్రకటన వెనుక అనేక కారణాలు ఉన్నాయన్నారు.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ వేగం పెంచడంతో ఉన్నఫలంగా సీఎం విశాఖ రాజధాని ప్రకటన చేశారని ఆరోపించారు.. హత్య జరిగిన రోజు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సెల్ ఫోన్‌లో ఎవరెవరితో మాట్లాడిన అంశం కీలకంగా మారిందన్నారు..
Read Also: Union Budget 2023: పార్లమెంట్‌లో ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
అయితే, ఆ కాల్ డేటా వివరాలు వెలుగులోకి రాకుండా ప్రజల దృష్టిని మరల్చేందుకే సీఎం వైఎస్ జగన్.. విశాఖ రాజధాని ప్రకటన చేశారని ఆరోపించారు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్.. ఏపీ రాజధాని అమరావతి అని హైకోర్టు స్పష్టం చేసిందని గుర్తుచేసిన ఆయన.. ఈ తీర్పుపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన అప్పీల్ పెండింగ్‌లోనే ఉందన్నారు.. ఇలాంటి సమయంలో సీఎం జగన్ ప్రకటన హైకోర్టు దిక్కరణే అవుతుందన్నారు పయ్యావుల కేశవ్. కాగా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. ఏపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించిన విషయం విదితమే.. కానీ, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన సీఎం జగన్.. రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.. అందులో భాగంగానే విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధాని ఏర్పాటు చేసేందుకు సిద్ధం అయ్యారు.