Off The Record: సోము వీర్రాజుకు వ్యతిరేకంగా రోజుకో వివాదం.. అసలు పక్కన పెట్టి కొసరుపై చర్చ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: నిన్నటి వరకు కన్నా లక్ష్మీనారాయణ వ్యవహారం ఏపీ బీజేపీలో హాట్ టాపిక్. బీజేపీ అగ్రనేతల్లో ఒకరైన శివప్రకాష్‌తో కన్నా భేటీ తర్వాత ఆ జోరు చాలా వరకు తగ్గిందని ఊపిరి పీల్చుకుంది ఏపీ శాఖ. ఇప్పుడు కొత్త అంశం దుమారం రేపుతోంది. ఆ మధ్య జాతీయ కార్యవర్గ సమావేశాలకు సోము వీర్రాజు ఢిల్లీ వెళ్లారు. హస్తిన చేరుకోగానే సోము వీర్రాజు తీవ్ర అస్వస్థతకు లోనై.. ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారని సోషల్ మీడియాలో కొందరు పోస్టులు పెట్టారు. దానిని బాగా వైరల్ చేశారు కూడా. ఈ అంశమే బీజేపీలో కలకలం సృష్టిస్తోంది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న బీజేపీ ఏపీ నాయకత్వం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తణుకుకు చెందిన బాలుశ్రీ.. కాకినాడకు చెందిన యార్లగడ్డ రాంకుమార్‌లపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో ప్రస్తావించారు. ఇక్కడో ట్విస్ట్ ఉంది. యార్లగడ్డ రాంకుమార్ బీజేపీ అనుబంధ విభాగం కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గంలో సభ్యుడు. ఇదే కాషాయ పార్టీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
Read Also: Off The Record: కాకినాడ రూరల్ కొత్త సమీకరణాలు..? సైకిల్ హ్యాండిల్ కొత్త వారికి ఇస్తారా?
Also Read
బీజేపీకి యార్లగడ్డ రాంకుమార్ చాలాకాలంగా సేవలందిస్తున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే సోము వీర్రాజు వ్యవహార శైలి.. ఆయన నిర్ణయాలతో రామ్ వివిధ సందర్భాల్లో విభేదించేవారట. బహిరంగంగా కాకున్నా.. పార్టీ నేతల సమక్షంలో తన అభిప్రాయాలను రామ్ కుండబద్దలు కొట్టేవారని సమాచారం. సోము వీర్రాజు తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసేవారట. తాజాగా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అదే రాంకుమార్‌పై ఆరోపణలు చేయడం చూస్తుంటే.. పాత కక్షలను మనసులో పెట్టుకుని ఫిర్యాదు చేశారా? అని బీజేపీలోని ఓ వర్గంలో చర్చ జరుగుతోందట. సొంత పార్టీ వారి మీదే కేసు పెట్టడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారట. సోము వీర్రాజు వర్గం మరో అంశాన్ని చర్చకు పెడుతోంది. రాంకుమార్ బీజేపీ నేతైనా ఆయన మనసు మాత్రం టీడీపీతో ఉందని ఆరోపిస్తున్నారు. టీడీపీతో పొత్తు ఉండబోదని వీర్రాజు చెప్పిన ప్రతీసారీ రాంకుమార్ తెగఇబ్బంది పడిపోయి.. సోషల్ మీడియాలో పార్టీ అధ్యక్షుడిపై వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తుంటారని విమర్శిస్తున్నారు. రాంకుమార్‌కు సొంత పార్టీ ప్రయోజనాల కంటే.. పక్క పార్టీ ప్రయోజనాలే ముఖ్యమనేది వీర్రాజు వర్గం చేస్తున్న వాదన. అందుకే రాంకుమార్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చగా మారింది.
Read Also: Off The Record: అసెంబ్లీ ఎన్నికల బరిలో బండి సంజయ్.. అనుచరుల సమావేశంలో చెప్పేశారా?
తాను తప్పుచేశానని భావిస్తే పోలీసులకు ఫిర్యాదు చేసే ముందు తన వివరణ ఎందుకు అడగలేదని రామ్ ప్రశ్నిస్తున్నారు. అయితే ఆయన పేరుతో తప్పుడు ప్రచారం జరుగుతున్నప్పుడు స్వయంగా రామ్ ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదనేది సోము వర్గం కౌంటర్ ఇస్తోంది. ఏపీ బీజేపీలో కొంతకాలంగా జరుగుతున్న ఈ పరిణామాలను చూస్తున్న వారికి చిరాకు పుట్టిస్తోందట. పార్టీలో ఉన్నది పది మంది నేతలైతే.. 20 గొడవలు పెట్టుకుంటున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారట. ప్రతి అంశాన్నీ భూతద్దంలో నుంచి చూడడం సోము వర్గానికి.. సోము వ్యతిరేకవర్గానికి రివాజుగా మారిందంటున్నారు. అసలు బీజేపీని ఏ విధంగా బలోపేతం చేయాలి..? ఏయే కార్యక్రమాలు చేపట్టాలి అనే అంశాల కంటే.. ఈ ఛోటా మోటా అంశాల మీద చిల్లర పంచాయితీలేంటని కొందరు కమలనాధులు గుర్రుగా ఉన్నారట.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!